WFTW Body: 

2 కొరంథీ 3:12-18లో మోషేను మరియు క్రీస్తును పాతనిబంధన మరియు క్రొత్తనిబంధనతో పౌలు పోల్చియున్నాడు. మోషే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని మహిమ మోషే ముఖము మీద ప్రకాశించింది. అతడు పర్వతము నుండి దిగివచ్చినప్పుడు తన ముఖము మీద ముసుకు వేసుకొనెను. ప్రజలు అతనిని చూచి భయపడకుండునట్లు ముసుకు వేసుకొనెనని నిర్గమకాండము చెప్పుచున్నది. కానీ ఇక్కడ మరొక కారణం ఇవ్వబడింది. అదేమనగా కాలం గడిచే కొలది మహిమ తగ్గిపోవుచున్నది. కాబట్టి తగ్గిపోవుచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరిచూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుకు వేసికొన్నాడు (2 కొరంథీ 3:12, 13). తమ వ్యక్తిగత జీవితములలో ఉన్న మహిమ అంతకంతకు తగ్గిపోవుచున్న క్రైస్తవులు ఈనాడు అనేకమంది ఉన్నారు. ఈనాడు 50 సంవత్సరములు ఉన్న కొందరు బోధకులు, 25 సంవత్సరముల వయస్సులో దేవునికొరకు ఎంతో ఆసక్తితో ఉన్నారు. కానీ ధనము, పాపము, మరియు అనేక ఇతర విషయములలో ఇప్పుడు వారు క్రీస్తువలె లేరు. ఇది పాతనిబంధన పరిచర్య యొక్క గురుతైయున్నది - తగ్గిపోవుచున్న మహిమ.

కాని క్రొత్తనిబంధన పరిచర్య దీనికి ఎంతో వేరుగా ఉన్నది. మనము ముఖము మీద ముసుకు వేసుకోనవసరము లేదు. మన వ్యక్తిగత జీవితములో దేనిని దాచనక్కరలేదు. క్రొత్తనిబంధనలో ముసుకు తీసివేయబడింది. గనుక, యేసు తన ముఖము మీద ముసుకుతో రాలేదు. "నీ హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును" (2 కొరంథీ 3:16). దేవుని వాక్యములో ఉన్న ప్రభువైన యేసు మహిమను మనము చూచేకొలది, దినదినము క్రీస్తు యొక్క మహిమ మనలో విస్తరించి వ్యాపించునట్లు పరిశుద్ధాత్మ మనలను రూపాంతర పరుస్తూ మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపించును (2 కొరంథీ 3:18). మరొక మాటలో చెప్పాలంటే, పరిశుద్ధాత్మకు మనము లోబడే కొలది, కొన్ని సంవత్సరముల క్రితము ఉన్న అభిషేకము కంటే మరి ఎక్కువ అభిషేకము కలిగియుందుము. నీవు నమ్మకముగా లేనట్లయితే, నీవు పెద్దవాడవు అయ్యేకొలది నీ జీవితములో ఉన్న మహిమ అంతకంతకు తగ్గిపోవును. ఎంతో ఆసక్తి కలిగిన యౌవనస్తులు వారికి వివాహము జరిగిన వెంటనే వెనుకంజ వేయుదురు. ఎందుకు ఈ విధముగా జరుగుతుంది? నీవు దేవుని చిత్తప్రకారముగా పెళ్ళి చేసికొనినట్లయితే, నీలో ఉన్న ఆసక్తి మరియు మహిమ ఇంతకు ముందు ఉన్నదానికంటే ఎక్కువ అవుతుంది. కానీ దేవుని కంటే నీ భార్యగాని లేక నీ గృహముగాని నీకు ముఖ్యమైనట్లయితే మహిమ అంతకంతకు తగ్గిపోతుంది. అటువంటి వ్యక్తి యేసుయొక్క మహిమను చూడలేకపోవుట వలన అతడు వెనుకకు దిగజారును.

