WFTW Body: 

యేసుప్రభువు డబ్బు విషయంలో, తనకు పరిచర్య చేయువారు మరియు అన్ని సంఘములు వెంబడించునట్లు ఒక ఉదాహరణను ఇచ్చారు.

యేసుప్రభువు 30 సంవత్సరాల వరకు వడ్రంగి పని చేస్తూ, నిజాయితీగా, ఎవరిని మోసం చేయకుండ, అప్పు చేయకుండా తన జీవనోపాధిని సంపాదించుకున్నారు.

కాబట్టి తరువాతి 3 1/2 సంవత్సరాలు పూర్తికాల పరిచర్యలో ఉన్నాడు. ఈ సమయంలో ఆయన డబ్బు విషయములో కఠినమైన నియమములు కలిగియున్నాడు. అపొస్తలులు ఆ నియమములను ఖచ్చితముగా మరియు స్థిరముగా వెంబడించారు. మొదటి క్రీస్తుశరీరం(యేసు) వెంబడించిన నియమములనే క్రీస్తుశరీరమైన సంఘము వెంబడించాలి. ఈ నియమములనే సంఘములన్నియు మరియు క్రైస్తవ పనిలో ఉన్న వారందరు ఖచ్చితముగా వెంబడించాలి.

ఆ నియమములు ఏమిటి?

మొట్టమొదటిగా, యేసు తన తండ్రియొక్క సేవకుడైయున్నాడు కాబట్టి ఒక పరిశ్రమలో పనిచేసే వ్యక్తి తన ఆర్ధిక అవసరతలన్ని పరిశ్రమ చూచుకుంటుందని ఆశించినట్లు, యేసు తన భూసంబంధమైన అవసరతలన్ని తన తండ్రి అనుగ్రహిస్తాడని తండ్రిని నమ్మాడు. ఆయన తన పరిచర్యను ఎక్కడైనను చాటించలేదు, సహాయం కొరకు తన పనిని గూర్చి ఎటువంటి నివేదికలు ఇవ్వలేదు. దేవుడే కొంతమందిని స్వచ్ఛంధంగా యేసుకు బహుమానములను ఇచ్చునట్లు ప్రేరేపించాడు - ఆయన అటువంటి బహుమానములను అంగీకరించాడు. యేసు ఆ డబ్బును చూచుకొనుటకు ఒక కోశాధికారిని(ఇస్కరియోతు యూదా) నియమించాడు.

లూకా 8:2,3 చూడండి: "పండ్రెండుమంది శిష్యులును, అపవిత్రాత్మలును వ్యాధులును పోగొట్టబడిన కొందరు స్త్రీలును, అనగా ఏడు దయ్యములు వదలి పోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహనిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతోకూడ ఉండిరి. వీరును ఇతరులనేకులును, తమకు కలిగిన ఆస్థితో వారికి ఉపచారము చేయుచువచ్చిరి". యేసు వారి బహుమతులను అంగీకరించారు.

రెండవదిగా, యేసు తాను తీసుకున్న డబ్బును ఖర్చుచేసే విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉన్నారు. యేసు డబ్బును ఎలా ఖర్చు చేసేవాడో యోహాను 13:29 సూచిస్తుంది. అక్కడ యూదాకు కొన్ని సూచనలు ఇచ్చినప్పుడు, ఎల్లప్పుడు ఏ విధంగా డబ్బు ఖర్చు పెడతాడో అదే విధంగా ఖర్చు పెట్టమని యూదాకు సూచించినట్టుగా మిగిలిన అపొస్తలులు ఆలోచించారు. అవి 1). అవసరమైనవి కొనుట 2). పేదలకు ఇచ్చుట. మన డబ్బును ఖర్చుచేసే విషయంలో ఇదియే మనకు మార్గదర్శకం.

అపొస్తలులు ఇదే మాదిరిని ఖచ్చితముగా వెంబడించారు. వారు కూడా తమ అవసరతలన్నిటి కొరకు తమ పరలోక తండ్రిని నమ్మారు. వారి వ్యక్తిగత మరియు వారి పరిచర్య అవసరతల గురించి, నేరుగాగాని లేక పత్రికలద్వారాగాని (అది పరోక్షంగా వారి అవసరతల కొరకు సూచించినట్టుగా ఉంటుంది) ఎవ్వరికి చెప్పలేదు. అపొస్తలులు డబ్బును సేకరించమని చెప్పినప్పుడు, అది ఎల్లప్పుడు పేద ప్రజలకు పంచిపెట్టుటకే కాని మరి ఏ విధమైన ఉద్దేశము లేదు (2 కొరింథీ 8,9; 1 కొరింథీ 16:1-3 చూడండి).

