WFTW Body: 

మనము సమూయేలు 18వ అధ్యాయములో సౌలు కుమారుడైన యోనాతాను దావీదుపట్ల కలిగియున్న చక్కని వైఖరిని గూర్చి చదువుతాము. యోనాతాను నిశ్చయముగా దావీదుకంటే పెద్దవాడైయున్నాడు మరియు సింహసనమునకు వారసుడైయున్నాడు. అప్పుడు ఇశ్రాయేలులో పేరుపొందిన దావీదును ద్వేషించియుండవచ్చును మరియు అతనికి అభ్యంతరముగా ఉండవచ్చును. కాని దానికి బదులుగా దావీదు విషయములో అతని హృదయములో ప్రేమ మరియు గౌరవమున్నట్లుగా చూచుచున్నాము. ఇది యోనాతాను తన వ్యక్తిగత అభివృద్ధి కంటే దేవుని మహిమను గూర్చియు మరియు ఇశ్రాయేలుయొక్క మేలును గూర్చియు ఎక్కువ ఆసక్తి కలిగియున్నాడని తెలియజేయుచున్నది. అందువలన తన తండ్రికి వచ్చిన అసూయ అనే తెగులు అతనికి రాలేదు. అతని హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. అతడు తన రాచ వస్త్రమును, తన కత్తిని మరియు తన విల్లును తీసి దావీదునకు ఇచ్చెను. ఆవిధముగా ఇచ్చుటను బట్టి ఈలాగున చెప్పుచున్నాడు. దావీదు ఇవి నీకిచ్చుట ద్వారా సింహసనమునకు నీవే నిజమైన వారసుడవని తేలియజేయుచున్నాను. నీకు వ్యతిరేకముగా కత్తి మరియు విల్లుతో నేను పోరాడను. నాకు నేనుగా నేను లోబడెదను (1 సమూయేలు 18:4).

యోనాతాను ఎంత మంచి యౌవనస్తుడు. 1 సమూయేలు 14వ అధ్యాయములో ఫిలిష్తియులను జయించుట ద్వారా దేవునియందు తన విశ్వాసమును గూర్చి చదువుచున్నాము. మరియు ఇక్కడ అసూయనుండి పూర్తిగా స్వతంత్రుడైయుండుటను మరియు దేవుని చేత అభిషేకము పొందినవారిని వివేచించగలుగుటను మనము చూచుచున్నాము.

ఒక యౌవన సహోదరుని మీద దేవుని అభిషేకమును పెద్ద సహోదరుడు గుర్తించి మరియు తన పరిచర్యను అతడు నడుపునట్లు అనుమతించుట ఎంతో అద్భుతకరమైనది.

అటువంటి మంచి మాదిరిని బర్నబాలో కూడా చూచెదము. అపొ.కా. 13:2లో దేవుడు బర్నబాను మరియు పౌలును పిలిచినట్లుగా చదివెదము. బర్నబా పౌలు కంటె అనుభవములోను మరియు వయస్సులోను పెద్దవాడు గనుక అతని పేరు మొదట ఉండుట సహజమే. కాని అతిత్వరలో వారు పౌలు మరియు బర్నబా (అపొ.కా. 13:43వ) గా మారెను. ఎందువలన? తన యౌవన సహోదరుడైన పౌలుకు తనకంటె ఎక్కువ అభిషేకము కలదని చూచి దయగలవాడై తనకు తానుగా వెనుకకు తగ్గెను.

యోనాతాను మరియు బర్నబావలె తన స్వంతమును కోరక, ఎటువంటి అసూయ లేకుండా, దానికి బదులుగా దేవుని మహిమను మాత్రమే కోరి మరియు తమకంటె ఎక్కువ అభిషేకముకలిగిన యౌవ్వనసహోదరులకు సహయపడుటకు వేగిరపడినయొడల, భూమిమీద యేసుక్రీస్తు సంఘము ఎంతో శక్తిగలిగి ప్రభావితము కలుగజేసియుండెడిది.

సౌలు తన దయదాక్షిణ్యాలపైన ఆధారపడియున్నపుడు దావీదు అతని ప్రాణము తీయకుండా విడిచిపెట్టిన దయావైఖరి మనము 1 సమూయేలు 24:4,5లో చూస్తాము. కావాలనుకుంటే అతనిని చంపగలిగియుండేవాడినని చూపించడానికి సౌలు వస్త్రములో ఒక చిన్న ముక్కను కోసినందుకే దావీదు మనస్సాక్షి అతన్ని ఒప్పింపజేసెను. ఇది వినినప్పుడు సౌలు కన్నీరు విడిచిన్నప్పటికీ అతడు ఇంటికి తిరిగివెళ్లి కొంత కాలము తరువాత దావీదును మరలా వేటాడటము మొదలుపెట్టెను (1 సమూయేలు 26:2). అసూయ, కోపము, ద్వేషము అనువాటితో మనము నిర్దాక్షిణ్యముగా వ్యవహరించకపోతే అవి సముద్రతరంగముల వలే మరలా మరలా వచ్చే అవకాశముంది.

