WFTW Body: 

క్రైస్తవ్యములోని మొదటి 300 సంవత్సరములు, దాదాపు క్రైస్తవులందరును క్రైస్తవవిరోధులైన పాలకులచేత శ్రమలుపొంది మరియు వారిలో అనేకులు చంపబడిరి. దేవుడు తన యొక్క మహిమార్థం, ఆయన యొక్క జ్ఞానముతో తన యొక్క పిల్లలను శ్రమపెట్టుటకు ప్రజలను అనుమతించాడు. ఈనాడు కూడా దేవుడు తనయొక్క ప్రియమైనకుమారులలో కొందరిని హింసించే ప్రభుత్వంక్రింద ఉండేటట్లు దేవుడు అనుమతించుచున్నాడు. హింసింపబడినప్పుడెల్లను సంఘము బహుగా విస్తరించెను. కాని సంఘము సుఖసౌఖ్యములను మరియు వస్తు వాహనములను సమృద్ధిగా పొందినప్పుడు, వారిలో అనేకులు లోకానుసారులైరి. మనము ఈ లోకములో జీవించుచున్నంతవరకు, మనకు శ్రమలు, హింసలు మరియు పరీక్షలు కలుగును. కాబట్టి మనము ఈ యుగాంతములో ఉన్నాము. కనుక మనము పనిచేసే స్థలములోగాని మరియు మన వ్యక్తిగత జీవితములోగాని సౌఖ్యముగా(సులభముగా) ఉంటుందని అనుకోకూడదు.

ఆర్థిక ఇబ్బందులు రావచ్చును. కాబట్టి మనము సామాన్యముగా జీవించుట ఇప్పుడే నేర్చుకోవాలి. సుఖసౌఖ్యములతో జీవించేవారికి, రాబోయే దినములు కష్టముగా ఉండును. భవిష్యత్తులో మనము ఇతరులమీద ఆధారపడకుండునట్లు, మనము కొంత డబ్బును పొదుపు చేసుకోవాలి. అయినను మనము దేవునినే నమ్మెదముగాని మనము పొదుపు చేసిన ధనమును నమ్మము. మన దేవుడు రోషము గలవాడు గనుక సృష్టించబడినవాటిని మనము నమ్మునట్లు ఆయన అనుమతించును. సృష్టించబడిన వస్తువులను నమ్ముచున్నవారు కదిలించబడునట్లు, ఈ లోకములో ఉన్న ఆర్థిక వ్యవస్థలను దేవుడు కదిలించబోవుచున్నాడు. ప్రభువైనయేసు చెప్పిన రీతిగా, సహోదరుడు సహోదరునిమీద నమ్మకద్రోహము చేయుననియు మరియు మన కుటుంబీకులే మనకు శత్రువులగుటను మనము చూచెదము(మత్తయి 10:21). ఆఫీసులలోను మరియు ఫ్యాక్టరీలలోను విశ్వాసులు హింసించబడుదురు. ఇవన్నియు మనలను పవిత్రపరచి మరియు మంచి క్రైస్తవులనుగా చేయును. 1 పేతురు 3:13లో మనము మంచి విషయములో ఆసక్తి కలిగియున్నట్లయితే, మనకు ఎవరు హానిచేయరని చెప్పుచున్నది. కాబట్టి మనము దేవుని కృపను అనుభవించుట ద్వారా, ప్రతి ఒక్కరికి మేలు చేయునట్లు నిర్ణయించుకొనెదము. మనలను ద్వేషించువారిని ప్రేమించెదము, శపించువారిని దీవించెదము మరియు మనలను బాధించువారికి పాపక్షమాపణను గూర్చి ప్రార్థన చేయుదము. అప్పుడు మనకు ఎవరును హానిచేయలేరు. సాతాను మరియు అతని యొక్క దూతలు మనలను మోసము చేయవచ్చును, మనలను ఇబ్బంది పెట్టవచ్చును, మనలను వేధించవచ్చును, దొంగిలించవచ్చును, మనలను గాయపరచవచ్చును, మనలను జైళ్ళలో పెట్టవచ్చును మరియు చివరకు మనలను చంపవచ్చును. కాని ఆత్మీయముగా వారు మనకు ఎటువంటి హానిని చేయలేరు.

రాబోయే దినములలో విశ్వాసమును బట్టి కలిగే హింసలన్నిటి కొరకు, ప్రపంచములోని క్రైస్తవులను మనము సిద్ధపరచాలి. ఆ దినముల కొరకు ప్రభువు మనకు నాలుగు ఆజ్ఞలను ఇచ్చియున్నాడు.

1. "మనము పాములవలె వివేకులమును మరియు పావురములవలె నిష్కపటులమై ఉండవలెను" (మత్తయి 10:16).