కొందరు 1 తిమోతి 5:17-19 వచనాలను తప్పుగా బోధించే పాస్టర్లు, సంఘపనివారికి మంచి జీతములను ఇవ్వాలని తప్పుగా బోధిస్తారు. ఆ వచనములు ఏమి చెప్పుచున్నవి?

"బాగుగా పాలనచేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారిని, రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. ఇందుకు 'నూర్చెడి యెద్దు మూతికి చిక్కము వేయవద్దు' అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు".

ఈ వచనాలు డబ్బును గూర్చి చెప్పుటలేదు. ఈ వచనాలు కేవలం, వాక్యము బోధించుటలో ప్రయాసపడు పెద్దలకు వారి మంద రెటింపు ఘనతనివ్వమని చెప్తున్నాయి. ఈ వచనము ఒకవేళ డబ్బుగూర్చి చెప్తునట్లయితే, దేవుడు సంఘములను వారి నాయకులకు ఇతరులకంటే రెటింపు జీతం ఇవ్వమని ఆజ్ఞాపిస్తున్నాడని అర్థం వస్తుంది. ఇది బుద్ధిహీనత! పౌలు వారి సంఘములలోని పెద్దలను అభినందించి గౌరవించమని బోధిస్తున్నాడు. పౌలు "కళ్ళము తొక్కుతున్న ఎద్దును తినుటకు అనుమతించినట్టు, వారి ఘనతను వారికి ఇవ్వండి". కాబట్టి ఒక సంఘపెద్ద ప్రాథమికమైన జీతము వారి మంద నుండి ఘనత(ప్రశంస మరియు కృతజ్ఞత), కాని డబ్బు కాదు.

ఇది 1 థెస్స 5:12,13 వచనాలలో పౌలు ఇచ్చిన హెచ్చరిక వలె ఉన్నది - "మీకొరకు కష్టపడి పనిచేసే నాయకులను ఘనపరచుడి..... ప్రేమ మరియు ప్రశంస చేత వారిని ముంచివేయండి"(ఆంగ్ల మెసేజ్ తర్జుమా).

పౌలు 1 కొరింథీ 9:7-18 వచనాలలో క్రైస్తవ పనివారి ఆర్ధిక సహాయం గురించి మాట్లాడుతున్నాడు. "ఎవడైనను తన సొంత ఖర్చుపెట్టుకొని దండులో కొలువు చేయునా? ద్రాక్షతోట వేసి దాని ఫలము తిననివాడెవడు? మందను కాచి మంద పాలు త్రాగనివాడెవడు? మీ కొరకు ఆత్మసంబంధమైనవి మేము విత్తియుండగా మీ వలన శరీరసంబంధమైన ఫలములు కోసికొనుట గొప్ప కార్యమా?"

మరియు పౌలు ఈ విధముగా చెప్తున్నాడు "అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు; క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటిని సహించుచున్నాము. ఆలాగున సువార్త ప్రచురించువారు సువార్తవలన జీవింపవలెనని ప్రభువు నియమించియున్నాడు. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు; ఎవడైనను నా అతిశయమును నిరర్ధకము చేయుటకంటే నాకు మరణమే మేలు. నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయకారణములేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయినయెడల నాకు శ్రమ. ఇది నేనిష్టపడి చేసిన యెడల నాకు జీతము దొరకును. ఇష్టపడకపోయినను గృహనిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించునప్పుడు సువార్తయందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండ సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. సువార్తను ప్రకటించువానిగా నా అధికారములను నేను వినియోగపరచుకోలేదు".

పౌలు జీతము కొరకు, బహుమతుల కొరకు కాక "క్రీస్తు ప్రేమ చేత బలవంతము చేయబడి" మరియు "దేవుడు సువార్త యొక్క గృహనిర్వాహకత్వమును అతనికి అప్పగించినందుకు" బోధించాడు. సువార్త వినినందుకు దేవుడు వెల చెల్లింపమన్నట్లుగా ఉండకుండా, సువార్తను ఇతరులకు ఉచితముగా, వెల లేకుండా ఇవ్వాలనుకున్నాడు. మరియు ఇతరులను తన మాదిరిని వెంబడించాలని కోరాడు(1 కొరింథీ 11:1, ఫిలిప్పీ 3:17 చూడండి).

