వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   పునాది సత్యము శిష్యులు
WFTW Body: 

మొట్టమొదటిగా గతపాపములన్నిటి నుండి పాపక్షమాపణపొందుటయు మరియు అది ఎల్లప్పుడు జరుగుటయు మనకు ఎల్లప్పుడు అవసరమైయున్నది. రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు (హెబ్రీ 9:22) కనుక మన గత పాపములయొక్క నేరారోపణను, మన పాపములకొరకు ప్రభువు చేసిన ప్రాయశ్చితం ద్వారా తప్ప దేవుడు మరొక విధానములో తీసివేయలేడు.

మనుష్యులు చేసిన సకలపాపముల కోసం ప్రభువైనయేసు కలువరి సిలువమీద తన ప్రశస్తమైనరక్తము చిందించాడు. దానిని మనము విశ్వసించి పొందినప్పుడే ఆ పాపక్షమాపణ మనదవుతుంది. మనము పాపముల విషయమై మారుమనస్సు పొంది, ప్రభువును విశ్వసించినప్పుడు ఆయన అనుగ్రహించే పాపక్షమాపణను ఆయన మన సకలపాపముల కొరకు ప్రభువు చిందించిన రక్తము ద్వారా పొందుతాము.

క్రీస్తుయొక్క రక్తము మనలను నీతిమంతులుగా కూడా చేస్తుంది (రోమా 5:9). ఇది పాపక్షమాపణ కంటే కూడా మిన్నయైయున్నది. అనగా మన జీవితములలో మనము ఒక్క పాపం కూడా చేయనట్లుగా దేవుడు మనలను చూస్తాడు. ఇదియే మనము నీతిమంతులుగా తీర్చబడుట. "వారి పాపములను ఇక ఎన్నడును జ్ఞాపకము చేసికొననని ప్రభువు వాగ్ధానం చేసియున్నాడు" (హెబ్రీ 8:12). అనగా మనము ఒక్కసారైనను ఒక్క పాపమైనను చేయలేదనట్లుగా దేవుడు మనలను చూస్తాడు. నీతిమంతులుగా తీర్చబడుట అనగా అదియే. క్రీస్తుయొక్క రక్తములో అంత శక్తియున్నది. క్రీస్తురక్తము ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాడన్న విషయం సాతాను కొంతమంది విశ్వాసులకు మరుగుచేసియుండగా, అనేకమంది విశ్వాసులు గతజీవితాన్ని బట్టి నేరారోపణలో ఉంటారు.

ప్రభువైనయేసుక్రీస్తు రక్తము ద్వారా మనము విమోచించబడియున్నాము (1 పేతురు 1:18). అనగా మనము పాపము యొక్క దాసత్వంనుండి ప్రభువుచేత కొనబడియున్నాము. మనమిక ఎప్పటికి దాసులుముగా ఉండక స్వతంత్రులుగా ఉండుటకు దేవునియొక్క పరిశుద్ధ నియమము కోరినదంతయు చెల్లించుటకు క్రీస్తు కలువరి సిలువ మీద ప్రశస్తరక్తము మన కొరకు చిందించియున్నాడు. మనము స్వతంత్రులుగా ఉండుటకు క్రొత్తగా జన్మించాము. మనము సాతానుకుగాని, మనుష్యులకుగాని, నేరారోపణనకుగాని, భయమునకుగాని లేక పాపమునకుగాని దాసులముగా ఉండనవసరం లేదు.

క్రీస్తుయొక్క రక్తముద్వారా మనము దేవునియొక్క సన్నిధిలోనికి తీసుకొనిరాబడ్డాము (ఎఫెసీ 2:13). సమీపించరాని తేజస్సులో దేవుడు నివసిస్తున్నాడు. మన జీవితకాలమంతయు క్రీస్తురక్తము ద్వారా మాత్రమే దేవుని సన్నిధిలో ప్రవేశించగలము. మనము ఎంత పరిశుద్ధులమైనప్పటికిని, కేవలం క్రీస్తురక్తము ద్వారా మాత్రమే దేవుని సన్నిధిలో ప్రవేశించగలము. కొందరు విశ్వాసులు ఈ విషయాన్ని మరచిపోయి, తెలిసిన పాపం మీద జయం పొందిన తరువాత చివరకు పరిసయ్యులుగా మారెదరు.

