వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   క్రీస్తుయెడల భక్తి
WFTW Body: 

అపొస్తలుడైన పౌలు ఎఫెసిలో మూడు సంవత్సరాలు నివసించి రాత్రింబగళ్ళు వాక్యాన్ని బోధించాడు(అపొ.కా. 20:31). అనగా పౌలు యొక్క అనేక వందల ప్రసంగాలు వారు వినియున్నారు. వారి మధ్యలో దేవుడు చేసిన అద్భుతమైన మహాత్కార్యాలను చూశారు(అపొ.కా. 19:11). రెండు సంవత్సరములలోనే ఆ ప్రాంతము నుండి ఆసియాలోని అనేక ప్రాంతములకు సువార్త వ్యాపించింది. వారు ఉజ్జీవాన్ని అనుభవించారు(అపొ.కా. 19:10,19). అపొస్తలుల కాలములో ఉన్న సంఘములన్నిటిలో ఇది ఎంతో ధన్యతను పొందిన సంఘము. ఆ కాలములో ఆసియా మైనర్‍లో ఇది ఎంతో ఆత్మీయసంఘము (ఇతరసంఘములకు వ్రాసినట్లుగా పౌలు ఎఫెసీ సంఘాన్ని దిద్దుబాటు చేస్తూ పత్రిక వ్రాయలేదు). కాని పౌలు ఎఫెసీ సంఘాన్ని విడిచి వెళ్ళేటప్పుడు, తరువాత తరములో, నూతన నాయకత్వం క్రింద సంఘము దిగజారిపోవునని అక్కడ పెద్దలను పౌలు హెచ్చరించాడు. క్రూరమైన తోడేళ్ళు వచ్చి, మందను కనికరింపక, శిష్యులను ప్రభువు వెంట కాక తమ వెంట తోడుకొనిపోవలెనని బయలుదేరెదరని పౌలు వారికి చెప్పాడు(అపొ.కా. 20:29,30).

ఆ సంఘములో పౌలు ఉన్నంతకాలము, ఎఫెసి సంఘములోనికి ఒక్క తోడేలు కూడా వచ్చుటకు ధైర్యము చెయ్యలేదు. పౌలు నమ్మకమైన ద్వారపాలకుడుగా ఉన్నాడు(మార్కు 13:34). అతడు తన స్వంతమునుగాక ప్రభువుకిష్టమైన వాటినే కోరి మరియు దేవునియెడల భయభక్తులు కలిగియుండి, అభిషేకము కలిగియున్నాడు కాబట్టి ఆత్మీయ అధికారము కలిగియున్నాడు. ఎఫెసు సంఘుములోని పెద్దలయొక్క ఆత్మీయస్థితిని ఎరుగునట్లు పౌలు వివేచన కలిగియున్నాడు. ఎఫెసులో ఖచ్చితముగా భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని పౌలు పెద్దలకు ప్రవచనము చెప్పలేదు. కేవలము వారిని హెచ్చరించాడు. పెద్దలు తమ్ముతాము విమర్శించుకొని మరియు మారుమనస్సు పొందినట్లయితే, పౌలు చెప్పినట్లు జరిగియుండెడిది కాదు.

యోనా ఒకసారి నీనెవె నాశనమును గూర్చి ప్రవచించాడు. కాని ప్రజలు మారుమనస్సు పొందియున్నారు కాబట్టి అతడు చెప్పినట్లు జరుగలేదు. ఎఫెసి సంఘము కూడా ఆవిధముగా తప్పించుకొనియుండెడిది. కాని, ఎఫెసి సంఘములోని క్రొత్త పెద్దలు పౌలు హెచ్చరికను తీవ్రముగా తీసుకోలేదు మరియు ప్రభువులో నుండి తప్పిపోయారు. ఆ శతాబ్దము యొక్క ఆఖరున మూడవ తరము వారు నాయకులైయ్యారు. అప్పుడు పరిస్థితులు మరీ దిగజారియున్నవి. వారి సిద్ధాంతములు సరిగానే ఉన్నాయి మరియు క్రైస్తవపరిచర్యలో ఎంతో ఆసక్తిగా ఉన్నారు. బహుశా వారు రాత్రంతయు ప్రార్ధించే కూటములు మరియు ప్రత్యేకకూటములు వారు కలిగియుండవచ్చును. కాని ప్రభువు వారి దీపస్తంభమును తీసివేయునంతగా వారు దిగజారియున్నారు. వారి తప్పేమిటి? ప్రభువుయెడల వారికున్న మొదటి ప్రేమను వారు కోల్పోయారు(ప్రకటన 2:4,5).

ఎఫెసీ సంఘచరిత్ర మనకేమి బోధిస్తుంది? ఏమిటనగా ప్రభువైనక్రీస్తుయెడల నున్న ప్రేమ, పవిత్రతకంటే ఏ సిద్ధాంతము ముఖ్యముకాదు. నిజమైన ఆత్మీయ ఎదుగుదలకు ఒకేఒక గుర్తున్నది. అది ఏమనగా క్రీస్తుజీవము మనలో అంతకంతకు విస్తరించి, ఆ జీవాన్ని మన ప్రవర్తనద్వారా వ్యక్తపరచుటయు మరియు అందునుబట్టి ప్రభువును మరియెక్కువగా ప్రేమించుటయే.

తన జీవితకాలమంతయు పౌలు ప్రభువైనయేసును ప్రేమించి మరియు నమ్మకమైన అపొస్తలుడుగా ఉన్న ఒక దైవజనుడు. "ప్రభువుయెడల నున్న సరళత" నుండియు, పవిత్రతనుండియు త్రిప్పివేయుటకు సాతాను ప్రతి ప్రయత్నమును చేస్తాడని ప్రతిచోటనున్న విశ్వాసులను పౌలు హెచ్చరించాడు (2 కొరింథీ 11:3). "నీటి బాప్తీస్మము, పరిశుద్ధాత్మ బాప్తీస్మము" అను సిద్ధాంతములలో చిన్నపొరపాటులు క్రీస్తు యెడలనున్న ప్రేమను కొల్పోవడం కంటే ప్రమాదకరమైనవి కావు. కాని అనేకమంది విశ్వాసులు దీనిని గుర్తించుట లేదు. పౌలు కూడా తన తరములో మాత్రమే దేవుని సంకల్పము ప్రకారము పరిచర్య చేశాడు. తిమోతివలె అతనితో జీవించినవారును అతనిలో ఉన్న ఆత్మను పొందుకొని మరియు స్వార్థములేని వారుగా క్రీస్తుకొరకు జీవించారు (పిలిప్పీ 2:19-21). అయినప్పటికిని పౌలు తాను నిర్మించిన సంఘములలో రెండవతరము వారితో తన యొక్క ఆత్మీయతను పంచుకొనలేకపోయాడు.