వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   గృహము సంఘము శిష్యులు
WFTW Body: 

ఈ గత కొన్ని వారాలుగా, గొప్పపనిని సంపూర్ణంగా నెరవేర్చడం అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాము. యేసు మత్తయి 28:19లో, మనం ప్రతి దేశానికి వెళ్లి శిష్యులను చేయాలని చెప్పాడు, కాబట్టి మనం లూకా 14లో వివరించిన శిష్యత్వ షరతులను పరిశీలిస్తున్నాము:

మొదటిది, ఈ భూమిపై ఉన్న మనుష్యుల కంటే క్రీస్తును ఎక్కువగా ప్రేమించడం. కీర్తన 73:25 నిజమైన శిష్యుని ఒప్పుకోలు: "ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? భూమిపై నీ కంటే ఎక్కువగా నేను కోరుకునేది మరొకటి లేదు మరియు ఎవ్వరూ లేరు." నేను భూమిపై క్రీస్తు కంటే ఎక్కువ ఎవరినీ కోరుకోను.

రెండవది, నా స్వంత చిత్తం మరియు నా స్వంత ఎంపిక కంటే క్రీస్తును ఎక్కువగా ప్రేమించడం. "ప్రభువా, నేను ఏ విషయంలోనూ నా ఎంపికను కోరుకోవడం లేదు. నా జీవితంలో ప్రతి ఒక్క ప్రాంతంలో నీ చిత్తమే కావాలి -- నా సమయాన్ని, నా డబ్బును, నా శక్తిని, నా జీవితాన్ని, నా ఆశయాలను నేను ఎలా ఖర్చు పెట్టాలి. నా భవిష్యత్తు అంతా యేసు పాదాల దగ్గర ఉంచుతున్నాను."

మూడవది, నా ఆస్తులన్నింటినీ వదులుకోవడం, భూమిపై ఉన్న ప్రతిదానిని వదులుగా పట్టుకోవటం, ఎందుకంటే వీటన్నిటి కంటే నాకు క్రీస్తే ఎక్కువ. ప్రభువు వాటిలో కొన్నింటిని తీసివేసినట్లయితే లేదా వాటిలో కొన్నింటిని నేను పోగొట్టుకున్నట్లయితే, యోబు 1:21లో యోబు చెప్పినట్లుగా, "ప్రభువు ఇచ్చాడు మరియు ప్రభువు తీసివేసాడు, ప్రభువు నామము స్తుతింపబడును గాక" అని చెప్తాను. అది నిజమైన శిష్యుని వైఖరి.

ఒక వ్యక్తి శిష్యత్వానికి సంబంధించిన ఈ మూడు షరతులను నెరవేర్చకపోతే, లూకా 14 ప్రకారం అతను శిష్యుడు కాదు.

మత్తయి 28:19లో ప్రతి దేశానికి వెళ్లి శిష్యులను చేయమని యేసు తన అపొస్తలులకు చెప్పినప్పుడు, క్రీస్తును వారి పాపాలను క్షమించే వ్యక్తిగా మాత్రమే కాకుండా, వారి ప్రభువుగా కూడా తెలుసుకునే స్థాయికి మనం ప్రజలను తీసుకురావాలని ఆయన ఉద్దేశం. అంటే మనం భూమిపై ఉన్న అందరికంటే, మన స్వంత జీవితం కంటే, మన స్వంత చిత్తం కంటే మరియు భూమిపై మనకున్న అన్ని వస్తువుల కంటే ఎక్కువగా ఆయనను ప్రేమిస్తాము. ఆయన వీటన్నింటికంటే మనకు ఎక్కువ.

క్రైస్తవ మిషనరీలు మరియు సువార్త ప్రకటించే సువార్తికులు గొప్పపని యొక్క రెండవ భాగాన్ని నెరవేర్చారని మీరు చెప్పగలరా? నేను లేదు అంటాను. మార్కు 16:15ని 99% మంది నెరవేరుస్తూ, మత్తయి 28:19-20ని 1% మంది నెరవేర్చే దృష్టాంతాన్ని నేను ఎందుకు ఉపయోగించానో మీరు గ్రహించారా? తొంభై-తొమ్మిది మంది వ్యక్తులు మొద్దు యొక్క ఒక చివరను పట్టుకుని, ఒక్క వ్యక్తి మొద్దు యొక్క మరొక చివరను పట్టుకున్నాడు. అందుకే ఆ మొద్దు రెండో చివరను పట్టుకుని ఉన్న వ్యక్తికి సహాయం చేయుటకు ప్రభువు నన్ను పిలిచాడని నేను కనుగొన్నాను. ఈ రోజు ఇది చాలా అవసరం అని నేను నమ్ముతున్నాను మరియు అనేక దేశాలలో క్రైస్తవత్వం ఇంత చెడ్డ సాక్ష్యాన్ని కలిగి ఉండటానికి కూడా ఇది కారణం.