మనము 1 సమూయేలు 30వ అధ్యాయములో కొన్ని ఆసక్తికరమైన విషయాలను చూస్తాము. దావీదు ఒక క్లిష్ట పరిస్థితిలో తననుతాను కనుగొనెను. అతడు అతని మనుష్యులు యుద్ధానికి వెళ్లినప్పుడు అమాలేకీయులు వచ్చి అతని మనుష్యుల కుటుంబాలుంటున్న పట్టణమును నాశనము చేసి ఆ కుటుంబ సభ్యులను చెరపట్టుకొని పోయిరి. పరిస్థితి ఎంత ఘోరంగా ఉండెనంటే మనుష్యులందరు ఏడ్వడం మొదలుపెట్టి తమసమస్యలకు దావీదును నిందించుట మెదలుపెట్టిరి. రాళ్లు రువ్వి అతని చంపుదామనుకొనిరి(1 సమూయేలు 30:6). అప్పుడు మనము ఈ చక్కటి మాటలను చదువుతాము. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను(1 సమూయేలు 30:6). మన స్నేహితులు సహితము మనలను వ్యతిరేకించినప్పుడు అనుసరించుటకు దావీదు ఎంతో గొప్ప మాదిరిగా ఉన్నాడు. దావీదు మరల దేవుని వెదుకగా అమాలేకీయులను వెంటాడమని అతడు సమస్తమును తిరిగి తెచ్చుకొనుమని ప్రభువు అతనితో చెప్పెను (1 సమూయేలు 30:8).

కాని ఈ అమాలేకీయులను కనుగొనుటకు ఏ దిక్కులో వెళ్లవలెనో దావీదుకు తెలియదు. దేవుడతని వారి యొద్దకు ఎలా నడిపించెనో చూచుట అద్భుతకరం. ఒక చనిపోయే అపరిచితునికి చేసిన సామాన్యమైన మంచి క్రియ ద్వారా దేవుడతని నడిపించెను. ఎడారిలో మూర్చపోయి, దాదాపు మరణించిన స్థితిలో ఉన్న ఒక ఐగుప్తీయుని దావీదు అతని మనుష్యులు చూచిరి. వారు అతనిని పట్టించుకొని అతడు తినుటకు త్రాగుటకు నిచ్చిరి. అతడు కోలుకొనినప్పుడు అతడు రోగగ్రస్తుడగుటచేత అతనిని అమాలేకియులు ఎడారిలో విడిచిపెట్టిరని అతడు కనుగొనెను. (1 సమూయేలు 30:11-13). దావీదును అమాలేకీయుల యొద్దకు నడిపించినది అతడే. మనము అపరిచితుల యెడల దయ చూపించినప్పుడు దేవుడు మనకు ఏ విధంగా ప్రతిఫలాన్నిస్తాడో ఇది మనకు నేర్పిస్తుంది.

ఆ విధంగా దావీదు అమాలేకీయులను కనుగొని వారిని ఓడించెను. అమాలేకీయులు దోచుకొన్న వాటిని సమస్తమును దావీదు రక్షించెనని అక్కడ మూడు సార్లు వ్రాయబడినది (1 సమూయేలు 30:18-20). సాతాను మననుండి దోచుకున్న వాటన్నిటినినుండి యేసు రక్షించుటకు ఇది చక్కటి ప్రతీకగానున్నది.

యుద్ధము అయిపోయిన తరువాత దావీదు పాళెమునకు తిరిగివచ్చినప్పుడు, దావీదుతోపాటు యుద్ధము చేయడానికి బాగా అలసిపోయిన 200 మంది దావీదు సామానులను చూచుకొనుటకు అక్కడనే నిలిచిపోయిరి. దావీదుతో కూడా వెళ్లినవారిలో పనికిమాలినవారైన కొందరు పోరాడని వారితో యుద్ధపు దోపుసొమ్ము పంచుకొనము అని చెప్పిరి. కాని ఇక్కడ దావీదు విశాల హృదయాన్ని చూస్తాము. యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో సామానునొద్ద నిలిచిన వాని భాగము అంతే అని దావీదు చెప్పెను. ఆనాటినుండి అది ఇశ్రాయేలులో ఒక నియమముగా మారెను.