యేసు తీసుకున్నట్లు ప్రభువుయొక్క సేవకుడు బహుమతులు తీసుకొనవచ్చని క్రొత్త నిబంధన బోధిస్తున్నదని చూస్తున్నాము. అదే సమయములో క్రింది విధంగా కూడా చూస్తాము:

1. క్రైస్తవ బోధకులు ఎవ్వరికి నెల జీతం చెల్లించబడలేదు. యేసు తన శిష్యులకు జీతమును ఇస్తానని వాగ్ధానం చేయలేదు. అపొస్తలులు జీతము తీసుకోలేదు. యేసు మాదిరిగానే వారి ఆర్ధిక అవసరతల కొరకు ప్రజల హృదయాలను ప్రేరేపించుటకు తమ పరలోక తండ్రిని నమ్మారు. వారి పరిచర్యలలో శక్తిని కలిగియుండుటకు అటువంటి విశ్వాస జీవితం వారికి అవసరమైయున్నది. దురాశ నుండి కూడా వారిని అది రక్షిస్తుంది.

2. ఈ సహాయం పొందుకొనే అవకాశమును బోధకులు దుర్వినియోగపరచే అవకాశము ఉన్నది కాబట్టి ఎవరి దగ్గర డబ్బు తీసుకోకుండా తనను తాను పోషించుకొనుటకు అతను నిర్ణయించుకున్నాడు. దీని ద్వారా తాను ప్రకటించే సువార్త సాక్ష్యమును భద్రపరిచాడు. 2 కొరింథీ 11:7-13 వచనాలలో "నేను ఏ విధమైన వెల లేకుండా మీకు సువార్తను ప్రకటించితిని. మాసిదోనియ క్రైస్తవులు నాకు బహుమానము తీసుకొని వచ్చారు, మిమ్మును ఏమియు అడుగలేదు. ఇంతవరకు మిమ్మును నయా పైసా కూడా అడుగలేదు, ఇకను అడుగబోను. దీని గురించి నేను అందరికి చెప్పుదును! మా వలె సువార్త ప్రకటించుచున్నామని చెప్పుకొని అతిశయించు వారికి ఆధారము లేకుండునట్లు నేను ఈ విధముగా చేయుచున్నాను. దేవుడు వారిని పంపలేదు; వారు మోసగాండ్రైయుండి క్రీస్తు అపొస్తలులని మిమ్మును మోసము చేశారు".

పౌలు అప్పుడప్పుడు బహుమతులు తీసుకున్నాడని మనము చూచాము. మాసిదోనియ(ఫిలిప్పీ) క్రైస్తవులు స్వచ్ఛందముగా కొంత డబ్బు పంపినప్పుడు దానిని స్వీకరించాడు. అయితే పైన చూచినట్లుగా కొరింథీ క్రైస్తవులనుండి డబ్బును తీసుకోలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న నఖలీ క్రైస్తవ బోధకులకు వేరుగా ఉండాలని కోరుకున్నాడు. పౌలు తన ఆర్ధిక అవసరతల గురించి ఎటువంటి సూచనలు ఇవ్వలేదు, ఎవ్వరిని ఆర్ధికసహాయం అడుగలేదు.

పౌలు ఎఫెసీ క్రైస్తవులనుండి కూడా డబ్బు తీసుకోలేదు. అపొ.కార్యములు 20:31-35 వచనాలలో "కావున నేను మూడు సంవత్సరములు మీతో ఉండి...ఎవని వెండినైనను, బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు; నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియును. మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు 'పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము' అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసికొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను".

పౌలు వలె ప్రభువుయొక్క ప్రతి సేవకుడు కూడా డబ్బు విషయంలో క్రీస్తు యొక్క వైఖరిని వ్యక్తపరచునట్లుగా చూచుకోవాలి.

