WFTW Body: 

అంత్యదినములలో ఉన్న ఒక గొప్ప ప్రమాదము "పైకి భక్తిగలవారి వలే ఉండి దానియొక్క శక్తిని ఆశ్రయింపపోవటం" (2తిమోతి 3:2). మనకున్న వరములను బట్టి తలాంతులను బట్టి మనము తృప్తిపడుట చాలా సులభము. తెలివితేటలు, ఉద్రేకముతో కూడిన శక్తి, మరియు ధృఢచిత్తమును కలిగియుండుట ఇవన్నియు మనయొక్క స్వశక్తినుండి వచ్చును. కాని ప్రభువైన క్రీస్తుగాని మరియు పరిశుద్ధాత్ముడుగాని అనుగ్రహించే దైవికశక్తి వీటికి వేరుగా ఉండును.

గొప్ప శాస్త్రవేత్తలు, వేదాంతులు మరియు తెలివిగల బోధకులలో ఇటువంటి తెలివితేటల శక్తిని చూడవచ్చు. రాక్ సంగీతకారుల మరియు అనేకమంది బోధకులలో ఉద్రేకము కలిగేటట్లు చేయు శక్తిని చూడవచ్చు. యోగా చేసే వారిలో, ఉద్యమించేవారిలోను మరియు ఇతరుల మీద పెత్తనము చేయాలని కోరే బోధకులలోను సంకల్పశక్తిని చూచెదము. వీటిని మనము ఆత్మీయశక్తి అని అనుకొనకూడదు.

ఆత్మీయశక్తి మొదటిగా ప్రతివిషయములో దేవునికి విధేయత చూపునట్లు చేస్తుంది. అనేక లక్షల సంవత్సరములనుండి గ్రహములు మరియు నక్షత్రములు దేవునియొక్క శక్తి ద్వారా వాటియొక్క కక్ష్యలలో తిరుగుచున్నవి. దానికి కారణము ఏమనగా అవి దేవునియొక్క నియమములకు సంపూర్ణముగా లోబడుచున్నవి. దేవునికి సంపూర్ణముగా లోబడుటయే అన్నింటికంటే శ్రేష్టమైనది అని ఇవన్నియు సాక్ష్యమిచ్చుచున్నవి.

ప్రభువైనయేసు సాతానును శరీరానుసారమైన శక్తితోగాక ఆత్మశక్తితో జయించాడు. ప్రభువైనయేసు నలభైదినములు ఉపవాసముండి ఎంతో ఆకలితో ఉన్నప్పటికి, రాళ్ళను రొట్టెగా మార్చుకొనమని సాతాను ఆయనను శోధించినప్పుడు యేసుప్రభువు తిరస్కరించాడు. కాని హవ్వ ఆకలితో లేనప్పటికిని తన శరీరము తృప్తిపరచుకొనుటకు ఏదేను తోటలో ఆ పండ్లను తినెను. ఆహారము కొరకు ఉన్నట్లే మన శరీరములో లైంగిక వాంఛ కూడా ఉండును. అది కూడా ఎప్పుడు తృప్తిపరచబడుటకు ఆశపడును. మనము ఆత్మీయశక్తి కలిగియున్నప్పుడు, శరీరమును తృప్తిపరచుకొనుటకంటే దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాటను బట్టి జీవించెదనని చెప్పిన ప్రభువైనయేసును పోలియుండెదము.

సింహములను చీల్చివేయుటకు కావలసిన శక్తిని సంసోను కలిగియుండెను కాని అతనిలో ఉన్న లైంగికవాంఛ అనే సింహము అతనిని చీల్చివేసెను. కాబట్టి ఎటువంటి సింహముకంటెను లైంగికవాంఛ బలమైనదని ఋజువగుచున్నది. కాని యోసేపు సంసోను కంటే బలమైనవాడైయుండి దినదినము అనేకసార్లు లైంగికవాంఛ అనే సింహమును చీల్చివేశాడు (ఆదికాండము 39:7-13).

మనయొక్క ఉద్దేశ్యములను బట్టియే దేవుడు ఆత్మీయశక్తిని అనుగ్రహించును. నీ జీవితములో దేవునినే సంతోషపెట్టి మరియు ఆయనను ఘనపరచుటయే నీ గురియైనయెడల ఆయన వెంటనే తన శక్తిని అనుగ్రహించును. 'మీరు మీ భోగముల నిమిత్తము దురుద్దేశ్యముతో అడగెదరు గనుక మీరు పొందరు' (యాకోబు 4:3).

మనము జీవించుటకు అవసరము గనుక ఉద్యోగము, వ్యాపారము చేసెదము. కాని దేవునిని మాత్రమే సంతోషపెట్టుటయే మన గురియై యుండి మరియు మనకొరకు మనము జీవించక లేక లోకములో గొప్పవారిగా ఉండాలని కోరకూడదు. ఈ లోకముయొక్క మహిమతో సాతాను ప్రభువైనయేసుని కూడా శోధించాడు. కాబట్టి అతడు మనలను కూడా నిశ్చయముగా శోధించును. మనము ఏదొక విధముగా సాతానుకు నమస్కారము చేయుట ద్వారా లోకఘనతను పొందెదము. గనుక ప్రభువైనయేసు వలె ఆ శోధనను తిరస్కరించాలి. మన జీవితములో దేవునియొక్క సంకల్పమును నెరవేర్చునట్లు ధనాపేక్ష విషయములో జాగ్రత్తపడవలెను. ధనాపేక్ష ద్వారా శోధింపబడకుండ ఉండునట్లు జాగ్రత్తపడవలెను. భవిష్యత్తులో, రెండువేల సంవత్సరముల తరువాత కూడా మన ఎంపికల విషయములో చింతలుండకూడదు.