వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట అన్వేషకుడు
WFTW Body: 

దేవునిచేత విరగగొట్టబడు విషయంలో యాకోబు జీవితం ఒక మంచి ఉదాహరణగా ఉంది. అతడు దేవునితో రెండుసార్లు కలిశాడు. మొదటిసారి బేతేలు దగ్గర (ఆదికాండము 28) మరియు రెండవసారి పెనూయేలు దగ్గర (ఆదికాండము 32). బేతేలు అనగా "దేవుని గృహము" (అది సంఘానికి సూచనగా ఉంది) మరియు పెనూయేలు అనగా "దేవుని యొక్క ముఖము". మనమందరము దేవుని సంఘమునే కాక దేవుని ముఖమును చూడాలి. బేతేలు దగ్గర "సూర్యుడు అస్తమించాడని" చెప్పబడింది(ఆదికాండము 28:11). అనగా యాకోబు, తరువాత 20సంవత్సరాలు గాడాంధకారములో నడచుటను ఇది సూచిస్తుంది. తరువాత పెనూయేలు దగ్గర "సూర్యుడు ఉదయించెను"(ఆదికాండము 32:31) -అనగా చివరకు యాకోబు దేవుని వెలుగులోనికి వచ్చాడు అని అర్ధం. గత శతాబ్దములలో అనేకమంది విశ్వాసులు దేవునితో నడిచి, రెండుసార్లు దేవునిని కలిశారు. మొదటిగా క్రొత్తగా జన్మించి, దేవుని గృహమైన సంఘములో ప్రవేశించినప్పుడు, రెండవది వారు దేవునిని ముఖాముఖిగా కలుసుకొని పరిశుద్ధాత్మతో నింపబడి మరియు వారి జీవితములు రూపాంతరము పొందినప్పుడు.

బేతేలు యొద్ద యాకోబు కలలో ఒక నిచ్చెన భూమిమీద నుండి పరలోకము వెళ్ళుట చూచాడు. యోహాను 1:51లో భూమిమీద నుండి పరలోకానికి మార్గమైన ఆ నిచ్చెన తానేనని ప్రభువైనయేసు చెప్పారు. కాబట్టి ప్రభువైనయేసు పరలోకానికి మార్గాన్ని ఏర్పాటు చేయుటను యాకోబు ప్రవచనాత్మకంగా చూచాడు. ఆ కలలో యాకోబుకు దేవుడు అనేక విషయములను వాగ్ధానము చేశాడు. అయితే యాకోబు భూసంబంధమైన మనస్సు కలిగియుండి భూమిమీద భద్రత గురించి, శరీరము యొక్క ఆరోగ్యము గురించి, ఆర్ధిక అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచించాడు. కాబట్టి దేవునితో ఈ విధముగా అన్నాడు "ప్రభువా, ఈ ప్రయాణమంతటిలో నీవు నన్ను కాపాడి, అన్నవస్త్రములు అనుగ్రహించి మరియు క్షేమముగా ఇంటికి తీసుకొని వచ్చినయెడల నా సంపాదనలో దశమభాగం నీకు ఇస్తాను".

"దేవుని ఆశీర్వాదం" యొక్క గుర్తు ఏమిటి? సిరి సంపదలా? కాదు. క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడుటయే దేవుని ఆశీర్వాదం. నీవు మంచి ఉద్యోగం, మంచి గృహము, అనేక సదుపాయములు కలిగియుండి, నీ జీవితము దేవునికిగాని మానవునికిగాని ఉపయోగం లేనిదిగా ఉన్నట్లయితే, ఉపయోగమేమిటి? కాని దేవుడింకనూ యాకోబును వ్యవహరించుట పూర్తి కాలేదు. పెనూయేలు దగ్గర ఆయన అతనిని రెండవసారి కలిశాడు. మీలో అనేకులకు దేవునితో రెండవసారి కలుసుట అవసరమైయున్నది. అనగా నీ జీవితములో నీవు అట్టడుగునకు వెళ్ళినప్పుడు దేవుడు నీకు తీర్పు తీర్చి మరియు నరకానికి పంపించక నిన్ను పరిశుద్ధాత్మలో నింపును.

