WFTW Body: 

మనము అన్నింటికొరకు, అన్ని పరిస్థితులలో మరియు ప్రజలందరి కొరకు కృతజ్ఞతలు చెల్లించవలెనని బైబిలు మనకు చెప్తున్నది.

"మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి" (ఎఫెసీ 5:20).

"ప్రతి విషయము నందును కృతజ్ఞతాస్తుతులను చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము" (1 థెస్స 5:16-18).

"అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరి కొరకును కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను" (1 తిమోతి 2:1).

దేవుని యొక్క సంపూర్ణమైన సార్వభౌమాధికారమును మనము చూసినపుడు మాత్రమే దీనిని మనము అర్థవంతముగా చేయగలము.

దేవుడు యేసును ఎలాగు కాపాడెనో అలాగే మనలను కూడా కాపాడెను. యేసుకు సహాయము చేసిన కృపయే, ఆయన జయించటానికి తోడ్పడిన పరిశుద్ధాత్మ శక్తియే ఇప్పుడు మనకు కూడా అందుబాటులో ఉంది.

యూదా ఆయనను అప్పగించాడు, పేతురు ఆయనను తెలియదని చెప్పాడు. ఆయన శిష్యులు ఆయనను విడిచి పెట్టారు, ఆయనను వెంబడించిన జనసమూహము ఆయనకు వ్యతిరేకంగా తిరిగారు, ఆయన అన్యాయంగా తీర్పు తీర్చబడెను. తప్పుగా నింద మోపబడి సిలువ వేయబడటానికి నడిపించబడ్డాడు. అటువంటి స్థితిలో కూడా ఆయన జన సమూహముల వైపు తిరిగి, "నా గురించి ఏడవవద్దు. మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి" అని చెప్పగలిగారు (లూకా 23:28).

అక్కడ ఆయన గురించి ఆయన జాలిపడడం మచ్చుకైనా లేదు.

తాను త్రాగుతున్న గిన్నె తన తండ్రి యొద్దనుండి పంపబడినదని ఆయనకు తెలుసు. ఇస్కరియోతు యూదా కేవలము ఆ గిన్నె తెచ్చిన సేవకుడు మాత్రమే. అందుచేతనే ఆయన యూదాను ప్రేమతో చూసి "స్నేహితుడా" అని పిలువగలిగాడు. నీవు దేవుని యొక్క సర్వాధికారమందు విశ్వాసము ఉంటే తప్ప ఆలాగు చేయలేవు.

"నా తండ్రి ఇస్తేనే తప్ప నా పైన నీకు ఏ అధికారము లేదు" అని యేసు పిలాతుతో చెప్పెను (యోహాను 19:11).

ఆ నిశ్చయతయే యేసును ఈ లోకంలో ఒక రాజుకున్న హోదాతో నడవ గలిగేటట్లు చేసింది. ఆయన ఆ ఆత్మీయమైన హోదాతో నడిచాడు. అదే ఆత్మీయమైన హోదాతో మరణించాడు.

ఇప్పుడు మనము ’యేసు నడిచినట్లు నడవటానికి పిలువబడ్డాము. పిలాతు యెదుట ఆయన "ఒప్పుకొనిన మంచి ఒప్పుకోలు" వలె మనము కూడా అవిశ్వాసులైన ఈ తరము వారి యెదుట మన యొక్క ఒప్పుకోలు ఒప్పుకోవాల్సి ఉంది.

"సమస్తమునకు జీవాధారకుడైన దేవుని యెదుటను, పొంతిపిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తుయేసు ఎదుటను, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను" (1తిమోతి 6:13,14) పౌలు తిమోతికి చెప్తున్నాడు.

మనము చూచినట్లుగా, మనము ఆయనయొక్క స్వభావములోనికిని, ఆయన యొక్క పరిశుద్ధతలోనికిని, పాలు పంచుకొనేటట్లు దేవుడు మన మేలుకొరకై సమకూర్చి జరిగిస్తారు. ఆయన యొక్క అద్భుతమైన సర్వాధికారంతో మన మార్గాన ఎవరైతే ఎదురుపడతారో వారిని ఆయన యొక్క ఉద్దేశం నెరవేరునట్లు ఉపయోగిస్తారు. ఆ కారణం చేత మనము మనుష్యులందరికొరకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించవచ్చును.

ఎందుచేత దేవుడు ఇబ్బంది పెట్టే పొరుగువారిని, చికాకు పరిచే బంధువులను, మరియు నిరంకుశంగా అధికారం చెలాయించే అధికారిని నిన్ను బాధించడానికి అనుమతిస్తున్నారు? ఆయన వేరే దగ్గరకు వారిని తీసుకొని వెళ్ళవచ్చు లేక వారి ప్రాణాలు ఒక్క క్షణంలో తీసివేసి నిన్ను, నీ జీవితాన్ని మరియెక్కువ సౌఖ్యంగా చేయగలరు. కాని ఆయన అలా చెయ్యరు. ఎందుచేతనంటే ఆయన వాటిని నిన్ను మరింత పరిశుద్ధపరచుటకు ఉపయోగిస్తారు. మరియు వారిని నీ ద్వారా రక్షించాలని కూడా ఆయన కోరతాడు.