WFTW Body: 

దేవుడు చెప్పిన దానిని చేయకుడని సాతాను కుయుక్తితో హవ్వతో చెప్పాడు (ఆదికాండము 3:1-6). "మీరు నిశ్చయముగా చావరని" అతడు ఆమెతో చెప్పాడు. ఆ విధముగా అతడు హవ్వను పాపము చేయుటకు నడిపించాడు. ఈనాడు కూడా అతడు అదే పద్ధతిలో ఉపయోగించును. "మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల మీరు చావవలసిన వారైయుందురని విశ్వాసులకు దేవుని వాక్యము చెప్పుచున్నది" (రోమా 8:13). కాని "మీరు నిశ్చయముగా చావరు" అని సాతాను చెప్పును. అనేకమంది విశ్వాసులు అతనిని నమ్మి పాపములో జీవించుచున్నారు.

ఒక స్త్రీని మోహపు చూపుతో చూచుటకంటే ఒక కంటిని కోల్పోయి గ్రుడ్డివాడిగా ఉండుటయు మరియు లైంగిక పాపమును చేయుట కంటే తన కుడి హస్తమును కోల్పోవుటయు మంచిదని ఎంతమంది నమ్ముచున్నారు.

కోపమును మరియు లైంగిక పాపమును తీవ్రముగా తీసుకొనని వారు చివరకు నరకానికి వెళ్ళెదరని ఎంతమంది నమ్ముచున్నారు? (మత్తయి 5:22-30)

ఒక అవిశ్వాసిని పెండ్లి చేసుకొనుట దేవుని యెదుట పిడికిలి బిగించినట్లుగా సాక్ష్యమునకు అవిధేయత చూపించినట్లని ఎంతమంది నిజముగా నమ్ముచున్నారు? (1 కొరింథీ 6:14)

హృదయశుద్ధి గలవారు మాత్రమే దేవునిని చూచెదరని ఎంతమంది నమ్ముచున్నారు? (మత్తయి 5:8)

మనుష్యులందరితో సమాధానమును మరియు పరిశుద్ధతను వెంటాడని వారు ప్రభువును చూడలేరని ఎంతమంది నమ్ముచున్నారు? (హెబ్రీ 12:14)

తీర్పు రోజున మనము మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క చెప్పవలెనని ఎంతమంది విశ్వాసులు నమ్ముచున్నారు? (మత్తయి 12:36)

లోకములో ఈ దేవుని మాటలను నమ్మువారు బహుకొద్దిమందియే యున్నారు. క్రైస్తవులను సాతాను ఆవిధముగా మోసగించాడు. దాని ఫలితముగా అనేకమంది విశ్వాసులు దేవునియెడలను మరియు ఆయన హెచ్చరికల యెడలను భయమును కోల్పోయారు. సాతానుచేత పూర్తిగా నాశనము చేయబడేవరకు వారు పాపముతో చెలగాటమాడెదరు.

ఎవరైతే దీనులై నలిగిన హృదయము కలవారై మరియు ఆయన మాట విని వణుకుచుందురో వారినే దేవుడు చూచును (యెషయా 66:1,2). దేవునియొక్క ప్రతి హెచ్చరిక విషయము మనము భయపడాలి. దేవుని యెడల భయభక్తులు కలిగియున్నామనుటకు ఇదియే ఋజువు. దేనిని భయముతో పరిశుద్ధతను సంపూర్ణము చేసుకొనేవారు క్రీస్తు శరీరములో అవయవములై యుండెదరు. జయించువారే రెండవ మరణము (అగ్నిగుండం) నుండి రక్షించబడి జీవవృక్షములో పాలివారై యుందురు (ప్రకటన 20:7,11). సంఘములన్నింటితో ఆత్మ చెప్పుచున్నమాట యిదియే. కాని వినుటకు చెవులు గలవారు చాలా కొద్దిమందియే ఉన్నారు.