WFTW Body: 

క్రొత్త నిబంధన అంతటిలో పూర్తి పరిశుద్ధాత్మ పరిచర్యను ఎక్కువగా వివరించే వచనము 2 కొరింథీ 3:18 అని నేను కనుగొన్నాను. నా జీవితములో పరిశుద్ధాత్ముడు ప్రభువైనప్పుడు, స్వాతంత్ర్యమును తీసుకొనివచ్చును (2కొరింథీ 3:17). ఆయన నన్ను స్వతంత్రునిగా చేయును. "ప్రభువు యొక్క ఆత్మ యెక్కడ నుండునో, అక్కడ స్వాతంత్ర్యము నుండును". దేనినుండి స్వాతంత్ర్యం? పాపమునుండి, ధనాపేక్షనుండి, దౌర్భాగ్యమైన తండ్రుల, తాతల, పెద్దల మరియు ఆ విధమైన ఆచారములనుండి, ప్రజలు నాగురించి మంచిగా ఆలోచించినా లేక విమర్శించినా వారి అభిప్రాయములనుండి స్వాతంత్ర్యము. ఇది ఒక బ్రహ్మాండమైన విడుదల. మనుష్యులను కాక కేవలము దేవునినే సేవించే స్వాతంత్ర్యము. దీనినే పరిశుద్ధాత్మ తీసుకొనివచ్చును (2 కొరింథీ 3:18). బైబిలులో ప్రభువైనయేసు మహిమను పరిశుద్ధాత్ముడు నాకు చూపించును. బైబులే అద్దం. ఈ అద్దంలో నేను యేసు మహిమను చూస్తాను. పరిశుద్ధాత్ముడు కేవలం సిద్ధాతములను, ప్రసంగములనే కాక, యేసు మహిమను కూడా బైబిలులో చూపించును - కొందరు సిద్ధాంతములు, ప్రసంగముల కొరకే బైబిలు చదువుతారు. క్రొత్త నిబంధనలో ఉన్నదంతయు యేసు మహిమను నాకు చూపించుట కొరకే ఉన్నది. నేను ఆ మహిమను చూస్తుండగా, ఆ పోలికలోనికి మార్చబడే మరొక పనిని పరిశుద్ధాత్ముడు నా హృదయములో చేస్తున్నాడు. ఇదే పరిశుద్ధాత్ముడు చేసే పని.

"పరిచర్య గురించి ఏమిటి?" అని ప్రజలు చెపుతుంటారు. ప్రభువైనయేసు యొక్క పరిచర్యను చూచియున్నాను గనుక నేను కూడా ఆ విధముగా పరిచర్య చేసేదను. ప్రభువైనయేసు ఏవిధముగా త్యాగములు చేసి మరియు అనేక ప్రాంతములకు వెళ్ళి పరిచర్య చేశాడో అలాగే నేను కూడా త్యాగములు చేయుచు మరియు అనేక ప్రాంతములకు వెళ్ళి బోధించెదను. నీ పరిచర్య తగ్గిపొతుంది అని అనుకొనవద్దు. నీవు మరి ఎక్కువగా త్యాగములు చేయుచు పరిచర్య చేసేదవు. 2 కొరింథీ 3:17,18లో చెప్పిన రీతిగా పరిశుద్ధాత్ముడు నీ జీవితములోను మరియు పరిచర్యలోను పనిచేయుటకు నీవు అనుమతించిన యెడల నీ జీవితములోను మరియు పరిచర్యలోను మార్పు పొందెదవు. నీవు క్రొత్త నిబంధన యొక్క పరిచారకుడవగుదువు మరియు దాని చేయుటకు పూర్తికాలపు పరిచారకుడవు కానవసరము లేదు. సంఘములో ఉన్న ఏ సహోదరుడైనను లేక ఏ సహోదరియైనను క్రొత్త నిబంధన పరిచారకుడు అవ్వవచ్చు.

