వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము పునాది సత్యము
WFTW Body: 

దేవుని దృక్కోణంలో, ఈ ప్రపంచంలో చివరగా ఉన్న అనేకులు ఆయన దృష్టిలో మొదటివారు.

ఈ అద్భుతమైన విషయము యేసుప్రభువు చెప్పిన ఏడు ఉపమానములలో ఉన్నది.

1. మత్తయి 20:1 పదకొండు గంటలప్పుడు కూలికి వచ్చినవారు, 90 శాతం జీవితమును వృధా చేసుకొన్నవారు (12లో 11గంటలు) మొదటిగా జీతమును పొందిరి.

2. లూకా 15:22 తన తండ్రి ఆస్తిలో 50శాతం ఆస్తిని(తన వాటా) పోగొట్టుకొని మరియు తండ్రి నామమును అవమానపరచినవాడు ఇంటిలో "ప్రశస్తవస్త్రమును", "ఉంగరమును" పొందియున్నాడు. స్వనీతిపరుడైన పెద్ద కుమారుడు ఈ రెండింటిని పొందలేదు.

3. లూకా 7:41 ఎక్కువగా పాపం చేసినవారు ఎక్కువగా క్షమించబడుట వలన ప్రభువును ఎక్కువగా ప్రేమించి ఆయనకు దగ్గరవుదురు.

4. మత్తయి 21:28 మొదటిగా తిరుగుబాటు చేసిన కుమారుడు, తన సహోదరునివలె కాక చివరకు తన తండ్రి చిత్తమును నెరవేర్చెను.

5. లూకా 15:3 తప్పిపోయిన గొఱ్ఱె కాపరియొక్క భుజముపై ఉండుట వలన వేరే గొఱ్ఱెలకంటె అది కాపరికి ఎంతో సన్నిహితముగా ఉన్నది.

6. లూకా 14:10 పెండ్లి విందులో కడపటి చోట కూర్చున్నవాడు పైచోటికి పిలువబడి యున్నాడు.

7. లూకా 18:10 బాహ్య విషయములలో పరిసయ్యునికంటె ఎంతో చెడ్డవాడైన సుంకరి దేవునిచేత నీతిమంతునిగా తీర్పుతీర్చబడుట వలన పరిసయ్యునికంటె ఎంతో ముందున్నాడు.

ఈ ఉపమానములన్నింటిలో ఉన్న సందేశమేమనగా చెడుగా ఆరంభించిన అనేకులు చివరగా బహుమానమును పొందియున్నారు.

మన పరుగును ఎలా ఆరంభించామనే దానికంటే ఎలా ముగించామనేది ముఖ్యమైయున్నది. పౌలు వలె, వారి జీవితమును చెడుగా ఆరంభించినప్పటికి నిరాశపడక, తమ్మునుతాము ఖండించుకొనని వారు బాగుగా ఆరంభించిన వారికంటే ముందుకు వెళ్ళుదురు. తమ జీవితములను పాడుచేసుకొనిన వారికి ఇది ఎంతో ప్రోత్సాహముగా ఉన్నది. ఎన్నటికి నిరాశపడి విడిచిపెట్టక వారి పరుగును కొనసాగించవచ్చు.

యేసుప్రభువును కలువక మునుపు పౌలు తన జీవితములోని మొదటి 30 సంవత్సరములను పాడు చేసుకొన్నాడు. కాని తరువాత 'ఒకేఒక్క' విషయమును చేయుటకు నిర్ణయించుకున్నాడు. ఈ లోకములో తాను జీవించనైయున్న కొద్ది కాలములో, గత జీవితములోని ఓటములన్నింటిని మరచిపోయి యేసువలె రూపాంతరము పొందవలెననే గురి యొద్దకే పరుగెత్తవలెనని నిర్ణయించుకున్నాడు (ఫిలిప్పీ 3:13,14). దేవుడు తాను పిలిచిన పరిచర్య కూడా దీనిలో ఇమిడియున్నది. తన జీవితం యొక్క చివరలో ఇలా చెప్పాడు, "నా పరుగు కడముట్టించితిని. ఇకమీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడియున్నది" (2తిమోతి 4:7,8).

కొరింథీలోని శరీరానుసారులైన క్రైస్తవులకు పౌలు ఇలా చెప్పాడు, "మొదటి బహుమానము పొందునట్లుగా మీరు పరుగెత్తుడి" (1కొరింథీ 9:24).

మారుమనస్సు పొంది మరియు దృఢనిశ్చయతతోను మరియు క్రమశిక్షణతోను పరుగెత్తిన యెడల శరీరానుసారులైన క్రైస్తవులు కూడా క్రైస్తవ పరుగుపందెములో మొదటి బహుమానము పొందగలరు. ఓడిపోయిన ప్రతి క్రైస్తవుడు మారుమనస్సు పొంది, ఎంత వెల అయినను క్రీస్తువలె రూపాంతరము పొందుటకు నిర్ణయించుకొనిన యెడల, వారు క్రైస్తవ పరుగుపందెములో మొదట రాగలరనే నిరీక్షణను పెద్దలమైన మనం కలిగించాలి.