WFTW Body: 

సామెతలు 8:1,27లో వరుడు "జ్ఞానము" అని పిలువబడెను. తరువాత తదుపరి ఆధ్యాయములో వధువు కూడా "జ్ఞానము" అని పిలువబడెను (సామెతలు 9:1). ఎందుకనగా ఆమె ప్రతి విషయములో తన వరునితో ఒకటిగా నుండి ఆయన పేరును("జ్ఞానము") తన నొసటి మీద కలిగియుడెను- ఆమె తన వరుని వలే జయించెను (ప్రకటన 3:12,21 మరియు 14:1). సామెతలు 9వ అధ్యాయము వధువుకు మరియు వేశ్యకు మధ్య ఉన్న వ్యత్యాసము స్పష్టముగా చూపబడెను. ఈ అధ్యాయము యొక్క మొదటి 12 వచనాలలో, వధువు జ్ఞానము లేని వారందరిని తమ జ్ఞానములేని మార్గములను విడిచిపెట్టి, పాపుల సాంగత్యమును విడిచిపెట్టి (6వ వచనము), జ్ఞానమునకు మూలమైన దేవుని యందు భయభక్తులను నేర్చుకొనుమని ఆహ్వనించుచున్నది(10వ వచనము). ఈ అధ్యాయము యొక్క చివరి 6వచనాలలో మనము వేశ్య యొక్క పిలుపును గూర్చి చదివెదము. అనేకులు వేశ్య పిలుపుకు స్పందించి ఆత్మీయ మరణమును పొందుదురు (18వ వచనము). వధువు (జ్ఞానము) తన నివాసమును ఏడు స్తంభముల మీద కట్టుకొనినదని మనము అక్కడ చదివెదము. ఈ ఏడు స్తంభముల జాబితా మనకు యాకోబు 3:17లో ఇవ్వబడినది మరియు నిజమైన సంఘము ఈ స్తంభములపైన కట్టబడును. ఈ గుణలక్షణముల ద్వారా మనము క్రీస్తు యొక్క వధువును ఎక్కడైనను గుర్తు పట్టవచ్చును:

1. పవిత్రత: నిజమైన సంఘములో మొదటి మరియు అతి ముఖ్యమైన స్తంభము పవిత్రత. అది కేవలము బాహ్యసంధమైన పవిత్రతతో కూడిన ఒక బోలు స్తంభము కాదు. అది పూర్తిగా గట్టిదైనది. అది హృదయ పవిత్రత మరియు అది హృదయపు లోతులలో ఉన్న దేవుని భయము అనే విత్తనము నుండి పెరుగును. క్రీస్తు యొక్క నిజమైన సంఘము తెలివిగల మెదడులతో కాక పవిత్రమైన హృదయాలతో కట్టబడును. దేవుని గురించి ఆయన మార్గముల గురించి మనకు ఆత్మీయ ప్రత్యక్షత లేనియెడల మనము సంఘమును కట్టలేము. హృదయ శుద్ధి (హృదయమంతటితో దేవుని వెదికేవారు) గలవారు మాత్రమే తమ హృదయాలలో దేవుని చూచుటకు అనుమతించబడుదురు (మత్తయి 5:8)

2. సమాధానము: నీతి, సమాధానము ఎల్లప్పుడు కలిసియుండును. అవి కవలలు. దేవుని రాజ్యము, నీతి సమాధానములతో కూడియున్నది (రోమా 14:17). నిజమైన జ్ఞానము ఎల్లప్పడు గొడవపడదు, వాదించదు. అది పోట్లాడదు. సాధ్యమైనంత వరకు అది అందరితో శాంతియుతమైన సంబంధములను కలిగియుండును. దైవాజ్ఞానముతో నిండియున్న ఒక వ్యక్తితో తగాదా పడుట అసాధ్యము. ఎందుకనగా అటువంటి వ్యక్తి సమాధానపరుడు. అతడు స్ధిరముగా ఉండును మరియు రాజీపడువారిచే ద్వేషించబడవచ్చును. కాని అతడు ఎల్లప్పుడు సమాధానపరుడై యుండును. వారు సువార్తను ప్రకటించుటకు ప్రయాణము చేసినప్పుడు వారు సమాధానపాత్రుల్తెన వారి ఇంటనే యుండవలెనని యేసు తన శిష్యులతో చెప్పెను (లూకా 10:5-7). మనము దేవుని మందిరమును కట్టవలెనంటే మనము సమాధానపాత్రులై ఉండవలెను.

