వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము శిష్యులు
WFTW Body: 

'యేసు రక్తముతో' సంతకము చేయుట ద్వారా దేవుడు మానవునితో చేసిన ఒప్పందమే క్రొత్తనిబంధన (హెబ్రీ 13:20 - లివింగ్ బైబిల్). ఇప్పుడు మనము స్వజీవమనే రక్తముతో ఆ నిబంధనపై సంతకము చేయవలెను. దేవుడు చేసిన ఈ నిబంధనలోకి వేరొక విధముగా ప్రవేశింపలేము. అనేకులు వారి స్వజీవము యొక్క రక్తముతో సంతకము చేయనందువలన వారు సంతృప్తి కలిగిన క్రైస్తవ జీవితములోకి ప్రవేశించటంలేదు.

ఈ లోకములో ప్రభువు జీవించినంతకాలం తన శరీరముతో ఒక్కసారి కూడా స్వచిత్తము చేయకుండునట్లు తండ్రితో నిబంధన చేశాడు (హెబ్రీ 10:5-7). ఆయన తన స్వచిత్తమును చంపివేసి, తన స్వచిత్తముయొక్క రక్తము(సిలువ) ద్వారా నిబంధన చేసెను. ఇప్పుడు మనం కూడా ఆ విధముగా ఆయనతో సహవాసము చేయుటకు పిలువబడియున్నాము. ఈ మార్గం నడచుటకు కష్టమైనది కాదు నిజానికి ఇది సంపూర్ణ సంతోషము కలుగజేయును. బాప్తిస్మము మరియు రొట్టెలో పాల్గొనుట ద్వారా ఈ నిబంధన గూర్చి సాక్ష్యము ఇచ్చుచున్నాము.

లూకా 5:38లో ప్రభువు చెప్పిన క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త నిబంధనలో మనం పాలుపొందే దేవుని జీవము గూర్చి చెప్పుచున్నది. పాత ద్రాక్షారసము, నియమనిబంధనలతో కూడిన ధర్మశాస్త్రము క్రింద ఉన్న జీవితమును చూపిస్తుంది. ఏదేను తోటలో ఉన్న రెండు వృక్షములు కూడా ఈ రెండు నిబంధనలను చూపించుచున్నవి. నియమనిబంధనల ద్వారా పైకి పాపం లేకుండా కనబడే జీవితం(తప్పుడు శాఖలలో ఉన్నట్టుగా) మరణానికి నడిపించును - ఈ మంచిచెడుల తెలివినిచ్చే వృక్షం గురించి దేవుడు ఆదామును హెచ్చరించెను. కొన్ని విషయాలు చెడ్డవని కొన్ని విషయాలు పవిత్రమని మనకు బోధించే క్రీస్తు యొక్క జీవములో అంతకంతకు పాలివారమగుటయే నిజమైన క్రైస్తవ్యము. మనకు స్వాతంత్ర్యము ఉంది, కాని నియమనిబంధనలను బట్టి ('ముట్టవద్దు, రుచిచూడవద్దు' కొలొస్సి 2:21) లేక మనుష్యుల మొప్పుకొరకు మనము వాటిని నివారించము.

క్రొత్త ద్రాక్షారసతిత్తి క్రీస్తు శరీరమును సూచిస్తుంది- ఈ శరీరము, ప్రతిదినము సజీవయాగముగా మన శరీరమును సమర్పించుకొనుచు, ప్రతి దినము పరిశుద్ధాత్మతో నింపమని అడుగుతుండగా, యేసుప్రభువు ఈ భూమిమీద జీవించినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన శరీరములో చేసిన దానిని మనలోకూడా చేయుచుండగా నిర్మించబడుతుంది. ఇది ఈ మార్గములో నడిచేవారితో మనం ఏకమగునట్లుగా చేయును. దేవుడు మనకు ఇతరులకు సహాయపడుటకు అవసరమైన వరములను అనుగ్రహించి క్రీస్తులో ఒక్క శరీరముగా అనగా సంఘముగా నిర్మించును.

ఆవిధముగా సాతాను మన కాళ్లక్రింద త్రొక్కబడును (రోమా 16:20). మనను నిందించుటకు లేక నేరారోపణ చేయుటకు సాతానుకు అవకాశము ఇచ్చినయెడల అతడు మన తల మీద కూర్చుండును. కాని వాని స్థానం మన పాదముల క్రింద ఉంది.

దేవుడు అనుగ్రహించు మహిమను పొందకపోవుటయే పాపమని రోమా 3:23 చెప్తుంది - దేవుని మహిమను యేసు జీవితములో చూడగలము. కాబట్టి యేసుతో సహవాసము చేయుచు మనం చేయలేనిది ఏదైనను పాపమని గుర్తుంచుకొనుము.

పాతనిబంధనలో ఎద్దుల, మేకల రక్తము ద్వారా పాపము కేవలం కప్పబడింది కాని తీసివేయబడలేదు (కీర్తన 32:1,2). దానిని పవిత్రపరచడం లేక తుడిచివేయటం సాధ్యం కాలేదు. సంవత్సరం తరువాత సంవత్సరం అవి జ్ఞాపకం చేయబడేవి (హెబ్రీ 10:3,4). కాని క్రొత్తనిబంధనలో యేసు రక్తములో మన పాపములు కడుగబడుటయే గాక వాటిని ఎన్నటికి జ్ఞాపకము చేసుకొననని దేవుడు వాగ్ధానం చేశాడు (హెబ్రీ 8:12). ఈ రెండు నిబంధనల మధ్య ఉన్న తేడాను మీరు స్పష్టముగా తెలుసుకోవాలి.