వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట శిష్యులు
WFTW Body: 

సంఖ్యాకాండము 13వ అధ్యాయములో కానాను దేశము సరిహద్దున ఉన్న కాదేషు బర్నేయకు ఇశ్రాయేలీయులు వచ్చారని మనము చదువుతాము. ఇది దేవుడు వారికి వాగ్దానము చేసిన దేశము. వారు ఐగుప్తును విడిచి ఇప్పటికి రెండు సంవత్సరములాయెను (ద్వితి.కా. 2:14). దేవుడు వారిని వెళ్ళి ఆ దేశమును స్వతంత్రించుకోమని చెప్పారు. ఆ దేశమును చూడడానికి ఇశ్రాయేలీయులు 12మంది వేగులవారిని పంపిరి. ఆ 12మంది తిరిగి వచ్చి ఆ దేశము అద్భుతమైన దేశమని చెప్పారు. అయితే వారిలో పదిమంది అక్కడ పెద్ద పెద్ద ఆజానుబాహులున్నారు మనము వారిని జయించలేమని చెప్పారు. కాని వారిలో ఇద్దరు (యెహోషువ, కాలేబులు) ఆ ఆజానుబాహులను జయించడానికి ప్రభువు మనకు సహాయం చేస్తాడని సమాధానమిచ్చారు. కాని ఆ ఆరు లక్షల మంది ఇశ్రాయేలీయులు ఎక్కవమంది చెప్పిన దాన్నే విన్నారు.

మనం దీనినుండి ఏమి నేర్చుకుంటాము? మొట్టమొదటిగా అధికసంఖ్యాకులు చెప్పిన దానిని అనుసరించడం ప్రమాదకరం ఎందుకంటే అధికసంఖ్యాకులు ఎప్పుడూ తప్పే. జీవమునకు పోవు దారి సంకుచితమైనది దాని కనుగొనువారు కొందరేనని యేసు చెప్పారు. అధికసంఖ్యాకులు విశాలమైన దారిలో నాశనమునకు పోవుదురు. నీవు అధిక సంఖ్యాకులను వెంబడిస్తే నీవు ఖచ్చితముగా వారితోకూడా విశాల మార్గమున నాశనమునకు పోవుదువు. ఒక పెద్ద సంఘము ఆత్మానుసారమైన సంఘమని ఎప్పుడూ ఊహించుకోవద్దు. యేసుని సంఘములో 11మంది సభ్యులే ఉండిరి.

పదిమంది నాయకులు ఒక మాట చెప్పి ఇద్దరు వేరొక మాట చెప్తే నీవు ఎవరి పక్షాన ఉంటావు? దేవుడు ఇక్కడ ఇద్దరి పక్షమున (యెహోషువ, కాలేబుల పక్షమున) ఉండెను. సాతాను మరియు అవిశ్వాసము మిగతా పదిమంది పక్షమున ఉండెను. కాని ఇశ్రాయేలీయులు మూర్ఖంగా అధిక సంఖ్యాకులనే వెంబడించారు. అందుచేతనే వారు తరువాత 38 సంవత్సరాలు అరణ్యములో సంచరించవలసి వచ్చింది. దేవుడు ఎవరి పక్షమున ఉన్నాడో చూచే వివేకమును వారు కలిగియుండలేదు. దేవుడు ఒక్క వ్యక్తితో ఉన్నా కూడా వారే ఎంతోమంది కంటే గొప్పవారు. గనుక నేనెప్పుడు దేవునితో నిలబడాలనుకుంటున్నాను. మనము నిర్గమకాండము 32వ అధ్యాయములో ఇశ్రాయేలీయులందరు బంగారపు దూడను పూజిస్తున్నప్పుడు దేవుడు ఒక్క వ్యక్తియైన మోషే పక్షమునుండెను. కాని ఆ గోత్రాలలో లేవీ గోత్రము మాత్రమే దాన్ని చూడగలిగెను. ఇప్పుడు దేవుడు యెహోషువ, కాలేబుల పక్షమున ఉన్నాడని లేవి గోత్రము కూడా గుర్తించలేకపోయెను.

ఇదంతా కూడా మనకు ఈ రోజున పాఠాలు నేర్పిస్తుంది. క్రైస్తవలోకం సాధారణంగా రాజీపడటంతోను, లోకానుసారతతోను నిండుకొనియుంది. అక్కడక్కడ దేవుని వాక్యములో ఉన్న సత్యముకొరకు ఎటువంటి సర్దుబాటులేకుండా నిలబడే కొందరిని దేవుడు లేవనెత్తుతాడు. నీకు వివేచన ఉంటే దేవుడు ఆ కొందరితో ఉన్నాడని గుర్తించి వారితో పాటు అధికసంఖ్యాకులకు వ్యతిరేకంగా నిలబడతావు. వారితో పాటు వాగ్దాన దేశములోనికి ప్రవేశిస్తావు.

