వ్రాసిన వారు :   Bobby McDonald విభాగములు :   తెలిసికొనుట శిష్యులు
WFTW Body: 

పౌలు చెప్పిన అత్యంత సవాలుకరమైన విషయాలలో ఒకటి అపొ.కా 20:24(NIV)లో ఉన్నది "నేను నా జీవితాన్ని విలువలేనిదిగా భావిస్తున్నాను". తన మాదిరిలో ఎంత గొప్ప సవాలును పౌలు మనకు ఇచ్చాడు.

ఒకరోజు చనిపోయిన ఒక స్త్రీ జ్ఞాపకార్థ కూడికను చూశాను. ఆమె జీవితాన్ని గురించి కుటుంబ సభ్యులు మాట్లాడటం చూస్తున్నాను - ఆమె ఎదుర్కొన్న సవాళ్ళు, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే భర్త చనిపోవటం; సరియైన మార్గంలో ఆమె కూతుర్లను పెంచటం, అన్నింటి మధ్యలో వారి మనుమలు మనుమరాళ్ళకు అండగా ఉండటం. ఒక మనుమరాలు చెప్పిన విషయం నన్ను ఎంతగానో తాకింది. "నీవు నాకెంత ముఖ్యమో ఇంకా ఎక్కువగా నీకు చెప్పి ఉంటే బాగుండునని కోరుకుంటున్నాను" అని ఏడుస్తూ చెప్పింది. మన జీవితకాలంలో చనిపోయిన వారిని గూర్చి ఆలోచించాను. "ఇంకొక్క రోజు ఉండి ఉంటే.." అని ఎన్ని సార్లు మనం ఆలోచించాము.

అదే ఆలోచనలలో, అంతకంటే ముఖ్యమైన మరొక విషయాన్ని గూర్చి నేను ఆలోచించాను - మనం ప్రేమించే వారిని గూర్చి కాదు కాని, దేవుని గూర్చి: దేవుడు మనకెంత ముఖ్యమో చూపించటానికి మనకు కేవలం ఈ జీవితం మాత్రమే ఉంది.

ఇక్కడ ప్రశ్న ఏమిటంటే: మనం చనిపోయే సమయం వచ్చినప్పుడు(లేక దానికి ముందుగా ప్రభువు వచ్చినట్లయితే), "ప్రభువు నాకు ఎంత ముఖ్యమో నేను ప్రభువుకు ఇంకా చూపించి ఉంటే బాగుండును" అని నేను చెప్తానా.

ఆవిధంగా ఆలోచించినట్లయితే, ప్రతిదాని విషయంలో మన ఆలోచన విధానం మారిపోతుంది. పాపానికి వ్యతిరేకంగా ఇంకా పోరాడి ఉంటే బాగుండేదని, నైపుణ్యమైన ప్రార్థనలలో కాక, ఇద్దరు స్నేహితులు ఏకాంతముగా గడిపినట్లు, ప్రభువుతో సాదాసీదాగా సమయం గడిపి ఉంటే బాగుండునని ఎంతగా కోరుకుంటాము; ఇతరుల పట్ల కనికరం చూపుతూ, వారిని ప్రోత్సహిస్తూ వారిని ప్రేమించుట ద్వారా ప్రభువును ప్రేమించుట; ప్రభువు నిమిత్తం, అన్ని శ్రమలలో శోధనలలో ఆయనను మహిమపరచుటకు సంతృప్తి కలిగి జీవించుట; ఇతరుల రక్షణ కొరకు విడువక ప్రార్థించుట ద్వారా దేవునితో కలిసి పనిచేయటం; ప్రతిదాని కంటే ఆయనను ఉన్నతంగా పెట్టుకొని, ఎప్పుడూ ఆయన సన్నిధిని కోరుకోవటం; ఆయన నిమిత్తం ఈ భుమిపై ప్రతిదాన్ని చెత్తగా ఎంచటం, భూసంబంధమైన వాటిని తృణీకరించటం; ఆయనను ఎక్కువగా తెలుసుకోవటం, ఆయనను సంతోషపెట్టటం మొదలగునవి.

