WFTW Body: 

ప్రభువైనయేసు చిన్న వయస్సులో నుండే జ్ఞానములో ఎదిగెనని మనము చదివెదము (లూకా 2:40, 52). యౌవనస్థులు అనేకమైన బుద్ధిహీనమైన పనులు చేసెదరని మనము ఊహించెదము. ప్రభువైనయేసు యౌవన వయస్సులో ఉన్నప్పుడు ఒక్క బుద్ధిహీనమైన పని కూడా చేయలేదు. నీవు ఆయనను మాదిరిగా పెట్టుకొనినయెడల, నీ యౌవన వయస్సులో అనేకమైన బుద్ధిహీనమైన పనులు చేయకుండా కాపాడబడెదవు.

దేవునియెడల భయభక్తులు కలిగియుండుటయే జ్ఞానమునకు మూలము. ప్రభువైనయేసు భయభక్తులు కలిగియుండి, ఆత్మీయ మరణమునుండి రక్షింపబడుటకు ప్రార్థించెను (హెబ్రీ 5:7). ప్రభువైనయేసును ప్రేమించినట్లే దేవుడు మనలను కూడా ప్రేమించుచున్నాడు. ప్రభువైనయేసు వలే నీవు భయభక్తులు కలిగియున్న యెడల ఆయన నీ ప్రార్థనలకు కూడా జవాబు ఇచ్చును.

ఆదికాండము 22:12లో అబ్రాహాము తన ఒక్క కుమారుడిని బలి ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు, "నీవు దేవునికి భయపడువాడవని" అబ్రాహాముతో దేవుడు చెప్పెను. అబ్రాహాము ఆ పర్వతము మీద దేవునికి విధేయత చూపించాడు. తన యొక్క విధేయతను దేవుడు మాత్రమే చూడవలెనని కోరాడు. రాత్రి కాలములో అబ్రాహాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడెను (ఆదికాండము 22:1). దేవుడు అతనితో చెప్పిన విషయము ఎవరికీ తెలియదు మరియు అబ్రాహాము రహస్యముగా దేవునికి విధేయత చూపించాడు. ఎవ్వరూ చూడనప్పుడు నీవు రహస్యముగా చేసే క్రియలను బట్టి, నీవు దేవునికి భయపడుచున్నావా లేదా అని కనుకొనవచ్చును.

యోబు దేవునియెడల భయభక్తులు కలిగియున్నాడని దేవుడు సాతానుతో చెప్పెను (యోబు 1:8). సాతానుకి అందరి రహస్యజీవితము తెలియును. గనుక నీ గురించి కూడా దేవుడు, యోబువలె అతిశయించుట మంచిది. ఎందుకనగా సాతాను లోకమంతా సంచరించుచున్నాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూడకుండునట్లు యోబు తన కళ్ళతో నిబంధన చేసుకొనియున్నాడు (యోబు 31:1). బైబిలు లేకపోయినప్పటికిని, పరిశుద్ధాత్మతో నింపబడకపోయినప్పటికిని, తనను సవాలు చేసి ప్రోత్సహించే సహోదరులు లేనప్పటికిని, ధర్మశాస్త్రము కూడా లేకపోయినప్పటికిని అతడు అటువంటి నిర్ణయము తీసుకొనుట ఆశ్చర్యకరము. తీర్పు రోజున యోబు లేచి దురాశలతోను మరియు పాపముతోను నిండిన ఈ లోకమునకు తీర్పుతీర్చును.

నీవు వెంబడించుటకు యోసేపు మరియొక మంచి మాదిరి. అతడు చిన్నవాడైనప్పటికిని తల్లితండ్రులకు ఎంతో దూరముగా ఉన్నాడు. కాని అతడు దేవునికి భయపడినందున ఒక పాపాత్మురాలైన స్త్రీ అతనిని ప్రతిరోజు ప్రేరేపించినప్పటికిని అతడు ఒప్పుకొనక ఆమె యొద్దనుండి పారిపోయెను (ఆదికాండము 39:9).

లైంగికవాంఛ మరియు వ్యభిచారమునుండి కాపాడబడుటకు యోబు మరియు యోసేపులవలె దేవునియెడల భయభక్తులు కలిగియుండినచో సరిపోవును. దేవునియెడల భయభక్తులే జ్ఞానమునకు ఆరంభము (అఆఇఈ లు).

నిన్ను గూర్చి నీవు జాగ్రత్తపడినట్లయితే, అప్పుడు నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడును (1 తిమోతి 4:15, 16).