3. పరిగణన(విచారణ): క్రీస్తు యెక్క వధువు ఎల్లప్పుడు ఇతరులతో న్యాయముగాను, సాత్వీకముగాను, ఓరిమితోను, సహనముతోను, మర్యాదగాను ప్రవర్తించును. ఆమె ఎల్లప్పుడు కఠినముగాను లేక బిరుసుగాను ఉండక ఇతరుల భావాలను ఎల్లప్పుడు పరిగణనలోకీ తీసుకొనును. సంఘము ఈ స్తంభము మీద ఆధారపడినప్పుడు, కొందరు తక్కువ జ్ఞానము గలవారైనను, లేక వారి పద్ధతులలో మోటైన వారైనను ఒకరికొకరు భరించుట సులువుగానుండును. సమస్య మన సహోదరుని లేక సహోదరి యొక్క మోటుతనము కాదు గాని మనలో నివసించు అసహనమని మనము గ్రహించుటకు మొదలుపెట్టెదము. కాబట్టి మన సహోదరులు లేక సహోదరిలతో కాక మన నిజమైన శత్రువైన స్వజీవనముతో పోరాడుదుము.

4. సులభముగా లోబడుట: మందలింపును గాని హెచ్చరికను గాని స్వీకరించలేనివాడు లేక ఆ స్ధాయిని దాటి పోయానని అనుకొనేవాడు, ఒక పెద్దయైనను లేక ఒక ముసలివాడైనను నిజముగా జ్ఞానములేనివాడు (ప్రసంగి 4:13 చూడండి). ప్రత్యేకముగా భారత దేశములో, అనేకమంది "పెద్దవారు జ్ఞానము గలవారు" అనే అన్యతలంపును కలిగియుందురు. అది భూసంబంధమైన విషయాలలో నిజమైయుండవచ్చు గాని ఆత్మ సంబంధమైన విషయాలలో ఖచ్చితముగా కాదు. యేసు సమాజమందిములలో ఉన్న వయస్సులో పెద్దవారిని తన శిష్యులుగా ఎంచుకోలేదు. ఆయన యౌననస్ధులను ఎంచుకొనెను. సంఘములో పెద్ద వయస్సు కలవారు, ఎక్కువ భక్తిపరుడై సంఘపెద్దయైన ఒక తక్కువ వయస్సు గల సహోదరుని నుండి హెచ్చరికను పొందుట చాలా కష్టతరముగా నుండును. కాని దానికి కారణము వారి గర్వమే. దిద్దుబాటును స్వీకరించుటకు ఇష్టపడువారు జ్ఞానులగా మారుదురు (సామెతలు 13:10). కాబట్టి ఎక్కడైతే ఒక సంఘములో హెచ్చరికను మరియు దిద్దుబాటును స్వీకరించుటకు ఆసక్తి కలిగిన సహోదరులు మరియు సహోదరీలుందురో అక్కడ ఒక నిజమైన మహిమకరముగల సంఘము కట్టబడును. జ్ఞానముగలవాడు తనను నమ్మకముగా హెచ్చరించువారిని ప్రేమించి వారి సాంగత్యమును ఆసక్తితో కోరుకొనును. "ఒకనికొకడు లోబడియుండుడి" అను మాటలు ఈ స్తంభము మీద వ్రాయబడి యున్నవి (ఎఫెసి 5:21).

