WFTW Body: 

పరిశుద్ధాత్మయొక్క పరిచర్య త్రిత్వములో ఉన్న పరిచర్యలన్నిటికంటే కంటికి కనబడని పరిచర్య. తన పరిచర్యకు ఎటువంటి గుర్తింపుకాని ఘనతనుగాని కోరక నిశ్శబ్దముగా కనబడకుండా పరిశుద్ధాత్ముడు ప్రొత్సహించి మరియు సహాయపడతాడు. తండ్రిని మరియు కుమారుడైన యేసును స్తుతించి మరియు ఆయనను స్తుతించకపోయినను ఆయన సంతృప్తిపడతాడు. ఇది ఎంత సుందరమైన పరిచర్య. అటువంటి ఆత్మతో నింపబడుట అనగా ఏమిటి? అనగా మనము కూడా ఆయనవలె అటువంటి పరిచర్య కలిగి అనగా నిశ్శబ్దముగా కంటికి కనబడకుండా ఎటువంటి ఘనతను కొరక ఇతరులు ఘనతపొందునప్పుడు తృప్తిపడేవారిగా ఉంటాము. ఇటువంటి ఆత్మతో మనము నిజముగా నింపబడియున్నామా? కాని ఈనాడు "పరిశుద్ధాత్మలో నింపబడియున్నామని" చెప్పుకొనువారనేకులు, వారికున్న వరములను క్రైస్తవుల మధ్య ఉపయోగించుట ద్వారా ఘనతను కోరుచూ వారిని హెచ్చించుకొనుచు మరియు వారి కొరకు డబ్బును అడుగుచున్నారు. ఇది పరిశుద్ధాత్మయొక్క పరిచర్యకాదు. ఇది మరియొక నకిలీఆత్మ పరిచర్య. మరియు ఇటువంటి నకిలి పరిచర్యను మరియు మోసమును సంఘములో బహిర్గతము చేయుట మన బాధ్యత.

ప్రకటన 4:10లో పరలోకములోని ఒక దృశ్యాన్ని మనము చూస్తాము. అక్కడ పెద్దలు "తమ కిరీటములను దేవుని సింహాసనము ఎదుట వేసిరి" అని చదువుతాము. పరలోకములో ప్రభువైనయేసు తప్ప మరి ఎవరును కిరీటములు ధరించరు. మిగిలిన మనమందరమును అక్కడ సామాన్య సహోదర సహోదరీలుగా ఉంటాము. పరలోకంలో ప్రత్యేకమైన సహోదరులు కాని సహోదరీలుగాని ఉండరు. సంఘములో ప్రత్యేకమైన సహోదరులుగాగాని సహోదరీలుగాగాని ఉండాలని కోరేవారు సంఘములోనికి నరకముయొక్క వాతవరణమును తెస్తారు. దేవునియెదుట మనం నిలబడినప్పుడు దేనిని బట్టి మనం గర్వించము. మనకున్నదంతయు ఆయన యెదుట పడవేసెదము. పరలోకంలో "ఇది నాది" అని దేనిని గురించైనను ఎవ్వరు చెప్పరు (అతడు పొందుకొనిన కిరీటము గురించి కూడా చెప్పరు).

మన సంఘములలో కూడా పరలోకవాతావరణం వచ్చినప్పుడు, మనము దేనిని కలిగియున్నప్పటికిని "ఇది నాది" అని చెప్పము. సమస్తం దేవునిదైయున్నవి మరియు భూమి మీద దేవునిరాజ్య సువార్త విస్తరించుటకు ఉచితముగా అందుబాటులో ఉండును.

తన కొరకే జీవిస్తూ మరియు తన స్వంతము కొరకే జీవించే స్వార్ధపరులెవరైనను సాతాను ఆధీనములో ఉన్నారు. భూమి మీద తనయొక్క అనేకలక్షలమంది పిల్లలు సహవాసం లేకుండుట చూచి దేవుని హృదయం చాలా బాధలో ఉన్నది. చాలామంది ఇతరులను ద్వేషించుచున్నారు. దేవుడు తమను మాత్రమే ఎన్నుకొన్నాడనియు, ఇతరులను ఎన్నుకొనలేదనియు ఊహించుకొనే స్వనీతిపరులైన పరిసయ్యులు ఉన్నారు. వీరందరు సంఘముయెడల దేవుని నిత్యసంకల్పమునకు అభ్యంతరముగా ఉన్నందుచేత, దేవుడు ఈ రెండు రకాల పరిచర్యలను బట్టి చాలా చింతిస్తున్నాడు.

ఎవరైతే పరలోకవాతావరణమును సంఘములోనికి తెస్తారో, ఎవరైతే సంఘములోని సహోదర సహోదరీల మధ్య సహవాసం కలిగేటట్లు చేస్తారో, అటువంటి వారే ఏ సంఘములోనైనను విలువైన సహోదరుడు మరియు సహోదరి. మరియు అతడు సంఘపెద్ద అయియుండనవసరం లేదు. అటువంటి విలువైన సహోదర, సహోదరీలగుటకు మనందరికి అవకాశమున్నది.

మన కూటములలోనికి కాని లేక గృహములోనికి కాని పరలోకసంబంధమైన తాజాగా ఉండే పరిశుద్ధ వాతావరణమును తేచ్చే అటువంటి సహోదరుడు సహోదరి గురించి ఆలోచించండి. అటువంటి సహోదరి లేక సహోదరుడు ఎంతో విలువైనవాడు. వారు 5 నిమిషములు దర్శించినప్పటికిని నీవు ఎంతో సేదదీర్చబడెదవు. అనగా నీ ఇంటిలోనికి పరలోకం వచ్చినట్లే నీకు అనిపిస్తుంది. అతడు ప్రసగం చేయకపోవచ్చును లేక లేఖనములలోని ప్రత్యక్షతలు చెప్పకపోవచ్చును. కాని అతడు పరిశుద్ధుడు. అతడు నిరాశగా ఉండడు మరియు అతనికి ఎవరి మీదను ఫిర్యాదులు ఉండవు. అతడు కూటములో మొదటిగా మాట్లాడకపోవచ్చును(చాలా మంది కోరుకొనుచున్నట్లుగా). అతడు ప్రతి మీటింగులో 15వ వాడిగా ఉండి 3 నిమిషములే మాట్లాడినప్పటికిని, ఆ మూడు నిమిషాలు మీటింగుకు పరలోకం తెచ్చినట్లే ఉంటుంది.

ఈ లోకమంతయు ఫిర్యాదులు చేసే వారితోను, సణిగే వారితో నిండియున్నది కాబట్టి అటువంటి సహోదరుని కలిసికొనుట ఎంతో తాజాగా ఉండును. అది మండుటెండలో స్నానం చేసినట్లుగా ఉంటుంది. ఇటువంటి సహోదరుడుగా మరియు సహోదరిగా ఉండుటకు మనమెల్లప్పుడు కోరుకోవాలి. ప్రభువైనయేసు ఆవిధముగా ఉన్నారు మరియు మనము ఆవిధముగా ఉండాలని ఆయన కోరుచున్నారు.