"ఈ పరిచర్యకు మేము సామర్థ్యులమని కాదు" (2 కొరింథీ 3:5). ఈ పరిచర్యకు కావలసినవి మా వలన అయినట్లుగా కాదుకాని, "మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది". దేవునిని సేవించుటకు క్రొత్త నిబంధన సేవకుడు తనలోని దేనిమీద కూడా ఆధారపడడు. సమస్తము దేవునినుండి వచ్చును. "దేవా, నీవు నాకు ఇవ్వుము, నేను పంచిపెడతాను". ఇది ద్రాక్షారసమును పంచిపెట్టిన సేవకుల వలె ఉన్నది. ఆ సేవకులు నీటిని యేసు దగ్గరకు తెచ్చారు, ఆయన దానిని ద్రాక్షారసముగా మార్చారు, వారు పంచిపెట్టారు. శిష్యులు ఐదు రొట్టెలను యేసు దగ్గరకు తీసుకొని వచ్చారు, ఆయన వాటిని రెట్టింపు చేశాడు వారు పంచిపెట్టారు. అదేవిధముగా మనకున్న కొద్ది వనరులను దేవునియొద్దకు తెచ్చినట్లయితే, ఆయన దానిని అభిషేకించి, ఆశీర్వదించి, రెట్టింపు చేయును. మనము ఆ విధముగా సేవించాలి. దేవునిని సేవించిన అనేక సంవత్సరాల తరువాత, అనేకమంది నిరుత్సాహం, నిరాశ, వ్యాకులానికి లోనవుతారు. వారి సామర్థ్యము చేత సేవించడానికి చూసినందున అలసిపోయారు. ఆయనను సేవించడానికి మనకు శారీరక ఆరోగ్యమును కూడా ఇవ్వడానికి దేవుడు అవసరమని నేను నమ్ముతున్నాను. దేవుని సేవించడానికి నీవు ఒక కష్టమైన ప్రదేశమునకు వెళ్ళితే నీకు శారీరక ఆరోగ్యం అవసరమై ఉంది. "బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు" అనే వాగ్దానము గూర్చి ఆలోచించండి. మన సామర్థ్యము దేవుని వలన కలుగును. నీవు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు "మా సామర్థ్యము దేవుని వలన కలుగును" అనే వచనం నీకు ఉన్నది. క్రొత్త నిబంధనలో నీకు ఏమి కావాలన్నా, మన సామర్థ్యము దేవుని వలన కలుగును.

ఆయన మనలను క్రొత్త నిబంధన సేవకులుగా చేశాడు. క్రొత్త నిబంధనలో మనము అక్షరమునకు కాక ఆత్మకు సేవకులము(2 కొరింథీ 3:6). శిక్షావిధికి కారణమైన పరిచర్య, నీతికి కారణమైన పరిచర్య అనే రెండు రకముల పరిచర్యలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి (2 కొరింథీ 3:9). శిక్షావిధికి కారణమైన పరిచర్య ఏమిటి? నీవు బోధించునప్పుడు ప్రజలు నేరారోపణతో వెళ్ళి పోవడమే శిక్షావిధికి కారణమైన పరిచర్య. నీవు అందరిని దోషులుగా ఒప్పింపచేసినందున ఇది ఒక అద్భుతమైన పరిచర్య అని నీవు అనుకొనవచ్చును. అది పాత నిబంధన. "నీవు ఇంకా సరిగా లేవు, నీవు ఎప్పటికి సరిగా ఉండవు" అని ధర్మశాస్త్రము నేరారోపణ చేస్తుంది. "నీవు ఇంకా సరిగా లేవు, నీవు ఎప్పటికి దానిని చేరుకోలేవు. నీవు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు" అని అనేక రకాలైన బోధ ఈనాడు క్రైస్తవ కూటములలో ముఖ్యముగా ఊజ్జీవకూటములని పిలువబడెకూటములలో బోధింపబడుతుంది. వారందరు అక్కడ కూర్చోని నేరారోపణకు లోనవుతారు. అది క్రైస్తవబోధ కాదు. క్రైస్తవబోధ ప్రజలను నీతిలోనికి, మహిమలోనికి నడిపిస్తుంది. వారు ఒప్పింపబడినప్పటికి, ప్రొత్సహించబడి, స్వస్థపరచబడి, కూటము చివరికి విడుదల పొంది, నిరీక్షణతో వెళ్తారు. నీ బోధ ప్రజలను బంధకములలోని ఎప్పుడైనను తెచ్చినట్లయితే, నీవు క్రొత్త నిబంధన సేవకుడవు కావని రూఢిపరచుకోవచ్చు. ప్రజలు నీ పరిచర్య వలన ప్రోత్సహింపబడకుండా నేరారోపణకు గురి అయినట్లయితే, అది పాత నిబంధన బోధ. ప్రజలను పైకి లేపకుండా క్రిందకు తోసినట్లయితే, అది పాత నిబంధన బోధ. క్రొత్త నిబంధన బోధ ప్రజలను పైకిలేపి వారికి నిరీక్షణ ఇస్తుంది.

2 కొరింథీ 4:1లో పౌలు తన పరిచర్యను వివరిస్తున్నాడు. "కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడినవారమై అధైర్యపడము". అధైర్యపడటం అనగా నిరుత్సాహపడటం. అపొస్తలుడైన పౌలు కూడా నిరుత్సాహపడుటకు శోధించబడ్డాడు. కనుక నీవు నిరుత్సాహపడుటకు శోధింపబడినట్లయితే, అది పరిచర్యలో వింతైనది కాదు. నిరుత్సాహపడుటకు నేను కూడా అనేక సార్లు శోధించబడ్డాను. "మేము నిరుత్సాహపడము. మా కన్నులు యేసు మీద ఉంచి దేవుడు మాకు అప్పగించిన బ్రహ్మాండమైన పరిచర్యను తలంచుకొని నిరుత్సాహపడుటకు తిరస్కరించాము" (2 కొరింథీ 4:2).