WFTW Body: 

విశ్వాసులందరి మీద ప్రధానంగా సాతాను నిందారోపణలు చేయువానిగా ఉన్నాడు (ప్రకటన 12:10). కాని ఈ పరిచర్యలో తనతో సహకరించే సహపరిచారకుల కొరకు విశ్వాసులలో వెతుకుతూ ఉంటాడు. మరియు ప్రపంచ వ్యాప్తముగా అతడు అనేక సహపరిచారకులను కనుగొంటాడు.

సాతాను మనతో అబద్దాలు చెప్పును. కాని మనమీద అతడు దేవుని యొదుట నిందారోపణ చేయునప్పుడు, అతడు సత్యమే చెప్పును కాని అబద్దము చెప్పడు - ఎందుకంటే అతడు దేవునితో అబద్దము చెప్పుటకు సాహసించడు. అతడు సత్యము చెప్పినప్పటికినీ అతడు నిందారోపణ చేసే ఆత్మను కలిగియున్నాడు. దీనిని బట్టి మనము ఒక విషయమును నేర్చుకోవలెను: ఒక సహోదరుని యొక్క పాపములను గూర్చి నేరుగా ఆ వ్యక్తితో కాకుండా వేరే వారితో చెప్పినట్లయితే, మనము చెప్పినదంతయు సత్యమే అయినప్పటికిని, ఈ నిందారోపణ చేసే పరిచర్యలో మనము సాతాను యొక్క సహపరిచారకులమౌతాము.

నిందారోపణ చేసే వాడితో మనము ఎన్నటికి సహవాసము చేయకూడదు. ఒక సహోదరుడు పాపము చేసినట్లయితే సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసుకొని రావటానికి ప్రయత్నించవలెనని ఆజ్ఞాపింపబడితిమి (గలతీ 6:1). మనము అతనితో సూటిగా మాట్లాడాలి. అతడు మన మాట విననియెడల, అప్పుడు మనము సంఘపెద్దలకు అతని గురించి చెప్పాలి. అతడు సంఘపెద్దల మాటకూడా వినని యెడల అప్పుడు ఆత్మీయ అధికారానికి విధేయత చూపుటకు ఇష్టపడలేదని సంఘమంతటికి చెప్పాలి. తరువాత అతనిని సంఘములో నుండి బయటకు పంపించవలెను. మత్తయి 18:15-20లో ప్రభువైనయేసు దీనిని గూర్చి స్పష్టముగా చెప్పారు. ఈ విధముగా సంఘములో ఉన్న నిందారోపణ మోపే సాతాను కార్యమును బంధించవచ్చని ప్రభువైనయేసు చెప్పారు.

ఒక సంఘపెద్దకు వ్యతిరేఖంగా నిందారోపణ చేసినయెడల, ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు ఉంటేనే గాని దానిని అంగీకరింపకుము (1తిమోతి 5:19). ఇతర పెద్దల ద్వారా కూడా ఈ విషయమును జాగ్రత్తగా పరిశోధించాలి. పాతనిబంధనలో "నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెనని" ద్వీతియోపదేశకాండము 13:13లో దేవుడు స్పష్టముగా ఆజ్ఞాపించాడు. ఆ సంఘపెద్ద పాపములో జీవిస్తూయున్నాడని ఋజువుచేయబడిన యెడల అందరియెదుట సంఘములో పై స్థాయిలో ఉన్న ఒక పెద్ద ఆయనను గద్దించాలి (1 తిమోతి 5:20).

ఒకవేళ ఆ పైస్థాయి గల పెద్ద తప్పుడు కనికరముగలవాడై అందరియెదుట దానిని చేయని యెడల అతడు పరిశుద్ధాత్మునికంటే తనకు ఎక్కువగా తెలుసునని చెప్పుచున్నాడని అర్థము. దీనత్వముతో నడుచుచు దేవుని వాక్యమునకు లోబడుట శ్రేష్ఠమైనది.

ఇప్పుడు అన్యాయముగా నిందారోపణ చేయబడ్డవారిని ప్రోత్సహించుటకు రెండు వాగ్ధానములున్నవి.

"ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని యెరిగి నా ముఖమును చెకుముకిరాతివలె చేసుకొంటిని. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడైయున్నాడు. నాతో వ్యాజ్యెమాడువాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యెమాడుదము. నా ప్రతివాది యెవడు? అతని నా యొద్దకు రానిమ్ము. నా మీద నిందారోపణ చేయువారందరు అదృశ్యమైపోవుదురు. వారందరు వస్త్రమువలె పాతగిలిపోవుదురు... ఇతరులను నాశనము చేయుటకు కుయుక్తి(కుట్ర) పన్నిన వారందరు వారి కుయుక్తిలోనే నాశనమగుదురు. దేవుడే ఈ విధముగా జరిగించును (యెషయా 50:7-11).

"నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్థిల్లదు. నీ మీద దోషారోపణ చేయువారి విషయములో నీకు న్యాయము జరుగును. ఇది దేవుని సేవకుల యొక్క వారసత్వము. ఈ ఆశీర్వాదమును నీకు ఇచ్చెదను" అని ప్రభువు చెప్పుచున్నాడు (యెషయా 54:17 లివింగ్ బైబిల్).

ఆయన నామము పెట్టుకొనిన వారందరి హృదయములను పరీక్షించుటకు దేవుడు సాతానుకి అనుమతినిస్తాడు. అబద్ధములతోను, ద్వేషములతో నిండిన ఈ లోకములో, సత్యములో మరియు ప్రేమలోను అంతమువరకు నిలిచియుంటామో లేదోనని దేవుడు ఇటువంటి పరిస్థితులను మనకు అనుమతిస్తాడు.

కాబట్టి ఎవరు ధైవభక్తి గలవారో మరియు ఎవరు ధైవభక్తి లేనివారో ఎవరు మంచితనముతో ప్రభావితము చేయబడియున్నారో లేక అసూయ మరియు ద్వేషములతో ప్రభావితము చేయబడియున్నారో వివేచనగలవారు చూడగలరు. కాని కొందరు పరిసయ్యులవలె వివేచన లేనివారై చివరి వరకు గ్రుడ్డివారై ఉంటారు. బంగారము అగ్నిలో పవిత్రపరచబడుతుంది కాని గడ్డి కాలి బూడిదవుతుంది.