మనం ఎంత గొప్ప అవకాశాన్ని కలిగి ఉన్నాము. కేవలం ఇప్పుడు మాత్రమే ఆ అవకాశాన్ని కలిగి ఉన్నాము. "ఇప్పుడే అనుకూలమైన సమయం, ఇదిగో నేడే రక్షణ దినం" (2కొరింథీ 6:2).

"ఒక మనిషి రోజంతా ఏమి ఆలోచిస్తాడో అదే అతను" అని చెప్పబడటం నేను విన్నాను. నా జీవిత లక్ష్యాలలో ఒకటి, రోజంతటిలో నా ఏకాగ్రతను మిగతా వాటినుండి తొలగించి ప్రభువు వైపు ఆయన సన్నిధివైపు మెల్లగా తిప్పుట అలవాటు చేసుకొనుట. "ఇతర చింతల"పై నా దృష్టిని నిలిపి ఉంచకుండా ఉండటం. ఇది అంత సులువైనదేమి కాదు. ప్రభువుతో అటువంటి సాన్నిహిత్యాన్ని అనేకమంది క్రైస్తవులు పొందలేరని అనుకుంటున్నాను. కాని అటువంటి జీవితంకొరకైన భారాన్ని ప్రభువు నా హృదయంలో ఉంచాడు. దేవుని మహిమ, ప్రేమ కొరకు ప్రతి విషయాన్ని ఆవిధంగా చేయటమే మార్గమని నేను నమ్ముచున్నాను (1కొరింథీ 10:31) - ప్రభువును నాముందు, నా హృదయంలో ఉంచుకొని నా సిలువను మోయటం (హెబ్రీ 12:2). లేనట్లయితే వంట చేస్తూ, ఇంటిని శుభ్రం చేస్తూ, తన భర్తమీద ప్రేమలేకుండా, ఎటువంటి ఆశలేకుండా, కలిసి ఉండుటకు ఇష్టం లేకుండా ఉన్న భార్యవలె ఉంటుంది. అది ప్రాణంలేని క్రైస్తవ్యం. వీటన్నిటి మధ్యలో తండ్రిని, యేసుప్రభువుని నా హృదయంలో ఉంచుకోవాలి. నాకు సరైన ఉద్దేశ్యాలు కలిగిన సరైన జీవితం కావాలి.

ప్రభువు ఒకసారి నాకు ఒక సాదృశ్యం చూపించాడు: నేను ఒక పేపర్ కప్పులో కాఫీ తాగాను. నేను కాఫీని ఆస్వాదించాను. కాని ఆ కప్పు, ఆ కాఫీ ఉన్నంతసేపు తప్ప తర్వాత ఎందుకు పనికిరానిది. చివరలో దాన్ని పారవేశాను. మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయని చూశాను: వాడి పారవేయతగినవి. "నా పరుగును నేను పూర్తిచేయాలని నా జీవితాన్ని నాకు విలువైనదిగా ఎంచటం లేదు" (అపొ.కా 20:24). మనం ఇక్కడ ఉన్న కొద్ది కాలం యేసును కలిగి ఉండుటయే ఈ జీవితం యొక్క విలువ. అది పారవేయవలసినది. అది వాడి పారవేయవలసిన జీవితం. ఇక్కడ ఉన్న కొద్ది కాలం నిండు సంపదతో ఉండవచ్చు; కాని అది పారవేయబడుతుంది.

క్రీస్తు పట్ల నిండు భక్తితో కూడా మన వాడి పారవేయవలసిన జీవితాలు ఉండవచ్చు - క్రీస్తు సమస్తంగా ఉండటమే అటువంటి భక్తి. ఆ భక్తి ఒక్కటే ఈ వాడిపారేసే జీవితం కొద్దిసేపు పట్టుకోగలిగే విలువైన వస్తువు.

