వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము
WFTW Body: 

"పరలోకరాజ్యము" అను పదము మత్తయిసువార్తలో మాత్రమే కనుగొనగలము. ఈ పదము ఈ సువార్తలో 31 సార్లు వచ్చింది. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి మత్తయిసువార్త వ్రాయబడింది కనుక పరలోకరాజ్యము అను మాట అనేకసార్లు వచ్చుటకు కారణము ఉండిఉంటుంది. "పరలోకరాజ్యము సమీపించి ఉన్నది గనుక మారుమనస్సు పొందుడి" అని బాప్తీస్మమిచ్చు యోహాను బోధించాడు (మత్తయి 3:2). ప్రభువైన యేసు కూడా మత్తయి 4:17లో ఇదే వర్తమానమును చెప్పారు. కొండమీద ప్రసంగములో కూడా మొట్టమొదటిగా ప్రభువు ఇట్లన్నారు "ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోకరాజ్యము వారిది" (మత్తయి 5:3). కాబట్టి పరలోకము అనే మాట క్రొత్తనిబంధన ఆరంభములోనే అనేకసార్లు చెప్పబడింది. కొండమీద ప్రసంగములో పరలోకము అను మాట క్రొత్తనిబంధనలో అనేకసార్లు చెప్పబడింది. కొండమీద ప్రసంగములో పరలోకము అను మాట 17 సార్లు వచ్చింది.

దేవుడు ఇశ్రాయేలుతో చేసిన పాతనిబంధన భూలోక రాజ్య సంబంధమైనది. ఇశ్రాయేలులకు కనాను దేశమును మరియు లోకసంబంధమైన సిరి సంపదలు, శారీరకఆరోగ్యము మరియు భూసంబంధమైన ప్రయోజనములు ఇవ్వబడినవి. తరువాత వారు భూ సంబంధమైన రాజును కలిగి భూసంబంధమైన సంపదలు కలిగి మరియు భూసంబంధమైన ఆశీర్వాదములు కలిగియున్నారు. కాని ప్రభువైనయేసు మనుష్యులను పరలోకసంబంధులుగా చేయుటకు వచ్చెను. కాబట్టి మనము క్రొత్తనిబంధన చదువునప్పుడు, ఇది భూలోకసంబంధమైనది కాదు పరలోకసంబంధమైన సువార్త అని గుర్తించుకోవాలి. దీనిని మనము గ్రహించినట్లయితే, ఈనాడు క్రైస్తవములో ఉన్న గందరగోళము నుండి రక్షింపబడుదుము.

మనము రక్షింపబడియున్నామని చెప్పుదము. విశ్వాసులలో ఈ మాట వాడబడుచున్నది. కాని మనము దేనినుండి రక్షించబడియున్నాము?. కేవలము మన పాపములు క్షమింపబడుటయేనా లేక భూలోకసంబంధమైన మార్గములనుండి రక్షింపబడియున్నామా? భూసంబంధమైన విషయములలో ఆసక్తినుండియు, భూసంబంధమైన మనుష్యులవలె మనుష్యులను మరియు పరిస్థితులను చూచుటనుండియు మరియు భూలోకసంబంధమైన ప్రవర్తననుండియు రక్షింపబడియున్నామా?

క్రొత్తనిబంధన పరలోకరాజ్య సువార్త అయి ఉన్నది. అమెరికా చాలా ఆకర్షనీయమైన దేశము గనుక ప్రపంచములోని అనేకులు అమెరికా దేశపు పౌరులు కావాలని కోరుతున్నారు. కాని ఆఫ్రికాలో ఒక బీద దేశపు పౌరులు కావాలని ఎవరూ కోరరు. కాని అన్నింటికంటే అత్యంత ఆకర్షణీయమైన పరలోక రాజ్యానికి పౌరులు కావాలని ప్రపంచంలోని కొద్దిమంది మాత్రమే ఎందుకు ఆసక్తికలిగియున్నారు? ఎందుకనగా వారు పరలోకరాజ్యము పౌరసత్వము యొక్క మహిమను చూడలేదు. ఎందుకనగా సువార్త సరియైన విధముగా ప్రకటింపబడుటలేదు. కాబట్టి పరలోక విషయములో ఆసక్తిలేని "విశ్వాలులు అని పిలవబడేవారు" సంఘములో కూర్చొనుచున్నారు. వారు ఇప్పుడు పరలోకరాజ్యమును కోరరు గాని వారు మరణించిన తరువాత పరలోకరాజ్యము వెళ్ళాలని కోరెదరు.

