వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   గృహము సంఘము శిష్యులు
WFTW Body: 

మన పరిచర్యలను దేవుడు ఆశీర్వదించినప్పుడు మనకు ఆత్మీయగర్వము కలిగే అపాయములో ఎల్లప్పుడు ఉండెదము. మనము ఎల్లప్పుడు ఏమి కానివారమైనప్పటికినీ మనము గొప్పవారమని ఊహించుకొనుట చాలా సులభము. వారెవరైనప్పటికిని దేవుడు అహంకారులందరిని ఎదురించును. కనుక మనలను కూడా ఎదిరించి మనకు విరోధముగా పోరాడును. మనకు ఆత్మీయవరములున్నప్పుడు లేక మన వ్యక్తిగతజీవితము మరియు కుటుంబజీవితము మంచిగా ఉన్నప్పుడు లేక మన సంఘము విస్తరించుచున్నప్పుడు లేక మనము ఎక్కువగా సిరిసంపదలను పొందినప్పుడు గర్వించుట చాలా సులభము. వేరే పాపములన్నింటి కంటె ఆత్మీయగర్వము మరియు స్వార్థము మీద వెలుగు పొందవలసిన అవసరమున్నది. ఈ విషయములలో మనలను మనము సులభముగా మోసగించుకొనవచ్చును. మనము గర్విష్టులము మరియు స్వార్థపరులము అయియుండి, మనము దీనులము మరియు నిస్వార్థులమని ఊహించుకొనవచ్చును. సాతాను గొప్ప మోసగాడు.

మనయొక్క నిజస్థితిని తెలుసుకొనుటకు ఆత్మీయగర్వము ఉంది అనుటకు కొన్ని ఋజువులను ఇక్కడ చూచెదము: అభ్యంతరపడుట, కోపపడుట, లైంగికతలంపులు, తప్పును ఒప్పుకొనుటకు ఇష్టపడకపోవుట, క్షమాపణను ఆలస్యముగా అడుగుట, సంఘములోని ఇతర సహోదరులతో సమాధాన పడుటకు ఆలస్యము చేయుట మొదలగునవి.

ఒక గర్వము కలిగిన పెద్ద, సంఘములో ఒక నియంతవలె ప్రవర్తిస్తూ మరియు ఒక అధిపతి కంపెనీని నడిపిస్తున్నట్లుగా సంఘమును నడుపును. అటువంటి వ్యక్తి సంఘమును ఒక శరీరముగా నిర్మించలేడు.

శరీరమునుండియు మరియు నోటినుండివచ్చు దుర్వాసన వలె ఆత్మీయగర్వము ఉండును. దానియొక్క వాసన మనకు తెలియదు కాని ఇతరులకు తెలియును. ఉదాహరణకు, ఒక సంఘపెద్ద తన పరిచర్య గురించి గొప్పలు చెప్పినట్లయితే, అతడు అతనిలోనుండి వచ్చుచున్న ఆత్మీయగర్వమనే దుర్వాసనను గుర్తించలేడు. కాని ఒక దైవభక్తి కలవాడు అతనిలోనున్న ఆత్మీయగర్వమును వెంటనే చూడగలడు.

మనము నెబుకద్నెజరు వైఖరిని చూచినట్లే, ఒక గర్వముగల సంఘపెద్ద వైఖరి బబులోను సంఘమును నిర్మించును (దానియేలు

4:30). దేవుడు అతనిని తగ్గించి మరియు వెంటనే అతనిని విసర్జించెను.

ఆత్మీయగర్వము, పెద్దలను మరియు దేవుని సాక్ష్యం కలిగిన సహోదరులను సన్మానించకుండా చేయును. అటువంటి సంఘపెద్ద తన సంఘములోని వారందరు తనకు లోబడవలెనని కోరును. కానీ దేవుడు అతని మీద పెట్టిన అధికారానికి అతడు లోబడడు. అంత్యదినములలో ఇటువంటి అగౌరవము క్రైస్తవులలో అంతకంతకు విస్తరిస్తుంది. ఈ దినములలో చిన్నపిల్లలలు మరియు యౌవనస్తులు, పెద్దలతోను మరియు దైవజనులతోను ఈవిధంగా మాట్లాడుట మనము చూచుచున్నాము.

దియొత్రెఫే(3యోహాను 1:9) మరియు ప్రకటన 2,3 అధ్యాయములలోని వెనుకంజ వేసిన ఐదుగురు సంఘపెద్దలు మనకందరకు హెచ్చరికగా ఉన్నారు. మనము ఇంతకు ముందు చూచిన రీతిగా, ఆ పెద్దలు తమ్ముతాము తీర్పు తీర్చుకొనినయెడల దేవుడే స్వయముగా వారి ఓటములను చూపించేవాడు. అప్పుడు దేవుడు అపొస్తలుడైన యోహాను ద్వారా వారితో మాట్లాడవలసిన అవసరం ఉండేది కాదు.

మనలను మనము తీర్పుతీర్చుకొనుట ఆపివేసినప్పుడు, మనము అన్ని తెలిసిన వారివలె బోధించుటకు ఆరంభించుదుము. మరియు ప్రభువు మన పక్షముగా ఉండడు. కాబట్టి ప్రతిరోజు మనలను మనము తీర్పుతీర్చుకొనుచు మరియు మన పరిచర్య గురించి తక్కువ తలంపులు కలిగి జీవించాలి. దేవుడు మన జీవితము గురించి మరియు మన పరిచర్యల గురించి సాక్ష్యము చెప్పుచున్నాడా అనేది మనలను మనము పరీక్షించుకోవాలి లేనట్లయితే తప్పిపోవుదము (గలతీ 6:4).

నాయకులందరికి నేను మూడు హెచ్చరికలు చేయుచున్నాను.

1. ఎల్లప్పుడు మీ ముఖము దుమ్ములో పెట్టుకొని, దేవుణ్ణి ఆరాధించే వారుగా ఉండాలి.

2. నీవు ఒక సామాన్యసహోదరుడవని ఎల్లప్పుడు గుర్తుపెట్టుకోవాలి.

3. నీవు దేవునిని ఎక్కువగా ప్రేమించుచున్నావని ఊహించుకొనుట కంటే నీయెడల దేవుని ప్రేమను ఎల్లప్పుడు ధ్యానించుము.

ఆత్మ విషయములో దీనుడవై యుండుట అనగా, నీవు ప్రాముఖ్యత లేనివాడవని అనుకొనవలెను (మత్తయి 5:3 ఆంప్లిఫైడ్ బైబిలు) మరియు ఎల్లప్పుడు వ్యక్తిగత మరియు ఆత్మీయ అవసరతను ఎరిగియుండి జీవించవలెను.