WFTW Body: 

ప్రవచించే పరిచర్య గురించి మీకు కొంచెం చూపించాలని కోరుతున్నాను. ప్రవచించుటకు ఏలీషా దేవునియొక్క మనస్సుని కోరినప్పుడు, అతడు ఒకనిని వీణ వాయించమని కోరాడు (2రాజులు 3:15). అతడు వీణ వాయించుచుండగా, దేవుని హస్తము ఏలీషా మీదకు వచ్చియున్నందున అతడు శక్తివంతముగా ప్రవచించాడు. అక్కడ మనము దైవికమైన సంగీతం యొక్క విలువను చూస్తాము.

నా జీవితంలో అనేకసార్లు ఆదివారం కూటములో పాటలు పాడి ఆరాధించే సమయంలో దేవుని హస్తం నా మీదకు వచ్చి నేను ఇంతకుముందు సిద్ధపడని వాక్యమును పొందియున్నాను. అభిషేకంగల సంగీతం ద్వారా ఏలీషా మీదకు ప్రవచించు ఆత్మ బహుబలముగా వచ్చియున్నది.

ఒక ప్రవక్తకు కూడా కొన్నిసార్లు సంగీతకారుల అవసరముంటుంది. అందువలన వాయిద్యాలు వాయించేవారికి కూడా అభిషేకం అవసరం. దావీదు పాటలు పాడే వారిని వాయిద్యాలు వాయించేవారిని నియమించాడు మరియు వారు అభిషేకం కలిగియున్నారు. ఆసాపు వంటి సంగీతకారులు కొన్ని అద్భుతమైన కీర్తనలు వ్రాశారు(కీర్తనలు 50,73-83). హేమాను (1 దిన. వృ. 25:5) మరియు యెదూతూను (2 దిన. వృ. 35:15) అను సంగీతకారులుకూడా దీర్ఘదర్శులు (ప్రవక్తలు)గా పిలువబడ్డారు.

కాబట్టి అభిషేకించబడిన ప్రవక్తలను ప్రోత్సహించి మరియు బలపరచుటకు అభిషేకము కలిగిన సంగీతకారులు దేవునికి అవసరం. ఆ విధముగా సంఘము నిర్మించబడుతుంది. మీలోని కొందరు ప్రవక్తలుగా పిలువబడక, సంగీతకారులుగా ఉండుటకు పిలువబడవచ్చు. అభిషేకము గల సంగీతకారులుగా ఉండాలి. ఆ దినమున వీణను లోకరీతిగా వాయించియున్నట్లయితే ఏలీషా ప్రేరేపించబడెవాడు కాదు. ఆ సంగీతం కొంత పరలోకసంబంధమైనవిగా ఉంది.

పరలోక సంబంధమైన మరియు లోకసంబంధమైన సంగీతం కలదు. పరలోకసంబంధమైన సంగీతం వినినప్పుడు, దేవుని ఆరాధించుటకు నీ ఆత్మలో ప్రేరేపించబడుట ద్వారా అది పరలోక సంగీతమని తెలుసుకుంటావు. కొంత సంగీతం సంగీతకారులను ఘనపరిచేటట్లు చేస్తుంది. నీ సంగీతం ద్వారా ప్రజలను దేవునిని ఆరాధించుటకు నడిపించి మరియు ప్రవచించు ఆత్మను కూటములలోనికి తెచ్చినయెడల నీవు అభిషేకము గలవాడవు.

2 దిన. వృ. 20వ అధ్యాయములో, దేవుని స్తుతించుటలో ఉన్నటువంటి గొప్ప అద్భుతమైన శక్తిని చూపించే అద్భుతమైన కథ ఉన్నది. అక్కడ మనం అనేక పాఠములు నేర్చుకొనవచ్చును. రాజైన యెహోషాపాతు మీదకు అనేకమంది శత్రువులు యుద్ధానికి వచ్చారు. అహబురాజుతో సర్దుబాటుచేసుకొని ఒకపాఠం నేర్చుకొని యెహోషాపాతు, ఇప్పుడు దేవునిని ప్రార్ధించుటకు నిర్ణయించుకున్నాడు. తన తండ్రియైన ఆసా ప్రార్ధించిన రీతిగా (2 దిన.వృ. 15:11). ప్రభువునందు విశ్వాసముంచి ఒక అద్భుతమైన ప్రార్ధన చేశాడు. అక్కడ 7 విషయములు దేవునికి యెహోషాపాతు గుర్తు చేసి మరియు తాను కూడా గుర్తించి ఒప్పుకొనిన ప్రార్ధన.

1. సర్వాధికారము మరియు పరాక్రమము కలిగిన దేవుడు (6వ వచనము).

2. గతములో ఇశ్రాయేలు ఎడల చేసిన కార్యములు (7వ వచనము).

3. దేవుని యొక్క వాగ్ధానములు (8-9 వచనములు).

4. దేవుని స్వాస్థ్యమైయున్న ఇశ్రాయేలీయులు (11వ వచనము).

5. వారియొక్క అత్యంత బలహీనత (12వ వచనము).

6. వారియొక్క అజ్ఞానం (12వ వచనము).

7. వారు దేవుని మీద పూర్తిగాను, బొత్తిగాను ఆధారపడుట (12వ వచనము).

దేవుడు వారి ప్రార్ధన విని వెంటనే ఒక ప్రవక్తను పంపించి అతని ద్వారా ఒక వర్తమానం పంపించాడు. "మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. దేవుడు మీతో ఉన్నాడు కనుక మీరు వారి మీదకు పోవుడి"(15-17వ వచనములు).

కాబట్టి యెహోషాపాతు సైనికులకు ముందుగా పాటలుపాడే వారిని నియమించాడు మరియు పాటలు పాడి వారు దేవునిని స్తుతించుచుండగా, దేవుడు యూదా శత్రువులందరిని ఓడించాడు. శత్రువుల యొద్దనుండి వారు పొందినటువంటి వస్తువులతో యూదా వారు ధనవంతులయ్యారు. ఈ యొక్క కథలో జయించుటకు మార్గము చెప్పబడింది. శత్రువులు (సమస్యలు) ఉన్నప్పటికిని, దేవుని యొక్క సర్వశక్తిని ఆయన వాగ్ధానములను విశ్వసించి, నోటితో ఒప్పుకొని మరియు ముందుగానే ప్రభువును స్తుతించుట ద్వారా జయించగలము. స్తుతించుట ద్వారా మన విశ్వాసము వ్యక్తపరచబడుతుంది. "వారు ఆయన మాటలు నమ్మి మరియు ఆయన కీర్తి గానము చేసిరి" (కీర్తనలు 106:12). మరొకటి కూడా వాస్తవమైయున్నది. మనము దేవునిని పాడి స్తుతించనప్పుడు, అది మనం ఆయన మాటలు నమ్ముట లేదని రుజువు చేస్తుంది.