WFTW Body: 

కీర్తన 50: తమ నాలుకలతో కొండెములాడుటకు బదులు వాటితో ప్రభువును స్తుతించువారికి ఒక అద్భుతమైన వాగ్ధానము 23వ వచనములో ఉన్నది. "స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను" (కీర్తన 50:23). మనము ప్రభువును స్తుతించినప్పుడు ఆయన సర్వాధికారము గల దేవుడని మన విశ్వాసమును వ్యక్తపరుస్తాము. అలా చేసినప్పుడు ఆయన తన రక్షణను కనుపరచును.

కీర్తన 65: ప్రభువా, నీ కొరకు స్తుతి సీయోనులో (సంఘములో) వేచియున్నది అని కీర్తన 65:1వ వచనం చెప్పుచున్నది. ఎల్లప్పుడు దేవుని స్తుతించుటకు వేచియుండే ప్రదేశములుగా మన సంఘములు ఉండవలెను. దేవుడు మన మధ్యకు వచ్చినప్పుడు ఆయన కొరకు స్తుతి వేచియుండటం ఆయన చూడాలి. దేవుడు అటువంటి వారిని తనకు దగ్గరగా ఆకర్షించును. నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడని ప్రవచనాత్మకమైన కీర్తన 65:4వ వచనము చెప్పుచున్నది. భూమికి దేవుడు చేసే మంచిని గురించి ఈ కీర్తన చెప్పుచున్నది.

కీర్తన 100: ఈ కీర్తన ప్రభువును స్తుతించుటకు ఆయనను సేవించుటకు మరొక ఆహ్వానము. మనము యెహోవాను సంతోషముతో సేవించవలెను (కీర్తన 100:2). ప్రభువును సేవిస్తున్నామని చెప్పేవారిని నేను కలిసాను, కాని వారు ఎక్కువ సమయము ఏదో ఒకదానిని గురించి ఫిర్యాదులు చేస్తుంటారు. ఆయనను సంతోషముతో సేవించనివారు, ఆయనను సేవించడం దేవునికి ఇష్టములేదు.

కీర్తన 106: ఈ కీర్తన ఇశ్రాయేలుకు దేవుడు చేసిన మంచి పనుల యొక్క చరిత్రను కొనసాగిస్తుంది. నీళ్ళు వారి శత్రువులను ముంచివేసెను. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి గానము చేసిరి అని కీర్తన 106:11,12 వచనాలలో మనము చదువుతాము. మనమిక్కడ రెండు విషయాలను చూడవచ్చును. మొదటిగా స్తుతి విశ్వాసమున్నదనుటకు ఆధారము. హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాట్లాడును. హృదయమందు ఉన్నవి బయటకు వచ్చుటకు నోరు ద్వారముగా ఉన్నది. మన హృదయములో విశ్వాసముంటే అది స్తుతులతో పొంగిపొర్లుతుంది. అపొస్తులులు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వారు దేవుని స్తుతించడం మొదలు పెట్టిరి(అపొ.కార్యములు 2వ అధ్యాయము). మనము దేవుని స్తుతించకపోతే మనకు విశ్వాసములేదని అది నిరూపిస్తుంది. రెండవదిగా, పాతనిబంధన క్రింద వారు విశ్వాసము వలనకాక చూచుట వలన జీవించిరి. వారి శత్రువులు మునిగిపోవుట చూచిన తరువాత మాత్రమే వారు స్తుతించగలిగిరి. ఈ రోజున మన శత్రువులు ఓడించబడకముందే మనము దేవుని స్తుతించగలము. చూపువలన కాక విశ్వాసమువలన నడచుట అంటే అదే.

కీర్తన 149: ఈ కీర్తన ప్రభువును ఎల్లవేళలా స్తుతించమని మనలను ఆహ్వానించుచున్నది. ఆయన దీనులను రక్షణతో అలంకరించును(కీర్తన 149:4వ). ప్రభువు నిన్ను అలంకరించాలని నీవు కోరుకుంటే నీవు దీనుడిగా ఉండాలి. మనము పడకల మీద ఉత్సాహగానము చేయాలని మననోట దేవునికి ఉత్సాహాస్తోత్రములు ఉండాలని మన చేతిలో రెండంచులు గల ఖడ్గముండాలని ఈ కీర్తన మనలను పిలచుచున్నది. ఆవిధంగా మనము సాతాను అతని దయ్యముల యొక్క శక్తిని కార్యకలాపాలను బంధించగలము (కీర్తన 149:5-9). సాతానును శక్తిని బంధించడము, దేవుని స్తుతించడము రెండు ఎల్లప్పుడు కలసి వెలతాయి.

కీర్తన 150:

ఈ కీర్తనలో స్తుతి అనే పదము 13 సార్లు చదువుతాము. "సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక" అనే మాటతో ఈ కీర్తన ముగుస్తుంది(కీర్తన 150:6). దేవునికి స్తుతులు చెల్లించలేని వ్యక్తి ఊపిరిలేని వ్యక్తి మాత్రమే (అంటే మరణించిన వ్యక్తి). మిగిలిన వారందరు ప్రభువును అన్నివేళలా స్తుతించవలెను. మన జీవితాలలో అలాగునే ఉండునుగాక. ఆమేన్.