తిరిగి జన్మించిన క్రైస్తవులు ప్రభువు నామానికి ఇంత అవమానం ఎలా తెచ్చారో మనందరికీ తెలుసు. ఎందుకు? ఎందుకంటే వారు కేవలం మార్చబడ్డారు; వారు శిష్యులుగా మారలేదు. వారు తమ స్వంత ఇష్టాన్ని వదులుకునేలా లేదా వారు కలిగి ఉన్న వస్తువుల నుండి వేరు చేయబడేలా తీర్చిదిద్దబడలేదు. దాని తుది ఫలితం లూకా 14లో యేసు చెప్పినట్లుగా ఉంటుంది: వారు పునాది వేసి భవనాన్ని పూర్తి చేయలేని వ్యక్తుల వలె ఉన్నారు.

లూకా 14లోని శిష్యత్వంయొక్క మొత్తం విభాగం మధ్యలో, యేసు ఒక గోపురాన్ని నిర్మించాలనుకునే వ్యక్తి గురించి మాట్లాడాడు, మొత్తం క్రైస్తవ జీవితానికి ఆ గోపురం ఒక చిత్రం. అతను పునాదిని పూర్తి చేసే సమయానికి, గోపురాన్ని పూర్తి చేయడానికి కావలసినది అతని వద్ద లేదు అని చెప్పబడింది. మీరు శిష్యరికం యొక్క ఈ మూడు షరతుల సందర్భంలో చూస్తే, అతను వెల చెల్లించి గోపురాన్ని పూర్తి చేయడానికి ఇష్టపడుట లేదని అర్థం వస్తుంది. బహుశా అతని వద్ద డబ్బు ఉంది, కానీ అతను "నేను దానిని పూర్తి చేయకూడదను కుంటున్నాను" అని చెప్తున్నాడు.

పునాది ఏమిటంటే - మన పాపాలు క్షమించబడి, మనకు పరిశుద్ధాత్మ ఇవ్వబడిన తర్వాత, మనం దేవుని పిల్లలుగా అవుతాము. అయితే క్రైస్తవ జీవితం అంతేనా? యేసు చెప్పిన దాని ప్రకారం కేవలం పునాది మాత్రమే కాదు, అది ఖచ్చితంగా ఒక గోపురం అయి ఉండాలి. గోపురాన్ని పూర్తి చేయని అటువంటి వ్యక్తి ఎగతాళికి గురవుతాడని 29వ వచనం చెప్తుంది. తమ క్రైస్తవ జీవితంలో పునాదిని మాత్రమే వేసుకొని, క్రైస్తవత్వం యొక్క పూర్తి ఉద్దేశ్యం అదే అని క్రైస్తవులు ఊహించుకోవడం చూచి పరలోకంలోని దేవదూతలు ఆశ్చర్యపోతున్నారు.

అందుకే మత్తయి 28:19లో చెప్పబడిన ’మనం ప్రతి దేశానికి వెళ్లి శిష్యులను చేయాలి’ అనే విషయాన్ని నొక్కి చెప్పడం మరియు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఈ రోజు ఏ దేశంలో ఉన్నా, మీరు బోధిస్తున్నట్లయితే, మీరు శిష్యులను తయారు చేయాలి.

యేసు ఈ గొప్పపని యొక్క రెండవ భాగాన్ని దీనితో ముగించాడు, "ఇదిగో నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను." దీని సారాంశం ఏమిటంటే, "మీరు ఇలా చేస్తే, అన్ని దేశాలకు వెళ్లి శిష్యులను తయారు చేస్తే, నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను." షరతును నెరవేర్చకుండా ఆ అద్భుతమైన వాగ్దానాన్ని మనం స్వంతంత్రించుకోలేము.

కానీ మనం శిష్యులను తయారు చేస్తే, ఇది ఎంత అద్భుతమైన హామీ: నేను ప్రపంచమంతటికీ వెళ్లి, సువార్త ప్రకటించుటకు, శిష్యులను తయారు చేయుటకు నిర్ణయించుకుంటే, ప్రభువు ఎల్లప్పుడూ నాతో ఉంటాడు.