WFTW Body: 

(గత వారం కొనసాగింపు...)

కనికరము మరియు కృప

చాలా ఏళ్ళు విశ్వాసిగా కనికరము మరియు కృప ఒక్కటే అని అనుకొనేవాడిని. కాని ఒకరోజున 'కనికరము' పాపక్షమాపణకు సంబంధించినదని, 'కృప' దేవుడు మనకు పాపముపైన జీవితములో శోధనలపైన జయించుటకు ఇచ్చిన శక్తి అని నేను కనుగొన్నాను (హెబ్రీ 4:16; రోమా 6:14; 2కొరింథీ 12:9). ఈ 'కృప' యేసుక్రీస్తు ద్వారా వచ్చెను (యోహాను 1:17), మరియు పరిశుద్ధాత్మ పెంతెకొస్తు దినమున మానవునిలో నివసించుటకు వచ్చిన తరువాతే లభ్యమాయెను. ఇదికూడా నా సందేశములో ఒక ముఖ్యభాగమాయెను.

క్రీస్తుయొక్క మానవత్వము

క్రైస్తవులందరు క్రీస్తుని దేవుడిగా ఆరాధిస్తారు కాని చాలా కొద్దిమంది మాత్రమే ఆయనను ఒక మనిషిగా మనము వెంబడించుటకు ఒక మాదిరి అని నొక్కి చెప్పుదురు (ఉద్ఘాటించుదురు). ఆయన మానవత్వాన్ని నొక్కి చెప్పే కొందరు భూమిపై ఆయన ఉన్నప్పుడు ఆయన దేవుడని నిరాకరింతురు. క్రీస్తు పూర్తిగా దేవుడు, పూర్తిగా మానవుడన్న సమతుల్యమైన లేఖనముల అవలోకమును ప్రకటించే క్రైస్తవులను కనుగొనుట అరుదు. కాని నేను "దైవభక్తి గూర్చిన మర్మము"ను క్రీస్తు పాపమును ఒక మానవునిగా జయించుటలో చూచాను (1 తిమోతి 3:16; హెబ్రీ 4:15,16). నా బోధలో ఇదికూడా ఒక ముఖ్యమైన ఉద్ఘాటన అయినది.

ధనము

1975 లో మేము మా పరిచర్యను ప్రారంభించినప్పుడు మనము ఈ రోజున ఎక్కువగా వినే సంపన్నత సువార్త (లోకాశీర్వాదములకు సంబంధించిన సువార్త) ప్రాచుర్యములో లేదు. కాని క్రైస్తవులు అప్పట్లో కూడా ఈ రోజున ప్రేమించినట్లే డబ్బును ప్రేమించేవారు. యేసు, డబ్బును ప్రేమించిన వారు దేవుణ్ణి ద్వేషించుదురని బోధించెను (లూకా 16:13). కాని ఈ సందేశమును ఒక్క బోధకుడు కూడా బోధించుట నేను వినలేదు. ఎక్కువ సంఘాలు వారి సభ్యులకు వారి దశమభాగమును చెల్లించమని మాత్రమే బోధించెను. కాని దశమ భాగము ఇచ్చుట పాతనిబంధన ధర్మశాస్త్రమునకు సంబంధించినది, ఇది క్రీస్తులో నిర్మూలించబడెను. ప్రభువునకు సంతోషముగా, రహస్యముగా, స్వచ్ఛందముగా ఇచ్చుట అనే విడుదలనిచ్చే నూతననిబంధన సందేశమును నేను బోధించితిని. నేను చూచిన ఇంకొక విషయము భారతదేశములో నాకు తెలిసిన ఏ సంఘముకూడా వివాహములలో వరకట్నము అడుగుట అనే చెడ్డ ఆచారమునకు వ్యతిరేకముగా బలంగా బోధించలేదు. ఈ ఆచారము భారతదేశమంతటా స్త్రీలను కించపరుస్తుంది. ఈ చెడ్డ ఆచారమునకు వ్యతిరేకముగా నేను బలంగా బోధించాను; వివాహములు నిర్వహించేటప్పుడు పెళ్ళి కుమారుడు మరియు పెళ్ళికుమార్తె యొద్దనుండి, వారి మధ్యకాని లేక వారి తల్లిదండ్రుల మధ్యకాని డబ్బు చేతులు మార్పిడి జరగలేదని (మారలేదని) సంతకం చేసిన దృవీకరణపత్రాలు తీసుకొన్నాను.