కలువరిసిలువ మీద క్రీస్తు మనలను దేవునితో సమాధానపరిచాడు (కొలస్సీ 1:20). దేవుడు ఇప్పుడు మనకు శత్రువు కాదు. ఈ యొక్క సత్యం మన మనస్సులలో బహుబలముగా నాటబడాలి. చాలామంది విశ్వాసులు దేవుడు తమ విషయమై సంతోషముగా లేడనియు మరియు మొహం చాటేసుకొనియున్నాడనియు భావిస్తారు. విశ్వాసులు నేరారోపణలోఉండునట్లును మరియు వారు ఆత్మీయముగా ఎదగకుండునట్లును సాతాను చెప్పే అబద్ధాలే ఇవి. క్రీస్తురక్తము ద్వారా మనము దేవునికి స్నేహితులమైయున్నాము. మనము దీనిని నమ్మనట్లయితే మనము ఎప్పటికీ ఆత్మీయ అభివృద్ధి పొందలేము.

మనము వెలుగులో నడిచినప్పుడు క్రీస్తు యొక్క రక్తము ఎల్లప్పుడు మన ప్రతిపాపం నుండి శుద్ధిచేస్తుంది(1 యోహాను 1:7). వెలుగులో నడుచుట అనగా తెలిసిన పాపములను జయించుట. మనకు తెలిసిన పాపములను జయిస్తున్నప్పటికినీ, మనకు తెలియని పాపము ఎంతో ఉన్నది. అందువలన యోహాను ఇట్లనుచున్నాడు, "మనము పాపములేనివారమని చెప్పుకొనినయెడల, మనలను మనమే మోసపుచ్చుకొందము" (1 యోహాను 1:8).

మనము శరీరము కలిగి ఉన్నాము కాబట్టి మనము అనాలోచితంగా పాపము చేయుటలేదు కాని మనము రక్షణపొందకముందు మరియు రక్షణపొందిన తరువాత తెలిసికూడా ఎంతో స్వార్ధముతో జీవించాము కనుక చేస్తున్నాము. ప్రభువైనయేసు కూడా మనవంటి శరీరమే కలిగియున్నాడు. కాని ఆయన ఎన్నడైనను స్వార్ధముతో జీవించలేదు కనుక ఆయన తనకు తెలియని పాపము కూడా చేయలేదు. ఆయనలో పాపము కొంచెం కూడా లేదు (1 యోహాను 3:5).

మనకు తెలియని పాపములు (అవి ఆరంభములో మనలో సుమారుగా 90% ఉండవచ్చును) ఎల్లప్పుడు క్రీస్తు రక్తము చేత శుద్ధిచేయబడును. అందువలన మనము తండ్రితో ఎల్లప్పుడు సహవాసం కలిగియుండగలము.

క్రీస్తుయొక్క రక్తముద్వారా మనము సాతానును మరియు అతని నేరారోపణను జయించగలము (ప్రకటన 12:11). సాతాను దేవునియెదుట, ఇతరుల యెదుట మరియు మనలో మనకు కూడా నేరారోపణ కలుగజేస్తాడు. కాని క్షమించబడిబడియున్నామనియు నీతిమంతులుగా చేయబడియున్నామనియు విమోచించబడియున్నామనియు, దేవునియెద్దకు తీసుకొని రాబడియున్నామనియు మరియు దేవునితో సహవాసము కలిగియున్నామనియు మరియు క్రీస్తు యొక్క రక్తములో కడుగబడియున్నామని ఒప్పుకొనుటద్వారా(సాక్ష్యము చెప్పుట ద్వారా) మనము నేరారోపణను జయించగలము. అప్పుడు సాతానుకు మనమీద ఎటువంటి శక్తిగాని, అధికారంగాని ఉండదు.

ప్రతిరోజు మనమందరము తెలియక పాపము చేస్తుంటాము కొందరు విశ్వాసులు తెలిసికూడా చేస్తుంటారు కనుక మనలను పవిత్రపరచుటకు క్రీస్తుయొక్క రక్తము ప్రతిరోజు మనకు అవసరము.