WFTW Body: 

2రాజులు 2:20నుండి దేవుడు ఒక కొత్తపాత్ర కొరకు చూచుచున్నాడని నేర్చుకొనెదము.

ఈ లోకములో సువార్తను ప్రకటించుటకు దేవుడు కొత్త పద్ధతుల కొరకు గాని కొత్త సంస్థలకొరకు గాని చూచుటలేదు. ప్రభువు, తన సంకల్పములను నెరవేర్చుటకు ఉప్పుతో నిండిన కొత్త పాత్రల కొరకు చూచుచున్నాడు. దేవుడు తానే స్వయముగా లోకమునకు సువార్త ప్రకటించడు. దేవుడు ఆ విధముగా చేయవలెనని కోరినచో, పరలోకమునుండి నేరుగా లోకానికి సువార్త ప్రకటించగలడు. కాని అది ఆయన మార్గం కాదు. మానవపాత్రలో ఉప్పువేసి, అప్పుడు భూమిమీద దానిని కుమ్మరించును.

ఎలీషా తన చేతులతో ఉప్పును తీసుకొని కుమ్మరించవచ్చును. కాని అతడు ఆ విధముగా చేయలేదు. అతడు క్రొత్తపాత్రను తీసుకొని, ఉప్పుతో నింపి తరువాత దానిని నీళ్ళమీద పోసెను. ఆ స్థలము మరియు నీళ్ళు ఒక్కసారే స్వస్థత పొందెను. మనము ఈ లోక విషయములన్నిటిని ఖాళీ చేసుకొని, క్రీస్తుతో మాత్రమే నింపబడిన పాత్రలుగా ఉండి, మన యజమానుని పరిచర్య కొరకు ఉపయోగపడునట్లు దేవుడు అనుగ్రహించును గాక.

మీరు ఒక విషయాన్ని గమనించాలని కోరుతున్నాను: పాత్రను ఉప్పుతో నింపిన తరువాత, ఎలీషా ఉప్పును పాత్రలో ఉంచలేదు గాని అతడు దానిని కుమ్మరించెను.

మనము ఇతరులమీద పోయబడునట్లు, దేవుడు నిన్ను మరియు నన్ను కూడా నింపుచున్నాడు. మనము చాలా కాలము నుండి పరిశుద్ధాత్మ నింపుదల కొరకు మరియు ఆత్మసంబంధమైన ఆశీర్వాదముకొరకు లేక మరొక దాని కొరకుగాని ప్రార్థించవచ్చును. కాని వాటిని మనము ఎంతో స్వార్థముతో అడుగుతుండవచ్చును. ఇతరులకు మనము ఎంత ఆత్మీయులమో కనపరచుకొనుటకు దేవుడు మనలను పరలోకపుఉప్పుతో నింపడు.

మరణము పొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెనని యెషయా 53:12లో ప్రభువైన యేసుని గురించి చదువగలము. దానిని బట్టి ఈ రోజు నీ పాపములు మరియు నా పాపములు క్షమించబడియున్నవి. మనము కూడా ఇతరులకు పరిచర్య చేయుట కొరకు ధారపోయబడుటకు ఇష్టపడనట్లయితే మన దేశము స్వస్థపరచబడదు. నీళ్ళతో నింపబడిన నీళ్ళ ట్యాంకర్లుగా మనము ఉండాలని దేవుడు కోరుటలేదు. ఇతరులలోనికి జీవజల నదులను ప్రవహింప జేసే కాలువలవలె మనము ఉండాలని దేవుడు కోరుచున్నాడు. పోయబడుటకు ఇష్టపడే వారికొరకు దేవుడు చూచుచున్నాడు.

అటువంటి పాత్రల కొరకు భూలోకమంతటిని దేవుడు చూచుచున్నాడు. నీకు చదువు రాకపోయినను ఫర్వాలేదు. 2దిన.వృ. 7:14లో చదువుకొనుట గురించి ఏమియులేదు. నీ జీవితములో ఒక్క రోజు కూడా నీవు స్కూలుకు వెళ్ళకపోయినను ఫర్వాలేదు. ఈ ప్రపంచమంతటిలో నీవు అత్యంత బీదవాడవైనను లేక అత్యంత బుద్ధిహీనుడవైనను ఫర్వాలేదు. దేవుడు వీటిని గురించి చూచుటలేదు. కేవలము బైబిలు చదివిన వారికొరకు దేవుడు చూచుటలేదు.

ఆయన ఇట్లనుచున్నాడు. "నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని, ప్రార్థించి, నన్ను వెదకి, దుష్టత్వము నుండి తిరిగిన యెడల, దేశముయొక్క స్వస్థత కొరకు వారిని వాడుకొనెదను".

నీవెవరివైనను సరే. దేవుడు ప్రత్యేకముగా ఎవరిని గౌరవించడు. నీవు ఈ షరతులను నెరవేర్చుటకు ఇష్టపడి మరియు ఇతరుల కొరకు పోయబడుటకు ఇష్టపడినయెడల, నీవెవరివైనను దేవుడు నిన్ను వాడుకొనును.