- క్రీస్తు పోలికతో నిండుకొని ఇక్కడ జీవించుచున్న వాడిపారేసే కప్పు. పవిత్రమైన ప్రేమ, ఉద్దేశ్యాలు మనలో నుండి ప్రవహిస్తూ బాహ్యముగానే కాక అంతరంగంలో నుండి ప్రభువును సంతోషపెట్టటం.

- పూర్తి దీనత్వంతో నింపబడి తండ్రిని క్రీస్తును హెచ్చించుచున్న వాడిపారేసే కప్పు. క్రీస్తు హెచ్చింపబడుతున్నాడు కాబట్టి సంతోషంగా క్రిందికి తగ్గటం.

- దేవుని జ్ఞానానికి ప్రేమకు లోబడే విశ్వాసం సత్యములతో నింపబడిన వాడిపారేసే కప్పు. గొప్ప బాధలో అనేక సంవత్సరాల శ్రమలలో, ఆయన చిత్తం చేయుటకు ప్రభువు హస్తాలకు మనలను మనం సమర్పించుకోవటం.

నిత్యత్వంలోనికి వెళ్ళే ముందు, మన వాడిపారేసే కప్పు కొద్దికాలం పట్టుకొనే నిత్యజీవపు విలువ ఇదే.

"మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి వారు" అని యాకోబు 4:14 చెప్తుంది.

కాబట్టి ఒక 1000సంవత్సరాల తర్వాత కనీసం 100సంవత్సరాల తర్వాత ముఖ్యమైనవి ఏమిటో వాటిని గూర్చి ధ్యానించటం ఆత్మీయముగా ఎంతో లాభకరం. అటువంటి ఆలోచనలు నా క్రైస్తవ జీవితం ప్రారంభంలో సహాయపడ్డాయి. ఇప్పుడు దీని గురించి నా పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను.

నేను యౌవనస్తునిగా ఉన్నప్పుడు, దేవుని కొరకు తీవ్రవతో జీవించుటకు, పైనున్న వాటిమీద నా మనస్సు పెట్టుకొనుటకు (కొలస్సి 3:2) నన్ను సవాలు చేసిన పద్యమిది:

ఇక 100 సంవత్సరాలకు

ఇక వంద సంవత్సరాలకు,

నీవు గంభీరమైన భవంతిలో నివసించినా

నదిలో తేలియాడే చిన్న పడవలో నివసించినా;

టైలర్‍ కుట్టిన బట్టలు వేసుకున్నా

ఏదో విధంగా కలిపి కుట్టిన బట్టలు వేసుకున్నా,

పెద్ద మాంసం ముక్కలు తిన్నా లేక గింజలు తిన్నా

ఇక వంద సంవత్సరాలకు

పెద్ద తేడా ఏమి లేదు మిత్రమా

నీ బ్యాంక్ ఖాతా

లేక నీవు నడిపే కారు లెక్కలోకి రావు,

ఎందుకంటే నీ ధనం కీర్తి

నీవు కష్టపడిన ప్రతిదీ సమాధి స్వంతం

మనం చేరుకోవలసిన గీత ఉంది

చేరుటకు ఎవరూ ఆలస్యం కారు,

అప్పుడు నీవు వెళ్ళిన ప్రదేశాలు లెక్కలోకి రావు

ఎవ్వరూ ఆ తేదిని తప్పిపోరు

ఈ భూమిపై మనం వదిలివేసినవే

నిత్యత్వంలో కలిగి ఉంటాము,

నిత్యత్వ విలువలు కలిగినవి మాత్రమే

మనం సమాధికి వెళ్లినప్పుడు కాపాడుకుంటాము,

కొందరు ఎల్లప్పుడు సాగిలపడే భూసంబంధమైన లాభాలకు

విలువేముంది మిత్రమా?

ఇక వంద సంవత్సరాలకు

నీ గమ్యం నిర్ణయించబడిందని నీవు చూస్తావు.