వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట శిష్యులు
WFTW Body: 

పిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయములో దేవునియొక్క పరిపూర్ణమైన సంకల్పాన్ని సంపాదించుకోవాలంటే మనకుండవలసిన వైఖరిని గూర్చి పౌలు చెప్పుచున్నాడు. వెనుక ఉన్న వాటిని మరచి మనం ముందున్న వాటికొరకు వెగిరపడాలని పౌలు చెప్పుచున్నాడు. వెనుక ఉన్న వాటిని చూడాలని అతనికి శోధన వచ్చినప్పటికి అతడు దానిని తిరస్కరించేవాడు. అపోస్తలులకార్యములలో 20:23, 24లో తాను పొందబోవుచున్న శ్రమలను గూర్చి తెలిసినప్పటికి అతడు చలించలేదు. దేవునియొక్క గురియొద్దకు చేరుకోవాలనే సంకల్పాన్ని ఏది కూడా కదిలించలేకపోయింది. అపోస్తలులకార్యములలో 26:19లో అతడు 30 సంవత్సరాల క్రితం పొందిన దర్శనమునకు అవిధేయుడను కాలేదని రాజైన అగ్రిప్ప యెదుట సాక్ష్యం చెప్పాడు. తాను వ్రాసిన చివరి పత్రికలో అతడు మంచి పోరాటము పోరాడియున్నాడని చెప్పియున్నాడు (2తిమోతి 4:7). అతని యొక్క చివరి రోజు వరకు దేవుని యొక్క సంకల్పాన్ని చేరే మార్గములోనే వెళ్ళియున్నాడు. అతడు ఆ మార్గాన్ని విడిచిపెట్టి పక్కకు వెళ్ళుటకు లెక్కలేని సార్లు ప్రేరేపణ కలిగినప్పటికి, అతని దృష్టి గురి మీదనే పెట్టుకొని చివరివరకు నమ్మకంగా ఉండి తన పరుగును ముగించాడు. మన జీవిత ఆఖరులో అటువంటి సాక్ష్యం కలిగియుండుట ఎంతో ఆశీర్వాదకరము.

వెనుక ఉన్న వాటిని చూడాలని మనకు ఎన్నోసార్లు శోధన వస్తుంది. గతంలోని ఓటములు మనలను నిరాశపరుస్తాయి. మరియు ఆ విధంగా జరిగినప్పుడు మనం దేవుని పరిచర్యకు పనికిరామని సాతాను మనలను శోధిస్తాడు. ఒక గాడిద కూడా దేవునికి అవసరమని చూచినప్పుడెల్లను ఎంతో ప్రోత్సహించబడతాను (మత్తయి 21:2,3). ప్రభువైన యేసు ఒక మెస్సియాగా తనకు ఒక గాడిద అవసరమయినట్లయితే, మరియు ఒక సందర్భంలో దేవుడు ఒక గాడిద ద్వారా మాట్లాడినప్పుడు(సంఖ్యా.కా. 22:28) మనకందరికి కూడా ఎంతో నిరీక్షణ ఉంది. గడచిన కాలములో ఏది వ్రాయబడినప్పటికిని, మరియు బిలాము యొక్క గాడిద గురించి కూడా, మనందరి యొక్క ప్రోత్సాహము గురించే వ్రాయబడింది(రోమా 15:4). నీవు గాడిదవంటి ఒక బుద్ధిహీనుడవని అనుకున్నప్పటికి మరియు నీవు పదివేల పొరపాట్లు చేసినప్పటికి, నీవు ప్రభువుకి అవసరమైయున్నది. మరియు ఆ విధముగా కూడా నిన్ను ఏర్పరచుకొని నీ ద్వారా కూడా మాట్లాడగలడు.

రేపటిని గూర్చి చింతించవద్దని చెప్పిన బైబిలే, అదే విధముగా వెనుక ఉన్న వాటిని చూడవద్దని కూడా చెప్పుచున్నది. నిన్నటి దినముల గురించి మర్చిపోయి మరియు ఈ దినమును ఎదుర్కొనుచు మరియు భవిష్యత్తుకొరకు ప్రభువునందు విశ్వాసముంచెదము. ఒకవేళ రేపు నీవు ఓడిపోయినట్లయితే దాని గూర్చి నీవు నిరాశపడవద్దు. నీవు ప్రభువు దగ్గరకు వెళ్ళి నీ ఓటమిని ఒప్పుకొని ఆయన రక్తములో కడగబడాలి. అప్పుడు మరలా ఆరంభించు. నీవు మరొకసారి ఓడిపోయినట్లయితే మరలా ప్రభువు దగ్గరికి వెళ్ళి ఆ విధముగానే చేయుము. నీవెన్నడైనను నిరాశపడవద్దు. నీవు వెనుక ఉన్న వాటిని గూర్చి బాధపడకుండా వాటిని విసర్జించాలి. ఎందుకనగా క్రింద పడిపోయిన పాలగురించి కేవలము ఏడవగలము. నీ ప్రాణాన్ని నశింపచేసే వెనుక ఉన్న వాటిని గూర్చిన గర్వాన్ని కుడా విసర్జించుము. ఒకవేళ దేవుడు నిన్ను అద్భుతముగా వాడుకొనినట్లయితే, దానిని మరచిపోవుటకు కావలసిన కృపను వెదకుము. నిన్ను నీవు మెచ్చుకొనుచు ఉండవద్దు. కాని ముందుకు సాగిపో. ఒకవైపు నిరాశద్వారా మరొక వైపు గర్వముద్వారా సాతాను మన మార్గములో పయనించకుండా చేసి మనము ఫలభరితంగా లేకుండా చేస్తాడు.