దేవుడు ఎవరితో ఉన్నాడో నీవెలా కనుగొంటావు? అతడు విశ్వాసముతో కూడిన మాటలు మాట్లాడుతాడు. యెహోషువ, కాలేబులు విశ్వాసము ద్వారా "మనము జయించగలము" అని చెప్పారు. "కోపము, మోహము, అసూయ, సణుగుడు, ధనాశ" అనే ఆజానుబాహులను మనము జయించగలము. మనము సాతానుని జయించగలము. మన పాదముల క్రింద దేవుడు సాతానును చితకత్రొక్కును" అను మాటలు దేవుని పక్షమున ఉన్న వ్యక్తి మాటలాడును. దేవుడు తన పక్షమునలేని వ్యక్తి, "మనము బైబిలును అక్షరానుసారముగా తీసుకోకూడదు. మనము మానవ మాత్రులము. మన జీవితాంతము వరుకు మనము ఓడిపోతాము. మీరు మానవ మన:ప్రవృత్తిని అర్థంచేసుకోవాలి" అని అంటాడు. యధార్థంగా చెప్పాలంటే నేను మానవ మన:ప్రవృత్తిని లెక్కచేయను. నేను దేవుని వాక్యాన్ని నమ్ముతాను.

అనేకమంది క్రైస్తవులు మానవతర్కము వలన ఖచ్చితంగా ఆ ఇశ్రాయేలీయులు వలే తప్పిపోతారు. దేవుడు ఈ సత్యాలను తెలివైన వారినుండి జ్ఞానులనుండి దాచిపెట్టి పసిపిల్లలకు వాటిని బయలుపరచెను. నీవు బైబిలును అధ్యయనం చేయడానికి నీ తెలివితేటలను మానవ జ్ఞానాన్ని వాడితే నీవు తప్పిపోతావని ఖచ్చితంగా చెప్పగలను. నీకు కావలసింది పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత. అందుకనే యేసు గమాలియేలు వంటి పండితులను అతని విద్యార్థులను కాక చేపలు పట్టువారిని తన శిష్యులుగా యెంచుకున్నాడు. కాన్ని పౌలు ప్రత్యక్షత పొందగలిగే ముందు అతన్ని ప్రభువు మూడేళ్ళపాటు ఎడారిలోనికి తీసుకొనివెళ్ళి అతని గర్వాన్ని శూన్యం చేయవలసివచ్చింది.

ఆయన శక్తిని సందేహించిన ఆ ఇశ్రాయేలీయులపై దేవుడు ఎంతగా కోపపడెనంటే ఆయన వారితో "మరియు ఇశ్రాయేలీయులందరు మోషే అహరోనులపైని సణుగుకొనిరి... కాగా వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు: నన్ను అలక్షము చేసినవారిలో ఎవరును దానిని చూడరు" (సంఖ్యా 14:2, 23) అని చెప్పెను. "పదిసార్లు" అనేది అతిశయోక్తి కాదు. వారు నిజంగా పదిసార్లు తిరుగుబాటు చేశారు. వారి పది తిరుగుబాట్ల యొక్క పట్టిక ఇదే:

1. ఎఱ్ఱ సముద్రము యొద్ద ఐగుప్తీయులు వారిని తరిమినప్పుడు (నిర్గమ 14:11).

2. మారాయొద్ద నీళ్ళు చేదుగా ఉన్నప్పుడు (నిర్గమ 15:24).

3. సీను అరణ్యములో వారికి ఆహారము లేనప్పుడు (నిర్గమ 16:2, 3).

4. వారు మన్నాను ఉదయము వరకు ఉంచినప్పుడు (నిర్గమ 16:20).

5. వారు మన్నా కొరకు సబ్బాతు దినమున బయటకు వెళ్ళినప్పుడు (నిర్గమ 16:27, 28).

6. రెఫీదీములో త్రాగడానికి నీరు లేనప్పుడు (నిర్గమ 171:3).

7. వారు బంగారు దూడను పూజించినప్పుడు (నిర్గన 32).

8. వారు తబేరా యొద్ద సణిగినప్పుడు (సంఖ్యా 11:1).

9. వారు మాంసము కొరకు అడిగినప్పుడు (సంఖ్యా 11:4, 33).

10. వారు కానానులోకి వెళ్ళడానికి నిరాకరించినప్పుడు (సంఖ్యా 13).

దేవుడు వారికి తొమ్మిది తరుణాలను ఇచ్చెను. ఈ రోజున అనేక విశ్వాసులు చేసినట్లే వారు ఆయన క్షమాపణను లెక్కచేయలేదు. తొమ్మిదవ తరుణం వారి చివరి తరుణమని వారు గ్రహించలేదు. దేవుని సహనము అక్కడితో ఆగిపోయింది. వారు పదవసారి తిరుగుబాటు చేసినప్పుడు శిక్షింపబడిరి. వారు తన శిక్షను వినినప్పుడు పశ్చాత్తాపపడి మరొక తరుణం కోసం అడిగారు. కాని అప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది (సంఖ్యా 14:39-45). జయజీవితములోనికి ప్రవేశించే అవకాశాలు నిరంతరము అందుబాటులో ఉండవని అనేక విశ్వాసులు ఒక రోజున తెలుసుకుంటారు.