మొదటి శతాబ్ధములోవలె ఈనాడు అనేకమంది రాజులు వారి రాజ్యములను పరిపాలించుటలేదు గనుక ఈనాడు అనేకమందికి రాజ్యము అనగా ఏమిటో తెలియుటలేదు. కాని ఈనాడు ప్రభుత్వము అను మాట ఉపయోగించబడుచున్నది. కాబట్టి "భారత ప్రభుత్వము" అని అంటాము గాని "భారతరాజ్యము" అని అనము.

పరలోకరాజ్యము అనగా పరలోకరాజ్య ప్రభుత్వము. అనగా దేవుడు నిన్ను పరిపాలించుచున్నాడు. మీరు ఇండియాలో జీవించుచున్నయెడల, భారత ప్రభుత్వము ఆజ్ఞలకు లోబడియుండాలి. మీరు పరలోక ప్రభుత్వములోనికి వచ్చినయెడల మీరు పరలోక ప్రభుత్వము యొక్క ఆజ్ఞలకు లోబడాలి. నీ యొక్క పౌరసత్వము భూమి నుండి పరలోక రాజ్యమునకు మార్చబడినదా?

రక్షణ అనగా భూలోకరాజ్యము నుండి రక్షింపబడి పరలోకరాజ్యమునకు వెళ్ళుట. కాని అనేకమంది విశ్వాసులయొక్క రక్షణ ఆ విధముగా లేదు. వారు మరణించినప్పుడు పరలోకరాజ్యము వెళ్ళాలని కోరెదరు. కాని ఇప్పుడు పరలోకరాజ్య అధికారము క్రిందకు రారు. వారు పూర్తిగా ఈలోక సంబంధమైన పౌరులవలె జీవించాలని కోరెదరు. అందువలనే వారి క్రైస్తవ జీవితము ఎంతో బలహీనముగా ఉండును.

ఇతర సువార్తలలో కనుగొనని మరొక మాట మత్తయి సువార్తలో ఉన్నది. అది 'సంఘము' అనుమాట. ఆ మాట మత్తయి 16:18లో ఒకసారి మరియు మత్తయి 18:17లో రెండుసార్లు వచ్చింది. ఈ వచనములను మనము గమనించినట్లయితే సంఘము అనగా భూమి మీద ఉన్న పరలోక రాజ్యము. పరలోక ప్రభుత్వములో ప్రతి ఒక్కరు దేవుని అధికారము క్రింద ఉండెదరు, కాని భూమి మీద ఎవరి జీవితము వారే జీవించెదరు. అటువంటి ప్రజల మధ్యలో తమకొరకే తాము జీవించని కొందరిని దేవుడు కలిగియున్నాడు. వారు పరలోక ప్రభుత్వము క్రింద ఉన్నారు.

ఇదియే నిజమైన సంఘము. ప్రపంచములోని సంఘములు పరలోకరాజ్య ప్రభుత్వము క్రింద ఉండియున్నవా? ఆ విధముగా లేవు. ఈ విషయము నా హృదయమును అనేక సంవత్సరములు బాధించింది. మీ హృదయములు కూడా బాధపడుచున్నవి అని నేను నమ్ముచున్నాను. నేను ఇతరులను నిందించుటలేదు. వారు ఆ విధముగా ఉన్నారని నేను చెప్పుటలేదు. కాని మనము ఆ విధముగా ఉన్నామని నేను చెప్పుచున్నాను. మనమే సంఘమై యున్నాము. మరియు పరలోకాధికారము క్రింద ఉండుట ఎంత ఆశీర్వాదకరమై యున్నదో మనము లోకమునకు చూపించలేకపోయాము. కాబట్టి "ఓ యేసుప్రభువా, మా ఓటమిని బట్టి మమ్ములను క్షమించుము. దేవుని అధికారము క్రింద ఉండుట అనగా ఏమిటో లోకమునకు చూపించుటకు మాకు సహాయము చేయుము" అని నేను ప్రార్థించుచున్నాను.