ప్రాణము మరియు ఆత్మ

ఇది బోధింపబడని మరొక అంశము. పాతనిబంధన కాలములో, మానవునియొక్క ప్రాణమునకు ఆత్మకును ఉన్న వ్యత్యాసముపై స్పష్టమైన ప్రత్యక్షత లేకుండెను. కాని క్రొత్తనిబంధన ఈ రెండింటిమధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపిస్తుంది (హెబ్రీ 4:12). ఎక్కువ మంది క్రైస్తవులకు ఈ వ్యత్యాసము స్పష్టముగా తెలియదు గనుక, వారు తెలివైన బోధకులయొక్క మానసిక సంబంధమైన వంచనలతోను, కృపావరాలయొక్క భావోద్వేగ నకిలీలతోను మోసగింపబడుచుండిరి. కాబట్టి నేను జనులకు నిజమైన ఆత్మీయతకు, కేవలము ప్రకృతి సంబంధమైన ప్రాణముకు వ్యత్యాసమును బోధించాను.

క్రీస్తు యొక్క స్థానిక శరీరము

దేవుని యొక్క చివరి లక్ష్యము తన పిల్లలందరినీ క్రీస్తులో ఒక్క శరీరముగా చేయుటయని నేను స్పష్టముగా చూచాను. నూతననిబంధన సంఘము ఒక సమాజముగా కాకుండా ఒక శరీరముగా ఉండవలెను. ఒక శరీరములో (మానవ శరీరములో ఉన్నట్లు) ప్రతి అవయవము ఇతర అవయవములకు జోడించబడియుండును మరియు ప్రతిదానికి ఒక ప్రత్యేక విధియుండును. క్రీస్తుమాత్రమే శిరస్సైయుండును, ఇతరులందరు సమానమైన అవయవములుగా ఉందురు. భూమిపైన ప్రతి స్థలములో దేవుడు ఈ రకమైన సంఘమును చూడాలని కోరుచున్నాడని నేను చూచాను. కాబట్టి భూమిపైన ఎక్కడ వీలైతే అక్కడ ఇటువంటి క్రీస్తు శరీరముయొక్క వ్యక్తీకరణలను కట్టుచూ నా జీవితమును గడపాలని నిర్ణయించుకొన్నాను.

నూతన నిబంధన

ఈ సత్యములన్నియు క్రీస్తు మరణము మరియు పునరుత్థానము ద్వారా దేవుడు మానవునితో చేసిన నూతన నిబంధనకు సంబంధించినవి. విశ్వాసుల మధ్య అతి గొప్ప అవసరత, పాతనిబంధనతో పోల్చిచూచినప్పుడు నూతన నిబంధన యొక్క మహిమ ఎంత గొప్పదో చూచుటకు వారి నేత్రములు తెరువబడుటయేనని నేను చూచాను. కాబట్టి ఇది నా బోధించు పరిచర్య అంతటిలో ఒక ప్రాముఖ్య అంశంగా మారింది మరియు ఆ విధంగా కొనసాగుతుంది. ఇవి దేవుడు నాకు చూపించిన ప్రాముఖ్యమైన సత్యాలలో కొన్ని. వీటిని నేను సాధ్యమైన ప్రతివిధానములో బోధించట ద్వారా, పుస్తకాలద్వారా, టేపులద్వారా నా తోటి విశ్వాసులకు ప్రకటించుటకు ప్రయత్నించాను. ఈ సత్యములను భారతదేశమంతట వ్యాపింపజేయవలెనని నాకు భారముండెను. కాని దేవుడు ఈ సందేశములను ఇంకా దూరము అనేక ఇతర దేశ ప్రజలకు కూడా వ్యాపింపజేయుట మంచిదని చూచెను.

మహిమంతయు ఆయన నామమునకే చెల్లును గాక!!