దేవుడు స్థాపించిన అన్ని సి.ఎఫ్.సి సంఘములన్నిటిలో ఉన్న 150 మంది కంటే ఎక్కువగా ఉన్న సంఘపెద్దలు/నాయకులు వారిని వారు పోషించుకుంటున్నారు. వారిలో ఎవ్వరు కూడా జీతము తీసుకోలేదు. 1975లో మొదటి స్.ఎఫ్.సి సంఘము ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఇండియాలోని పెద్ద పట్టణములలో మరియు పేద పల్లెటూరులలో ఈ క్రొత్త నిబంధన పద్దతి మాకు సంపూర్ణముగా పని చేసింది. మేము తీసుకున్న ఈ నిర్ణయం లేఖనములను తప్పుగా చూపించి ప్రజలను దోపిడిచేసే బోధకులు మాలోనికి చొరబడకుండా కాపాడింది.

క్రొత్త నిబంధనలోని ప్రభువు సేవకులందరు పైన ఉన్న విధంగానే నిర్ణయం తీసుకున్నారు. కాని క్రైస్తవలోకం శతాబ్దాలనుండి ఈ ప్రమాణం నుండి వైదొలిగారు. ఈ రోజున పాస్టర్లు మరియు బోధకులు ప్రజలను డబ్బు ఇవ్వమని ప్రేరేపిస్తూ ఉంటారు మరియు వారి పోషకులను(స్పాన్సర్) మరి ఎక్కువ ఆర్ధికసహాయం కొరకు ప్రేరేపించే పత్రికలు(తరచుగా మారుమనస్సు పొందిన వ్యక్తుల తప్పుడు లెక్కలతో ఉంటాయి) వ్రాస్తుంటారు.

క్రైస్తవ నాయకుల మధ్య డబ్బు విషయంలో ఈ విధమైన తప్పుడు వైఖరిని బట్టి ఈరోజు చాలావరకు క్రైస్తవ పరిచర్యలో దేవుని అభిషేకము లేదు. మరియు అనేక బోధకుల పరిచర్యలలో పరలోకము నుండి ప్రత్యక్షత లేదు. ఎవ్వరు కూడా దేవునిని మరియు సిరిని సేవించలేరు (లూకా 16:13).

డబ్బు విషయములో నమ్మకముగా ఉన్న వారికే దైవిక ప్రత్యక్షతలు మరియు పరిశుద్ధాత్మ అభిషేకం మరియు అనేక నిజమైన సంపదలు అనుగ్రహింపబడునని ప్రభువు చెప్పారు (లూకా 16:11).

ఇంకొక ముఖ్యమైన సూత్రమును మనము మనస్సులో ఉంచుకోవాలి: ప్రభువు యొక్క సేవకుడు ఎప్పటికీ అవిశ్వాసులనుండి లేక తనకంటే బీదలైన వారిదగ్గర నుండి డబ్బు తీసుకొనకూడదు. పేద వ్యక్తి ఇచ్చిన బహుమానమును ఎల్లప్పుడు సంఘ కానుకల పెట్టెలో వేయాలి కాని తన కొరకు ఉపయోగించకూడదు.

మేము సి.ఎఫ్.సి బెంగళూరు కానుకల పెట్టెపై ఉంచిన స్వీయపరీక్షల జాబితా:

మీరు డబ్బు ఇచ్చే ముందు దయచేసి పరీక్షించుకొనుడి:

1. నీవు క్రొత్త జన్మించిన దేవుని బిడ్డవా?

2. మీ కుటుంబ అవసరతల నిమిత్తము తగినంత డబ్బు ఉన్నదా?

3. నీవు అప్పు లేకుండా ఉన్నావా(గృహ రుణం కాకుండా)?

4. నీవు అందరితో సమాధానపడ్డావా?

5. నీవు సంతోషముతో ఇస్తున్నావా?

పైన ఉన్న ప్రమాణాలకు లేఖనాధారాలను క్రింద ఉన్న లింక్‍లో చూడవచ్చు

https://telugu.cfcindia.com/our-financial-policy-2

ఈ విషయములో మనకు వేరుగా చేయు సంఘములను మరియు బోధకులను మనము తీర్పుతీర్చము. అది మనలను పరిసయ్యులనుగా చేయును. కాని యేసుప్రభువు జీవితములోను మరియు అపొస్తలులలోను చూచిన ప్రమాణములను ఖచ్చితముగా భద్రపరచుటకు చూచుదుము.

వినుటకు చెవులు గలవాడు వినును గాక.

ఆమెన్.