వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట శిష్యులు
WFTW Body: 

మీరు దేవుని చిత్తాన్ని వెదుకుతున్నప్పుడు కలవరము(అస్థిరము)గా ఉండుట సహజమని మీరు తెలుసుకొనవలెను. విశ్వాసమూలముగా నడచునట్లు దేవుడు మనలను ఆ విధముగా సిద్ధపరచును - ఎందుకంటే నిశ్చయత చూచి నడచుట అవుతుంది.

దేవుని చిత్తమును తెలుసుకొనలేక పౌలు కూడా అనేకసార్లు కలవరములో ఉండెను. "కొన్ని విషయములు ఎందుకు జరుగుచున్నవో మాకు తెలియనప్పటికి మేము దానిని విడిచిపెట్టము, పనిని ఆపివేయము" (2కొరింథీ 4:8 ఆంగ్ల లివింగ్ తర్జుమా).

'ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు' కొన్నిసార్లు కలవరపాటుకు మరియు పొరపాట్లు చేయుటకు దేవుడు అనుమతించును (1కొరింథీ 1:29). నిత్యత్వంలో ఒక్క వ్యక్తి కూడా నేను అన్ని సరిగా చేశాను కాబట్టి దేవుని చిత్తము సంపూర్ణంగా నెరవేర్చానని చెప్పలేడు. మనం అనేక పొరపాట్లు మరియు తప్పులను చేసినప్పటికి, దేవుడు తన సంకల్పం మనలో నెరవేర్చెననునదియే నిత్యత్వంలో మన మహిమై ఉన్నది. నిశ్చయముగా ఇది నా సాక్ష్యము. ఆవిధముగా దేవుడు మాత్రమే మహిమ పొందును మరియు మనం ఏమి పొందము. అనేకమంది విశ్వాసులు దేవుని ఈ అంతిమ ఉద్దేశ్యాన్ని ఎరుగనందున వారు ఓడిపోయినప్పుడు లేక దేవుని చిత్తములో నిశ్చయత లేనప్పుడు నిరాశపడెదరు. దేవుని మార్గములు మన మార్గముల వంటివి కావు. ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో అవి అంత ఎత్తుగా ఉన్నవి (యెషయా 55:8,9).

దైవిక జ్ఞానము కలిగియుండుట మంచిది. ఆ జ్ఞానములో ఉన్న ఒక విషయమేమనగా మనం సరైన ప్రాధాన్యతలు కలిగియుండెదము - విద్యకొరకు, దేవుని వాక్యము చదువుటకును, పనిచేయుటకును, నిద్రపోవుటకును, మరియు విశ్రాంతి తీసుకొనుటకు మొదలగునవి. అనేకమంది విశ్వాసులు ముఖ్యముగా పెళ్ళయి కుటుంబము పెట్టిన తరువాత వారి ప్రాధాన్యతలను సరిగా పెట్టుకొనుటలో తప్పిపోవుదురు. కాబట్టి మీరు పెళ్ళికాక ముందే యౌవనస్థులుగా ఉండినప్పుడే అటువంటి జ్ఞానము సంపాదించుట మంచిది. మీకు జ్ఞానము కొదువగా ఉన్నయెడల(మనందరికి కొదువగా ఉంది), మీరు దేవుణ్ణి అడుగవలెను మరియు ఆయన ధారాళముగా మీకు ఇచ్చును. కాబట్టి అడుగుడి.

"దైవచిత్తాన్వేషణ" అనే పుస్తకములో 6వ అధ్యాయం చదువవలెనని మిమ్ములను ప్రోత్సహించుచున్నాను. అక్కడ నిర్ణయము తీసుకోలేని స్థితి నుండి విడుదల పొందుట, గత నిర్ణయములను బట్టి చింతించుట నుండి విడుదల పొందుట, మరియు పొరపాట్లు చేసెదమనే భయము నుండి విడుదల పొందుటను గురించి వ్రాశాను.

ఒక్క పొరపాటు కూడా చేయనివాడు ఏమి చేయని వాడు. యేసు తప్ప, మరి ఎవరైనను పొరపాట్లు చేయకుండా దేవుని చిత్తము సంపూర్ణంగా చేయుటను నేర్చుకొనలేదు. 'మంచి వ్యక్తుల అడుగులు ప్రభువు స్థిరపరుస్తాడు.. అతడు పడినను అది ప్రాణాంతకం కాదు ఎందుకంటే యెహోవా తన చేతితో వారిని పట్టుకున్నాడు" (కీర్తన 37:23,24 ఆంగ్ల లివింగ్ తర్జుమా). కాబట్టి పొరపాట్లు చేస్తామేమో అని భయపడవద్దు. తీవ్రమైన పొరపాట్లు చేయకుండా దేవుడు మిమ్మును కాపాడును.