ఎఫెసి 5:15,16లో ఈ చెడ్డ దినములలో సమయమును సద్వినియోగం చేసుకోవాలని మనకు చెప్పబడింది. అనగా ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మరియు ప్రభువును మహిమపరచాలి (1కొరంథి 15:58). మనమందరము కొద్ది జీవితాన్నే కలిగియున్నాము. ప్రతిరోజు దేవుని కొరకు వెదకుట మంచిది. మనమెల్లప్పుడు ఆయన వైపు చూస్తూ ఉంటేనే అది జరుగుతుంది. మనమెటువంటి భారభరితమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పటికి, మనమిటువంటి మనస్సు కలిగియుండుటకు ప్రయత్నించాలి. కాని మనం ఇతర విశ్వాసులను చూచి వారితో మనలను పోల్చుకొనుచున్నట్లయితే అది మనలను నిరాశపరచవచ్చు లేక గర్వించేటట్లు చేయవచ్చును (యోహాను 21:20-22; 2కొరంథి 10:12). మనమెప్పుడు తిన్నగా ఆయననే చూడాలి మరియు మరొక పక్కకు చూడకూడదు (సామెతలు 4:25).

అపోస్తలుడైన పౌలు మారుమనస్సు పొందకముందు కూడా తన మతమును పూర్ణమనస్సుతో వెంబడించాడు (అపో.కా. 22:3,4). ఈనాడు మనం చూస్తున్నరీతిగా అతడు చలించే విశ్వాసము కలిగిలేడు. అతడు మారుమనస్సు పొందినప్పుడు, క్రీస్తును కూడా పూర్ణ హృదయముతో ప్రేమించాడు. ఇప్పుడు అతడు పైనున్న వాటి మీదనే కాని భూమి మీద ఉన్న వాటిమీద మనస్సు పెట్టుకోలేదు. అదొక్కటే తేడా. నులివెచ్చని స్థితిలో ఉన్న వారిని ప్రభువు కొంచెముకూడా మెచ్చుకొనడని మృత్యుంజయుడైన ప్రభువైన యేసు చెప్పుచున్నాడు (ప్రకటన 3:16). ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకున్న వారి ద్వారా మాత్రమే ఆయన సంకల్పాన్ని ఈ భూమిమీద నెరవేరుస్తాడు. మనం క్రైస్తవులుగా ఉన్నట్లే చదివే విషయంలో కూడా ఉన్నట్లయితే ప్రాథమిక తరగతులలో కూడా పాసయ్యేవారముకాదు. చాలామంది విశ్వాసులు దేవుని సేవించుచున్న రీతిగా ఒక వ్యక్తి ఉద్యోగం చేసియున్నట్లయితే అతడు ఉద్యోగం నుండి తీసివేయబడతాడు. చాలా మంది విశ్వాసులు లౌకిక విషయాలలో ఎంతో ఆసక్తి కలిగియుంటారు కాని ఆత్మసంబంధమైన విషయాలలో ఎంతో తక్కువ ఆసక్తి కలిగియుంటారు. రాజైన హిజ్కియా పూర్ణహృదయముతో పనిచేసినప్పుడు అతడు వర్థిల్లాడు (2దిన 31:21). కాని ఒకరోజు అతడు ముందున్న వాటిని మరచిపోయి విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రోజే అతడు ప్రభువు విషయంలో ఓడిపోయాడు.

తన దృష్టిని గురిమీదనే పెట్టుకొనమని తనను వెంబడించే వారితో మాటలతోను మరియు మాదిరితోను ప్రభువైన యేసు చెప్పారు. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడుకాడని ప్రభువైన యేసు చెప్పారు (లూకా 9:62). ప్రభువైన యేసు కూడా తన తండ్రిచెప్పిన మార్గములో వెళ్ళుటకు తన మనస్సును స్థిరపరచుకున్నారు (లూకా 9:51,52). "నేను నా తండ్రి పనిలో ఉండవలెను" అనునది ఎల్లప్పుడు ప్రభువుయెక్క వైఖరి. మరియు తనను వెంబడించే వారుకూడా అదే మార్గములో నడవాలని ప్రభువు కోరుకున్నాడు. దేవుని చిత్తమును చేసి ఆయనను మహిమపరచాలని ఒకే ఒక్క గురి ప్రభువైన యేసు శిష్యుడు కలిగియుండాలి. మన జీవితములో సిరి, పదవి, వివాహము, ఉద్యోగము మిగిలినవన్నియు కలిసి ఈ ఉద్దేశమును నెరవేర్చాలి. దేవుని సంకల్పమును మనమందరము కోరాలి. అటువంటి మనస్సు మనము కలిగియున్నప్పుడే రోమా 8:28 మనకు అన్వయించుకోగలము. ఇది దేవుని ప్రేమించువారికి మాత్రమే మరియు ఆయన సంకల్పము నెరవేర్చాలని కోరువారికి సమస్తము సమకూడి జరుగుతుంది.

భూమి మీద దేవుని చిత్తమును నెరవేర్చిన వారి పనులు యుగయుగములు నిలిచియుండును (1యోహాను 2:17). మిగిలినవన్నియు నశింపజేయబడును. కాబట్టి దేవుని చిత్తమును చేయుటయే గురిగా కలిగియుండుము. ప్రభువైన యేసుకు ఉన్నట్లే మనకు కూడా అది ఆహారము మరియు పానీయముగా ఉండనిద్దాం (యోహాను 4:34). దేవుని హృదయానుసారుడే ఆయన చిత్తమును నెరవేర్చాలని కోరును. దేవుని దృష్టిలో అటువంటి వారే తన తరములో ఫలభరితమైన పరిచర్య చేయగలరు (అపో.కా. 13:22,36). ఈనాడు లోకములో దేవుడు అటువంటి పురుషులను స్త్రీలను కోరుచున్నాడు.