5. సంపూర్ణమైన దయ మరియు దాని మంచి ఫలములు: క్రీస్తు యొక్క వధువు అప్పుడప్పుడు కనికరము కలది మాత్రమే గాక కనికరముతో నిండియుండును. ఆమెకు ఎవరినైనను ధారాళముగా ఆనందముతో హృదయపూర్వకముగా క్షమించుటకు ఏ సమస్యా లేదు. ఆమె ఇతరులకు తీర్పుతీర్చదు, ఖండించదు, కాని తన వరుని వలే వారి యెడల కనికరము చూపును. ఈ కనికరము అనేది కేవలము మనస్సుయొక్క వైఖరి కాదు గాని తన క్రియలనుండి వచ్చు మంచి ఫలముల ద్వారా వ్యక్తపరచబడును. ఆమె మంచి చేయగలిగిన వారందరికీ అన్ని విధాలుగాను అన్ని సమయములలో మంచి చేయును.

6. స్ధిరత్వము (నిలకడగా నిలిచియుండుట): దైవ జ్ఞానము కలిగిన ఒక సహోదరుడు వంచన అంతటినుండి విడిపించబడియుండును. అతడు పూర్ణహృదయుడై, ముక్కుసూటిగా ఉండి సందేహములు గాని సంకోచము గాని లేనివాడైయుండును. అతడు ద్విమనస్కుడు కాక, దేవుని యందు బలమైన విశ్వాసము కలిగియుండును. అతడు తన బలహీనతలవైపు చూడక దేవుని వాగ్దానముల వైపు చూచును. తెలిసిన ప్రతి పాపముపైన విజయము ఇప్పుడిక్కడ సాధ్యమేనని ఆ సహోదరునికి తెలియును. అతడు ఒక నమ్మకస్తుడైన వ్యక్తి- అన్ని సమయములలోను అతడు తన మాటను నిలబెట్టుకొనునని అతనిని నమ్మవచ్చును. అతడు స్థిరముగాను కదల్చబడనివాడుగాను ఉండును. అతడు తన ఒప్పుదలను మార్చుకొనునట్లు లేక ఏ విషయములోను రాజీపడునట్లు మీరు చేయలేరు. అతడు ఒక కఱ్ఱవలే నేరుగాను నిటారుగాను ఉండును.

7.వేషదారణ నుండి విడుదల: ఇతరులు ఆమెలో బయట చూచేదానికంటే వధువు తన అంతరంగములో ఎక్కువ ఆత్మానుసారతను కలిగియుండును. ఇతరులు ఆమె బయట జీవితమును గూర్చికలిగియున్న అభిప్రాయము కంటే ఆమె అంతరంగ జీవితము మెరుగైనదిగా ఉండును. మనుష్యుల ఘనతను పొందుటకు మాత్రమే ఆత్మానుసారిగా పిలువబడే దానిని కలిగియున్న 'వేశ్య'కు లేక 'ఆత్మీయ వ్యభిచారిణి'కి ఇది పూర్తిగా వ్యత్యాసముగానున్నది. ఆమెకున్నది నిజానికి 'మతానుసారత'యే గాని నిజమైన ఆత్మానుసారత కాదు. వధువు తన బయట మాటలు మరియు క్రియల కంటే మరియెక్కువగా తన అంతరంగ తలంపులను, ఉద్దేశాలను, వైఖరులను గమనించుకొనును. ఆమె తన బయట జీవితమును గూర్చి మనుష్యుల ఆమోదమును అసలు పట్టించుకొనక, తన అంతరంగ జీవితమును దేవుడు ఆమోదించవలెనని కోరుకొనును, ఈ పరీక్ష ద్వారా, మనలో ప్రతివారు మనము వధువుకు చెందినవారమో లేక వేశ్యకు చెందినవారమో తెలిసికొనవచ్చును.

క్రీస్తుయొక్క వధువు హృదయములో జ్ఞానము యొక్క విత్తనము నాటబడి యుండును గనుక ఆమెలో ప్రతి సంవత్సరము ఈ ఏడు గుణలక్షణములు ఎదుగుచు ఉండును. ఆమె పరిపూర్ణతకు చాలా దూరముగా ఉన్నప్పటికినీ ఆమె పరిపూర్ణమగుటకు ఎదుగుచూ సాగిపోవుచున్నది.