WFTW Body: 

2కొరింథీ 2:14లో "క్రీస్తునందు ఎల్లప్పుడూ మమ్మును విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము" అని పౌలు చెప్పుచున్నాడు. లివింగ్ బైబిలులో ఈ వచనము ఈ విధముగా ఉన్నది, "క్రీస్తు మా కొరకు చేసి ముగించిన దానినిబట్టి ఆయన మనపై విజయం సాధించాడు దేవునికి వందనములు". కాబట్టి మనము విజయములో జీవించడానికి, మన జీవితములో కూడా దేవుడు అన్ని విషయములలో జయించాలి.

ఒక రోజున ప్రభువైనయేసు ఎదుట ప్రతిమోకాలు వంగును మరియు ప్రతినాలుకయు యేసే ప్రభువని ఒప్పుకొనును (ఫిలిప్పీ 2:10,11). కాని ఇప్పుడే మీలో ఉన్న ప్రతీకోరిక ఆయన ఎదుట వంగి యేసే ప్రభువని ఒప్పుకోవాలి. మీలో ఉన్న దురాశలు మోకరించి మరియు మీ శరీరమునకు యేసే ప్రభువని ఒప్పుకోవాలి.

"దక్షిణదిక్కు(అరికాలు) మొదలుకొని ఉత్తరదిక్కు(తల) వరకు అందరిని నిర్మూలము చేయుటకై నా ఖడ్గము దాని ఒరలో నుండి బయలుదేరియున్నది. యెహోవానైన నేను నా ఖడ్గము మరల ఒరలోపడకుండ దాని దూసియున్నానని జనులందరు తెలిసికొందురు" (యెహెజ్కేలు 21:4,5).

ప్రభువైన యేసుక్రీస్తుకే అన్నిటిలో ప్రాముఖ్యముండునట్లు దేవునిని మనలో పనిచేయనివ్వాలి (కొలస్సి 1:18). దానిని నీవు గురిగా పెట్టకొనినచో అప్పుడు నీ జీవితములో మరియు ఆయనకు నీవు సాక్షిగా ఉండుటలోను అన్ని సమయములలో దేవునియొద్దనుండి సహాయము పొందెదవు.

నీ సమయమును నీ డబ్బును ఖర్చుపెట్టే విషయములోనూ, నీవు పుస్తకము చదివే విషయములోను నీవు వినే సంగీతము విషయములోను, నీవు చూచే టీ.వీ. కార్యక్రమములోనూ, నీ స్నేహితుల విషయములోనూ, నీ మాటల విషయములోనూ, ప్రతీ విషయములోను, క్రీస్తుకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈ విధముగా యేసుని నీ సమస్తముపై ప్రభువుగా చేయాలి. అప్పుడు నీయొక్క ప్రతివిషయములో దేవుడు జయమిచ్చెనని చెప్పగలవు. ఇది ఒక్కరాత్రిలోనే జరుగదు. కాని చాలా కాలము పడుతుంది మరియు దానిలో కొనసాగుము. అప్పుడు దినము తరువాత దినము, సంవత్సరము తరువాత సంవత్సరము ఆ గురియొద్దకే అంతకంతకు చేరుదుము.

ప్రభువైనయేసు దేవుని గొఱ్ఱెపిల్లగా లోకపాపములు మోసుకొనిపోయెను. ఇప్పుడు మన విషయములో ఇతరులు చేసే పాపములు భరించుటకు వధకు తేబడే గొఱ్ఱెలుగా మనము ఉన్నాము(రోమా 8:36). మోరియా పర్వతము మీద ఉన్న కట్టెలు మరియు అగ్ని అనగా మన జీవితములో ఉన్న పరిస్థితులన్నియు సిద్ధముగా ఉన్నవి. కాని ప్రశ్న ఏమిటంటే ఇస్సాకు తన తండ్రిని అడిగినట్లుగా, "గొఱ్ఱెపిల్ల ఎక్కడ ఉంది?" (ఆదికాండము 22:7). దీని జవాబు ఏమనగా, "ఆ గొఱ్ఱెపిల్లవు నీవే".