వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము శిష్యులు
WFTW Body: 

ఆత్మీయ ఎదుగుదల:

శరీరములో ఉన్న ఐక్యతను గురించి పౌలు చెప్పుచున్నాడు "మనమందరము విశ్వాసము విషయంలోను, దేవుని కుమారుని జ్ఞానము విషయంలో ఏకత్వమును పొంది, సంపూర్ణులము అగువరకు.. సమాధానము అను బంధముచేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకోవాలి" (ఎఫెసీ4:1,11,12). కొన్ని విషయములలో విశ్వాసులు ఏకీభవించకపోవచ్చును. క్రీస్తు తన యొక్క సంఘమును తనతో కూడా తీసుకొని వెళ్ళుటకు వచ్చేముందుగానే సంఘము మహా శ్రమల గుండా వెళుతుందనే విషయంలో నాతో మీరు అంగీకరించకపోవచ్చు. అటువంటి అభిప్రాయ భేదములు మనలో ఉండవచ్చును. మనమందరము విశ్వాస సంబంధమైన అన్ని విషయములలో ఏకత్వము పొందేవరకు, మనము ఆత్మలో ఒకటైయుండాలి. మనము ఆత్మలో ఒకటైయుండుటకు మరియు విశ్వాస సంబంధమైన అన్ని విషయములలో ఏకమవ్వనవసరము లేదు.

"మనము సంపూర్ణులమగువరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు" మనము అంతకంతకు క్రీస్తులో వృద్ధిపొంది ఎదగాలి (ఎఫెసీ 4:12). మనమును మరియు ఇతరులు సంపూర్ణపురుషులు అగుటయే మన గురి అయియుండాలి. అందువలన మనమికమీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయోపాయములచేత వంచనతోను, తప్పు మార్గమునకులాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగుర గొట్టబడిన వారమైనట్లుండక, మనము ఆత్మీయముగా అంతకంతకు ఎదగాలి (ఎఫెసీ 4:14). మనము వివేచించుటలో ఎదుగునట్లు మోసకరమైన మరియు తప్పుడు బోధలు వినుటకు దేవుడు మనలను అనుమతిస్తాడు. లేనట్లయితే వివేచనలో మనము ఎదుగలేము. అందువల్లనే అనేకమంది మోసగాళ్ళు మరియు అబద్ధ ప్రవక్తలు క్రైస్తవ్యంలో ఉండునట్లు దేవుడు అనుమతిస్తాడు. ఆవిధముగా మనము ఎవరి ఆత్మ సరియైనదో లేక ఎవరి ఆత్మ సరియైనదికాదో వివేచిస్తాము. మనము ఇతరులను తీర్పుతీర్చము. కాని మనము వివేచించాలి. ఆ విధముగా మన ఆత్మీయ సున్నితత్వము చురుకుగా పనిచేస్తుంది.

ఎఫెసీ 4:15లో క్రీస్తువలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగు నిమిత్తము ప్రేమ కలిగి సత్యము చెప్పాలని కోరబడుచున్నాము. ఇక్కడ సత్యముకు మరియు ప్రేమకు మధ్య ఉన్న సమతుల్యతను చూస్తాము. మనము ఎల్లప్పుడు సత్యమే చెప్పాలా? అవును చెప్పాలి. కాని ఏవిధముగా చెప్పాలి. మనము ఎల్లప్పుడు ప్రేమతోనే సత్యము చెప్పాలి. నీవు ప్రేమతో సత్యమును చెప్పనట్లయితే, ప్రజల యెడల నీకు ప్రేమ కలిగే వరకు వేచియుండాలి. ప్రేమ అనే పలకమీద సత్యము అనే పెన్నుతో వ్రాయవచ్చును. నీవు పలక లేకుండా సత్యమును వ్రాసినట్లయితే, అది గాలిలో వ్రాసినట్లుండును. నీవు వ్రాసినదేమిటో ఎవరికి అర్థము కాదు. సమాజములో గాని లేక వ్యక్తిగతముగా గాని ఎల్లప్పుడు ప్రేమతో మాట్లాడాలి. ఆ విధముగా మనము మనకు శిరస్సైయున్న క్రీస్తుమూలముగా అన్ని విషయములలో క్షేమాభివృద్ధి పొంది శరీరముగా అభివృద్ధి పొందెదము.

సహవాసము:

"ఆయన శిరస్సయియున్నాడు, ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి, తనలో నున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలముచేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు ఆభివృద్ధి కలుగజేసికొనుచున్నది" అని ఎఫెసీ 4:16లో పౌలు చెప్పుచున్నాడు.

ఇక్కడ కీళ్ళు సహవాసము గూర్చి చెప్పుచున్నవి. ఒక చేతిలో ఎన్ని కీళ్ళు ఉన్నవో చూడండి. భుజము దగ్గర ఒకటి, మోచేతి దగ్గర ఒకటి మరియు ప్రతి వేలుకు ఒకటి చొప్పున మొత్తం 17 కీళ్ళు ఉండును. ఈ కీళ్ళు మనము సులభముగా పనిచేయుటకు సహకరిస్తాయి. నీ మోచేయి పైభాగము మరియు క్రిందిభాగము బలముగా ఉండి, మీ మోచేయి వంగనట్లయితే నీచేతితో ఏమిచేయగలవు? ఏమిచేయలేవు. కేవలము బలము కలిగియుండుట మాత్రమే నీ చేయిని ఉపయోగకరముగా మార్చలేవు. కీళ్ళు కూడా పనిచేయాలి. ఇప్పుడు దీనిని క్రీస్తు శరీరమైన అవయవమునకు అమర్చుదాము. ఇక్కడ ఒక మంచి సహోదరుడు నీ మోచేయి పైభాగము వలె బలముగా ఉన్నాడు మరియు ఇంకొక మంచి సహోదరుడు నీ మోచేయి క్రింది భాగము వలె బలము కలిగియున్నాడు. కాని వారిద్దరు కలిసి సహవాసము చేయలేరు. ఈనాటి క్రైస్తవ్యంలో ఉన్న బాధాకరమైన విషయం ఇది. మానవ శరీరములోనైతే దానిని కీళ్ళ జబ్బు అంటారు మరియు అది ఎంతో బాధాకరముగా ఉంటుంది. అనేక స్థానిక సంఘములు ఈ కీళ్ళ జబ్బులు కలిగియున్నవి. మన కీళ్ళు సరిగా పనిచేసినప్పుడు, శబ్దము రాదు. కాని నీ శరీరములో ఈ జబ్బు ఉన్నట్లయితే నీవు కదిలినప్పుడెల్లను శబ్ధము వస్తుంది. కాని కీళ్ళు బాగుగా పనిచేసినట్లయితే అక్కడ శబ్ధమే రాదు. ఒకరియెడల ఒకరికి మనకు ఉన్న సహవాసము ఆవిధముగా ఉండాలి. నీ విషయంలో ఆ విధముగా ఉన్నట్లయితే ఆ జబ్బుకి కావలసిన మందును వాడాలి. అదేమనగా నీవు దేవుని జీవాన్ని సమృద్ధిగా పొందునట్లు నీ స్వజీవానికి చచ్చిపోవాలి. అప్పుడు నీవు స్వస్థత పొంది మరియు ఇతరులతో నీ సహవాసము మహిమకరముగా ఉండును. క్రీస్తు శరీరములో ఇదియే దేవుని చిత్తము.