WFTW Body: 

ఎల్లప్పుడు గుర్తించుకొనుము మన జీవితమనే ఓడ ప్రయాణించుటకు మంచి మనస్సాక్షి మరియు యథార్థమైన విశ్వాసము అను పట్టులు సరిగా ఉండవలెను. ఈ రెండిటిలో దేనిని నిర్లక్ష్యము చేసినప్పటికిని ఓడ బద్దలైపోవును (1 తిమోతి 1:19,20).

కాబట్టి ఎల్లప్పుడూ నీ మనస్సాక్షి సున్నితముగా ఉండునట్లు చూచుకొనుము. నీ మనస్సాక్షి భంగపడినప్పుడు నీవు సరియైన మార్గము విడిచి మరియు అపాయములో ఉన్నావని నిశ్చయించుకొనుము. మనస్సాక్షి యొక్క గద్దింపులను నిర్లక్ష్యము చేయుచూ, నీవు అలాగే కొనసాగుచున్నయెడల, నీ జీవితమనే ఓడ బద్దలైపోయే అవకాశమున్నది. కాబట్టి ఈ విషయములో నీవు ఎంతో ఎంతో జాగ్రత్తగా ఉండుము.

నీవు క్షేమముగా వెళ్ళుటకు విశ్వాసము అనునది ముఖ్యమైయున్నది. విశ్వాసమనగా పూర్తిగా దేవుని మీద ఆనుకొనుటయు, మార్పులేని ప్రేమను, ఎల్లప్పుడూ ప్రేమను సంపూర్ణముగా నమ్ముటయు, ఆయన యొక్క సర్వశక్తిని, సంపూర్ణ జ్ఞానమును నమ్ముటయే.

దేవుడు తనయొక్క మార్పులేని ప్రేమద్వారా మన జీవితములో జరిగే వాటినన్నిటిని అనుమతించును. కొన్నిసార్లు ఆ పరిపూర్ణమైన ప్రేమను బట్టి మన ప్రార్థనను వినకపోవచ్చును.

మన శక్తికి మించిన శోధన మనకు రాకుండునట్లు తనయొక్క సర్వశక్తితో దేవుడు వాటిని ఆపివేయును (1 కొరింథీ 10:13); మరియు అది ఆ శోధన జయించుటకు మనకు సహాయపడును (హెబ్రీ 4:16); మరియు సమస్తమును సమకూర్చి మనకు అతిశ్రేష్టమైన మేలు కలుగునట్లు ఆయన చేయుచున్నాడు (రోమా 8:28 ).

దేవుడు తన యొక్క సంపూర్ణ జ్ఞానమును బట్టి మన జీవితములో దేనిని పొరపాటుగా అనుమతించడు మరియు మన నిత్యమైన మేలు గురించి ఆయనకే తెలియును.

దేవునియొక్క ఈ మూడు గుణలక్షణములలో నీవు నమ్మకమును కోల్పోకూడదు. విశ్వాసమూలముగా జీవించుట అనగా ఇదియే. దురదృష్టవశాత్తు ఈనాడు పూర్తికాలపు పరిచర్య చేయువారికి దేవుడు వారియొక్క అవసరములు తీర్చుటయే విశ్వాసమూలముగా జీవించుట అని చెప్పుచున్నారు. ఆ వాక్యమును ఆవిధముగా ఉపయోగించకూడదు. "నీతిమంతులు విశ్వాసమూలముగా జీవించెదరని" బైబిలు చెబుతుంది (రోమా 1:17). బైబిలులో ఉన్న మాటలను ఎల్లప్పుడూ బైబిలు ఉపయోగించిన రీతిగానే ఉపయోగించవలెను.

విశ్వాసవిషయములో మరియు మంచిమనస్సాక్షి విషయములో మనము నిర్లక్ష్యముగా ఉండినయెడల, నెమ్మదిగా మనలో దుష్టహృదయము (ఒక చెడ్డ మనస్సాక్షి) మరియు విశ్వాసములేని హృదయము (విశ్వాసమును కోల్పోయినవాడు) కలుగును. ఇవి మనలను దేవునిని విడిచిపెట్టునట్లుగా చేయును (హెబ్రీ 3:12).

ఈ విధముగా మనము తప్పిపోకుండుటకు, ప్రతి దినము ఒకరినొకరు హెచ్చరించుకొనుచూ ప్రోత్సహించుకొనుచు ఉండవలెను (హెబ్రీ 3:13). కాబట్టి ప్రతి దినము లేఖనములను చదివి, ధ్యానించి, ప్రార్థించుటద్వారాగాని లేక కొన్ని మంచి క్రైస్తవ పుస్తకములు చదువుట ద్వారాగాని లేక సంఘకూటములలోను మరియు సీ.డిల ద్వారా ప్రసంగములను వినుట ద్వారాను ప్రోత్సహించబడాలి.