మనము సాక్షము చెప్పినప్పుడు బుద్ధిహీనులమై ఉండక జ్ఞానము కలిగియుండాలి. మనము జీవించే స్థలములోను మరియు మనము పనిచేసేస్థలములోను మనము క్రీస్తువలె జీవించాలి మరియు క్రీస్తువలె మాట్లాడాలి. మనము ప్రభువు కొరకు సాక్ష్యము చెప్పినప్పుడు, ఇతర మతములకంటె క్రైస్తవమతము గొప్పదని కాక ప్రభువైన యేసుక్రీస్తు గురించి మాట్లాడాలి. ప్రభువైన యేసు మనలో మహిమ పరచబడునట్లు, ఆయన తనవైపుకు అనేకులను ఆకర్షించును (యోహాను 12:32). క్రైస్తవ్యము యెడల, ఆసక్తి ఉన్నట్లుగా నటించి మరియు మనము చెప్పిన కొన్ని మాటలను బట్టి నిందించుచు మరియు బలవంతముగా మతమార్పిడి జరిగించుచున్నామని చెప్పి, కోర్టుకు తీసుకు వెళ్లాలని కోరే క్రైస్తవులు కానివారియెడల మనము జాగ్రత్తగా ఉండవలెను. కాబట్టి ప్రభువైన యేసువలె మనము జ్ఞానమును మరియు ప్రేమను కలిగియుండాలి: (1) "ప్రభువైన యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు" (యోహాను 2:23-25). మనము ప్రతి ఒక్కరిని వివేచించవలెను. (2) "యూదయలోని యూదులు ఆయనను చంపవలెనని కోరుచున్నారు గనుక అక్కడికి వెల్లుటకు ప్రభువైన యేసు ఇష్టపడలేదు" (యోహాను 7:1). అనవసరమైన అపాయమును మనము తెచ్చుకొనరాదు. (3) "మిమ్మును హింసించు వారికొరకు ప్రార్ధన చేయుడి" (మత్తయి 5:44). మంచివాడవై యుండుము - మరియు ఇతరులు చెడ్డవారు గనుక నీవు చెడ్డవానిగా మారకు.

2. "దేవుని నోటిలోనుండి వచ్చు ప్రతి మాటవలన జీవించుము" (మత్తయి 4:4).

మనము హింసించబడుచున్న సమయములలో, దేవుడు మన హృదయములతో మాట్లాడుచున్న మాటలను మనము వినవలెను. మనము రోజంతయు దేవుని నుండి వినే అలవాటును అభివృద్ధి చేసుకొనవలెను. దేవునిలోనుండి వచ్చిన మాటలను మనము విశ్వసించి మరియు మనము లోబడాలి. లేనట్లయితే, దానికి విలువ ఉండదు. దేవుని స్వరమును మనము వినగలుగునట్లు దేవుని వాక్యమును (ప్రత్యేకముగా క్రొత్త నిబంధనను) ఎక్కువగా ధ్యానించవలెను. "అప్పుడు మనము నమ్మి లోబడగలము".

3. "నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగల వారైనయెడల దీనినిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను" (యోహాను 13:34,35).

మన యింటిలోను మరియు మన సంఘములలోను, ఒకరిని ఒకరు తీర్పు తీర్చుటయు, ఒకరి మీద ఒకరు కొండెములు మరియు చాడీలు చెప్పుటయు, ఒకరిమీద ఒకరు పోట్లాడుటయు మరియు ఒకరిని ఒకరు అనుమానించుటయు పూర్తిగా ఆపివేయవలెను. వివేచన దైవస్వభావము, అనుమానించుట సాతాను స్వభావము. మన జీవితములలోని పాపముమీద మరియు సాతానుమీద పోరాడుట గురించి దృష్టిపెట్టే సమయమిది. మన యొక్క భాగస్వాములను ప్రేమించుట కొరకును మరియు మనయొక్క సహవిశ్వాసులను ప్రేమించుట కొరకును ప్రయాసపడవలెను.

4. "లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యము తెచ్చుకొనుము. నేను లోకమును జయించియున్నాను" (యోహాను 16:33).

దేవుడు సింహసనాసీనుడైయున్నాడు మరియు ఆయన తన వారిని ఎన్నటికిని విడిచిపెట్టడు. రెండువేల సంవత్సరముల క్రితము సాతాను ఓడించబడియున్నాడు. మనము దేవుని యొక్క కనుగ్రుడ్డుయైయున్నాము. కాబట్టి ఆయన మన చుట్టూ అగ్నిప్రాకారముగా ఉన్నాడు (జెకర్యా 2:5,8). మనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు (యెషయా 54:17). కాబట్టి మనము, "ధనాపేక్షలేనివారమై కలిగిన వాటితో తృప్తి పొందియుండెదము, ఎందుకనగా దేవుడే యిట్లనుచున్నాడు, నిన్ను ఏమాత్రమును విడువను. నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. కాబట్టి ప్రభువు నాకు సహయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు?"(హెబ్రీ 13:5,6).

మనము ఈ విధముగా ప్రార్ధించెదము, "ఓ యేసుప్రభువా, త్వరగా రమ్ము" (ప్రకటన 22:20).