WFTW Body: 

యేసు నమ్మకమైన వారికి ప్రతిఫలమిస్తారనేది నిజమే (ప్రక. 22:12) . మన జీవితంయొక్క అంతిమ కోరిక ప్రభువును సంతోషపెట్టడంగా ఉండాలి అన్నది కూడా నిజమే (2 కొరి. 5:9) . ఆ విధంగా మనం "భళా! నమ్మకమైన మంచి దాసుడా" అనే పదాలు ఒకరోజున వింటాము. అయినప్పటికీ పరలోకపు ప్రతిఫలం కోసమైన మన స్వార్థపూరితమైన కోరిక మన త్యాగాలను, ఆయన కోసం మనం చేసే సేవను ప్రేరేపించుట గురించి యేసు స్వయంగా మనలను హెచ్చరించారు.

పేతురు తనను తాను ధనవంతుడు మరియు యౌవ్వనుడైన అధికారితో (అప్పుడే యేసు నుండి వెనుదిరిగినవాడు) పోల్చుకుని, "నీ కోసం మేము విడిచిపెట్టిన ప్రతిదానికీ మేము ఏమి పొందుతాము?" అని అడిగాడు (మత్త. 19:27). యేసు కూలీల ఉపమానంతో సమాధానమిచ్చాడు (మత్త. 20:1-16). అక్కడ జీతం (ప్రతిఫలం) కోసం పనిచేసిన వారు చివరిగా మిగిలిపోయారు, ప్రతిఫలం గురించి ఆలోచించకుండా పనిచేసిన వారు మొదటి స్థానంలో నిలిచారు (మొదటివారు చేసిన పనికంటే వీరు తక్కువ శాతం మాత్రమే చేసినప్పటికీ).

పరిమాణం లేక నాణ్యత - ఇక్కడే మనం మృత క్రియలకు మరియు సజీవ క్రియలకు మధ్య వ్యత్యాసాన్ని చూస్తాము. అంతిమంగా మనం ఇతర విశ్వాసుల కంటే ఎక్కువగా హెచ్చింపబడతామని మరియు క్రీస్తు వధువులో ఒక స్థానాన్ని కనుగొంటామనే ఆశతో చేసిన పనులు చివరి రోజులో మృత క్రియలుగా బహిర్గతమవుతాయి.

భవిష్యత్తులో ఏదో ఒక రోజులో ఉన్నత స్థితికి హెచ్చింపబడతామనే ఆలోచనతో మీరు మీ ఆలోచన జీవితాన్ని శుద్ధి చేయటం, ఇతరులకు మేలు చేయటం, మీ భార్యను ప్రేమించటం లేదా మీ భర్తకు లోబడటం చేస్తూ ఉంటే, 'స్వయం' ఇప్పటికీ మీ జీవితంలో కేంద్రంగా ఉంది. మీ స్వీయ-కేంద్రీకృతమైన 'మంచి' క్రియలన్నీ మృతక్రియలే!

మహిమలో కిరీటాలను పొందేవారు వాటిని ప్రభువు పాదాల చెంత వెంటనే పడవేసి, "నీవు మాత్రమే అర్హుడవు" అని చెప్తారు (ప్రక. 4:10). దేవుణ్ణి మహిమపరచాలనే కోరిక కాకుండా ఇతర ఉద్దేశాల నుండి మనల్ని మనం ప్రక్షాళన చేసుకున్నప్పుడే, మనం మృత క్రియల నుండి విముక్తి పొందగలము. మనం చేసిన మంచి పనులన్నిటినీ మన జ్ఞాపకంలో ఉంచుకుంటే, ఆ మంచి క్రియలు మృత క్రియలు అవుతాయి.

యేసు ఆఖరి తీర్పు దినానికి సంబంధించిన రెండు చిత్రాలను మనకు ఇచ్చాడు - ఒకదానిలో ప్రజలు తమ భూసంబంధమైన జీవితాలలో చేసిన మంచి పనులను ప్రభువు ముందు చెప్పారు -"ప్రభువా, మేము మీ నామంలో ప్రవచించాము, మీ నామంలో రోగులను స్వస్థపరిచాము, మొదలైనవి" (మత్త. 7:22,23). ఈ ప్రజలు ప్రభువుచే తిరస్కరించబడ్డారు. మరొక చిత్రంలో, నీతిమంతులు తమ భూసంబంధమైన జీవితంలో చేసిన మంచిని ప్రభువు గుర్తుచేసినప్పుడు వారు ఆశ్చర్యపోయారు - "ప్రభువా, మేము ఎప్పుడు చేశాము?" అనేది వారి ఆశ్చర్యకరమైన మొర (మత్త. 25:34-40). వారు చేసిన మంచిని మరచిపోయారు - ఎందుకంటే వారు ప్రతిఫలం కోసం ఆ పనులను చేయలేదు. అక్కడ మనం మృత క్రియలుకు మరియు సజీవ క్రియలుకు స్పష్టమైన వ్యత్యాసాన్ని చూస్తాము. మనం ఏ వర్గానికి సరిపోతాము?