WFTW Body: 

అపొస్తలుల కార్యములు 2:3లో క్రొత్త నిబంధనలో మన శరీరమంతటిలో నాలుక చాలా ప్రాముఖ్యమైనదిగా దేవునిచేత వాడబడుతుందని చూడగలము. అక్కడ ఉన్నవారందరి మీదికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు "అగ్మి జ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా కనబడెను" మరియు మన నాలుక ఎల్లప్పుడు పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉండాలి. ఇది అన్యబాషలనే వరమునకు కూడా కొంత సూచనగా ఉంది. ఇతరులను ఆశీర్వదించుటకు నీవు బోధకుడవైనా, ఇతరులతో ప్రతి రోజు మాట్లాడేటప్పుడు దేవుడు మన నాలుకలను ఉపయోగించాలని కోరుచున్నాడు. కాని రోజుకు 24 గంటలు మరియు వారానికి 7రోజులు మీ మాటలు పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉండాలి.

మనం మాట్లాడేవిధానంలో వచ్చిన మార్పు, మనం పరిశుద్ధాత్మతో నింపబడియున్నామనుటకు ఒక గుర్తైయున్నది. మన నాలుక "అగ్నిజ్వాలలవంటి నాలుకగా" అవుతుంది(అ.కా. 2:3). అనగా అన్యభాషలలో మాట్లాడుట కాదు కాని దేవుని ప్రేమ మరియు పవిత్రత అనే దేవునిఅగ్నితో మన స్వంతభాషలో మాట్లాడెదము. మన భాష పరలోకపు భాష అవుతుంది.

ఈ వచనాలలో మన మాటలను గూర్చి నొక్కి చెప్పడం గమనించండి. "అయితే ఆత్మపూర్ణులైయుండుడి. ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి" (ఎఫెసి 5:18-20). మనము పరిశుద్ధాత్మతో నింపబడియున్నప్పుడు మనలో ఉన్న కొండెములు చెప్పుట, ద్వేషించుట మరియు కోపముతో మాట్లాడుట అనే ఆత్మకు బదులుగా కృతజ్ఞతగల ఆత్మతో నింపబడతాము.

ఎఫెసి 5:18 ప్రకారము "ఆత్మతో నింపబడుతూ ఉండుడి" అనగా ఆత్మతో ఎల్ల్పప్పుడు నింపబడుతూ ఉండాలి మరియు ఒక్కసారి నింపబడుట కాదు. మనము ప్రతిరోజు ఎల్లప్పుడు ఉదయం మరియు సాయంత్రము పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉండాలి. ఎల్లప్పుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపమని నీవు దేవునిని అడుగుము. "పరిశుద్ధాత్మ పూర్ణులైన పురుషులు మరియు స్త్రీలు" అని అపొస్తలులకార్యములలో ఇట్టివారిని గూర్చిచెప్పబడింది.

ఎఫెసి 5:18 తరువాత ఉన్న వచనములన్నిటిలో(5:19 - 6:24) పరిశుద్ధాత్మలో నింపబడిన వారి లక్షణముల గూర్చి వ్రాయబడింది. ఇది కృతజ్ఞత కలిగియుండుట, సంఘములో ఎల్లప్పుడు ఒకరికొకరు లోబడియుండుట మరియు కుటుంబసంబంధాల గురించి చెప్పుచున్నది (ఎఫెసి 5:21-6:9). మరియు తరువాత సాతాను శక్తులతో పోరాడి జయించుటగురించి చెప్పబడింది(ఎఫెసి 6:11).

కాబట్టి ఈ భూమి మీద క్రైస్తవులుగా జీవించుటకు మరియు పోరాడుటకు ఉన్న రహస్యము ఏమనగా ఎల్లప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడుట.

* మనము పరిశుద్ధాత్మతో నింపబడనియెడల దేవుని సరియైన రీతిగా స్తుతించలేము.

* మనము పరిశుద్ధాత్మతో నింపబడనియెడల దైవికమైన భర్తలుగాను భార్యలుగాను జీవించలేము.

* మనము పరిశుద్ధాత్మతో నింపబడనియెడల మన పిల్లలను సరియైన రీతిగా పెంచలేము.

* మనము పరిశుద్ధాత్మతో నింపబడనియెడల సాతాను శక్తులను ఓడించలేము.

మన క్రైస్తవ జీవితంలో సమస్తమును పరిశుద్ధాత్మతో నింపబడుట మీద ఆధారపడియుంది.