వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము శిష్యులు
WFTW Body: 

మేము ఒక సంఘముగా మొదట కూడుకొనుట మొదలుపెట్టినప్పుడు మా వ్యక్తిగత జీవితాలలోకాని మాకుటుంబ జీవితాలలోకాని మాకు విజయము లేదు. మేము ఇతర విశ్వాసులను చూచినప్పుడు, వారు కూడా అదే పరిస్థితిలో ఉండుట కనుగొన్నాము. కాబట్టి వారిలో ఎవరియొద్దకు సహాయము కొరకు వెళ్ళలేకపోయాము. కాబట్టి ఒక సంఘముగా తరచు ఉపవాస ప్రార్థన చేసి దేవుణ్ణి ఒక సమాధానము కొరకు వెతికాము. చాలా వరకు సెలవు దినములు ఉపవాస ప్రార్థనలో గడిపాము. నెమ్మదిగా దేవుడు మాకు ఇదివరకు ఎన్నడూ తెలియని నూతన నిబంధన గురించిన సత్యాలు మాకు చూపించుట మొదలుపెట్టెను. మేము ఈ సత్యములు అర్థము చేసికొనుట మొదలుపెట్టగా మేము ఇంకా ఇంకా విడుదల పొందాము మరియు మా జీవితములు మా కుటుంబములు నెమ్మదిగా మార్పుచెందెను.

అప్పుడు ఈ సత్యములను ఇతరులకు ప్రకటించుటకు నాకు ఒక బాధ్యత ఉన్నదని నాకనిపించెను. ఇతర క్రైస్తవులు బోధించని బైబిలులోని సత్యములకు నేను ప్రాధాన్యత ఇచ్చుటకు దేవుడు నన్ను పిలుస్తున్నాడని నాకు స్పష్టమాయెను. కాబట్టి నా చుట్టూ ఉన్నవారు ఏమి బోధించుచున్నారో నేను జాగ్రత్తగా విన్నాను ఈవిధంగా నా బోధించు పరిచర్యలో ఏ విషయములకు ప్రాధాన్యతనిచ్చుటకు పిలువబడితినో నేను కనుగొన్నాను.

సంపూర్ణ సువార్త

కొందరు బోధకులు "సంపూర్ణ సువార్త" అను మాటను ఉపయోగించుట నేను విన్నాను. కాని వారు బోధించినది లేఖనములతో నేను పోల్చిచూచినప్పుడు, వారు సంపూర్ణ సువార్తను అస్సలు బోధించుటలేదని నేను కనుగొన్నాను. హెబ్రీ. 4:2వ అధ్యాయములో, పరిశుద్ధాత్మ "సువార్త"ను "కానానులో ప్రవేశించుట" అని, కేవలము "ఐగుప్తునుండి బయటకువచ్చుట" కాదని వర్ణిస్తాడు. దేవుని ప్రజలు "సబ్బాతు విశ్రాంతి" యొక్క జయములోనికి ప్రవేశించవలెనని నేనక్కడ చదివాను (9వ వచనము). కాబట్టి పాపములయొక్క క్షమాపణ అను సందేశము సువార్తలో సగమేనని నేను చూచాను. సంపూర్ణ సువార్త పాపమును జయించుటను (మన శరీరములోని ఆజానుబాహులను చంపుట) కూడా కలిగియుండెను. ఇటువంటి జీవితం నెమ్మదిగా నాకు వాస్తవికముగా మారినప్పుడు, నేను సంపూర్ణ సువార్తను ప్రకటించుట ప్రారంభించాను.

మారుమనస్సు

ఎక్కువ మంది సువార్తీకులు పాపక్షమాపణ కొరకు క్రీస్తులో విశ్వాసము మాత్రమే అవసరమని బోధించుచుండిరి. పాపమునుండి వెనుతిరుగుట (మారుమనస్సును) దాదాపు ఎవ్వరూ ప్రకటించలేదు. మరియు మారుమనస్సు గూర్చి చెప్పినప్పుడు కూడా, పాపమునకు మూలము స్వార్థమని, స్వంతచిత్తమును వెతుక్కొనుటయని, స్వీయకేంద్రీకృత జీవితమని నిర్వచింపబడలేదు. కాబట్టి జనులకు దేనిని ద్వేషించాలో, దేనినుండి వెనుతిరుగాలో ఖచ్చితముగా తెలియదు. ప్రతి‌ఒక్కరు దేనివిషయములో మారుమనస్సు పొందాలో తెలియునట్లు పాపము యొక్క మూలమును స్పష్టముగా వివరించుట నా పిలుపని నేను చూచాను.

శిష్యత్వము

రక్షణ పొందిన అనేకులకు, వారు క్రీస్తు శిష్యులుగా కూడా మారాలని బోధించబడుటలేదు. యేసు చెప్పిన శిష్యత్వము యొక్క మూడు షరతులు వివరించబడుటలేదు: 1. యేసును కుటుంబస్తులందరికన్నా ఎక్కువగా ప్రేమించుట. 2. ప్రతి దినము సిలువ నెత్తికొనుట (స్వంత చిత్తమునకు చనిపోవుట); మరియు 3. మనకు కలిగినదంతయు విడచిపెట్టుట (భౌతిక సంబంధమైన వాటికి అనుబంధం లేకుండుట) (లూకా 14:26-33). కాబట్టి ఇది నా సందేశములో ముఖ్యమైన ఉద్ఘాటన (అవధారణ) అయినది.

పరిశుద్ధాత్మలో బాప్తిస్మము

పరిశుద్ధాత్మలో బాప్తిస్మమును బోధించిన ప్రతి గుంపు దాని మొదటి ఆధారము "బాషలలో మాట్లాడుట" అని బోధించెను. కాని దీనిని బోధించిన వారిలో ఎక్కువమంది ప్రకృతి సంబంధులును, డబ్బును ప్రేమించువారని నేను చూచాను. వేరొక విపరీతమైన అబిప్రాయాన్ని (ధోరణి) కలిగిన కొందరు విశ్వాసులు, బాషలలో మాట్లాడుట అంతా అపవాదియొద్దనుండే అని ఒప్పించబడినారు!! కాని యేసు పరిశుద్ధాత్మ బాప్తిస్మము యొక్క ఆధారము శక్తియని బోధించెను- ఈ శక్తి ఆయన సాక్షముగా ఉండుటకే గాని (ఇది మనము జీవించు విధానము సూచిస్తున్నది) కేవలము ఆయన గూర్చి సాక్షమిచ్చుటకు (మనము మాట్లాడిన దానినిబట్టి) కాదు (అపొ.కా.1:8). కాబట్టి నేను దానిని ప్రకటించాను. బాషలలో మాట్లాడుట ఆత్మ కొందరికిచ్చు కృపావరములలో కేవలము ఒక్కటి మాత్రమే. ఈ విషయముపై నా దృక్పధము వలన "పెంతెకొస్తు"వారు నన్ను "బ్రదరన్‌" అని గుర్తించారు (నామకరణము చేసారు) మరియు "బ్రదరన్‌" వారు నన్ను "పెంతెకోస్తు" వానిగా గుర్తించారు (నామకరణము చేసారు)!! ఈ రెండు విపరీత ధోరణులనుండి సమాన దూరముగా నుండుటకు నేను సంతోషిస్తున్నాను.

(రెండవభాగం వచ్చేవారం)