పేరుప్రతిష్ఠలు లేకుండా సామాన్యముగా ఉండి ప్రభువును సేవించు కొందరు సహోదరుల జీవితములలో ఎంతో అభిషేకము మరియు మహిమ ఉంటుంది. కాని వారి పరిచర్య విస్తరించి మరియు వారు పేరు పొందినప్పుడు వారి అభిషేకాన్ని పోగొట్టుకొనుచున్నారు. వారి మీద ప్రజలకు ఉన్న అభిప్రాయమును గురించి ఎక్కువగా దృష్టిపెట్టుచున్నారు. లేక వారు పరిచర్య ఆరంభించినప్పుడు వారి యొద్ద ధనము కొంచమే ఉండియుండవచ్చును మరియు ధనమును ఖర్చుపెట్టే విషయములో చాలా జాగ్రత్తగా ఉండి యుండవచ్చును. కాని ధనాపేక్ష గల ఇతర క్రైస్తవ పరిచారకులతో కలసి వారివలే మారియుండవచ్చును. కాబట్టి వారి మహిమ తగ్గిపోవుచుండెను.

ఇటువంటి విషయములు మన జీవితములలో ఉన్న మహిమను చాలా సులభముగా తీసివేయును. మరియు అనేకమంది బోధకులు తగ్గిపోవుచున్న వారి మహిమను మోషేవలె కప్పుకొనుచున్నారు. ఇది దేవుని చిత్తము కాదు కాబట్టి, ఇది నీ జీవితములో జరుగకుండునట్లు జాగ్రత్తపడుము. మన జీవితములలో దేవుని మహిమ అంతకంతకు విస్తరించాలి. కాబట్టి దేవుని వాక్యములో ఉన్న యేసు మహిమను ఎల్లప్పుడు చూడాలి. ఈ విధముగా మనము కాపాడబడతాము.

2 కొరంథీ 3:18వ వచనము, క్రొత్తనిబంధన అంతటిలో పరిశుద్ధాత్ముని పరిచర్య గురించి అద్భుతముగా వివరిస్తుంది. మన జీవితములలో పరిశుద్ధాత్ముడే ప్రభువైనప్పుడు, ఆయన మనలోనికి స్వాతంత్ర్యమును తెచ్చును. "ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును" (2 కొరంథీ 3:17). ప్రాముఖ్యముగా పాపము యొక్క శక్తి నుండి మాత్రమే గాక ధనాపేక్షనుండియు, దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా ఉన్న మన తండ్రుల మరియు పెద్దల ఆచారములనుండి, ప్రజల అభిప్రాయమునుండియు మొదలగువాటినుండి పరిశుద్ధాత్ముడు మనలను స్వతంత్రులుగా చేయును. ఇది ఎంతో గొప్ప స్వాతంత్ర్యము. అప్పుడు మనము మనుష్యుని సేవించుట నుండి విడిపించబడి దేవునినే సేవించెదము.

2 కొరంథీ 3:18లో లేఖనములలో ఉన్న యేసు మహిమను పరిశుద్ధాత్ముడు మనకు చూపించునని చెప్పబడింది (దేవుని వాక్యమే అద్దమైయున్నది - యాకోబు 1:23-25). కేవలము ప్రసంగములను సిద్ధపరచుకొనుటకును మరియు సిద్ధాంతములను పరీక్షించుటకును కొందరు బైబిలు చదివెదరు. కాని బైబిలులో యేసుయొక్క మహిమను మనకు చూపించాలని పరిశుద్ధాత్ముడు ప్రాముఖ్యముగా కోరుచున్నాడు. మనము ఆ మహిమను చూచెకొలది, క్రీస్తు పోలికలోనికి పరిశుద్ధాత్ముడు మనలను రూపాంతర పరుచును. ప్రభువైనక్రీస్తు పరిచర్య చేసినట్లే మనము కూడా చేయునట్లు ఆయన మనలను మార్చును. అప్పుడు ప్రభువైన యేసువలె పరిచర్య చేయుటకు ఆరంభించెదము. తన తండ్రికి సేవ చేయుటకు, యేసు ఎలా త్యాగములు చేశాడో పరిశుద్ధాత్ముడు మనకు చూపించును - మరియు ప్రభువును సేవించునట్లు, మనము కూడా త్యాగములు చేయునట్లు మనలను మార్చును. మనలను రూపాంతరపరచుటకు పరిశుద్ధాత్మతో మనము సహకరించేకొలది మన జీవితము మరియు మన పరిచర్య తీవ్రముగా మార్పుచెందును. మనము క్రొత్తనిబంధన సేవకులము అవుదుము - అలా అగుటకు మనము ఉద్యోగమును విడిచిపెట్టనవసరము లేదు. సంఘములో ఉన్న ఏ సహోదరుడు అయినను లేక ఏ సహోదరి అయినను క్రొత్తనిబంధన సేవకులుగా ఉండవచ్చును.