పెనూయేలు దగ్గర యాకోబు ఒంటరిగా ఉన్నాడు (ఆదికాండము 32:24). దేవుడు మనలను కలవకముందు మనం ఒంటరివారమైయుండవలెను. దేవుడు అనేక గంటలు రాత్రి యాకోబుతో పోరాడినప్పటికి యాకోబు లోబడలేదు. గత 20 సంవత్సరములుగా యాకోబు జీవితములో జరుగుచున్న దానికి ఈ పోరాటం సూచనగా ఉంది. మరియు దేవుడు యాకోబు యొక్క మొండితనాన్ని చూచి చివరికి అతని తొడగూడు వడిసేటట్లు చేశాడు. యాకోబు అప్పటికి దాదాపుగా 40సంవత్సరములు కలిగియుండి చాలా బలమైన వ్యక్తిగా ఉన్నాడు. తన తాతయైన అబ్రాహాము 175 సంవత్సరాలు జీవించాడు. కాబట్టి యాకోబు యౌవ్వనస్తుడైయుండి 75% జీవితము ఇంకను కలిగియున్నాడు. ఆ వయసులో అతని తొడగూడు వడసుట అతడు కొంచెం కూడా కోరుకోలేదు. ఎందుకనగా అది అతని భవిష్యత్తు యొక్క ప్రణాళికలన్నిటిని వమ్ము చేస్తుంది. ఈనాటి మాటలలో దాని అర్థం చేసుకోవాలంటే ఒక 20సంవత్సరముల యౌవ్వనస్తుని యొక్క తొడగూడు మీద కొట్టినయెడల, అతడు చంకకఱ్ఱ పెట్టుకొని తన జీవితమంతా తిరిగవలసియుండును. అది ఒక విరగగొట్టబడిన అనుభవము. యాకోబు తన జీవితకాలమంతయు ఆ కఱ్ఱ పట్టుకొని నడువగలిగాడు. యాకోబు విరగగొట్టుటకు దేవుడు అనేకవిధములుగా ప్రయత్నించాడు. చివరకి అతనిని కుంటివానిగా చేయుటద్వారా దేవుడు అతనిని విరగగొట్టగలిగాడు. మనకు అవసరమైనయెడల దేవుడు మనకు కూడా అలాగే చేస్తాడు. దేవుడు, ఆయన ప్రేమించినవారిని పెద్ద ప్రమాదము నుండి రక్షించుటకు వారిని శిక్షిస్తాడు. దేవుడు యాకోబు తొడగూటి మీద కొట్టినయెడల ఆయన అతనితో "నా పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు నన్ను వెళ్ళనిమ్ము, నీవు ఎన్నడైనను నన్ను కోరలేదు మరియు నీవు స్త్రీలను మరియు డబ్బుని కోరియున్నావు". కాని అప్పుడు యాకోబు దేవునిని వెళ్ళనివ్వలేదు. ఆఖరికి అతడు మార్పు చెందాడు. తన జీవితమంతటిని స్త్రీలను, ఆస్తులు పొందుటకు జీవించిన వ్యక్తి. ఇప్పుడు దేవునిని పట్టుకొని ఇట్లనుచున్నాడు "నీవు నన్ను ఆశీర్వాదించితేనే కాని నిన్ను విడువను". అతని తొడగూడు వడిసినప్పుడు అతనిలో ఎంతో గొప్పకార్యము జరిగింది. ఎంత గొప్పకార్యము జరిగిందంటే, అతడు ఇప్పుడు దేవునిని మాత్రమే కోరుకొనుచున్నాడు.

గతములో చెప్పబడినట్లుగా, "దేవుడు తప్ప మరేదియు నీకు లేనప్పుడు, దేవుడు నీకు సరిపోయినవాడని కనుగొందువు". ఇది సత్యం. ఇప్పుడు దేవుడు నీ పేరేమిటి? అని అతని అడిగాడు. "నా పేరు యాకోబు" అని అతడు జవాబిచ్చాడు. "యాకోబు" అనగా మోసగాడు. చివరకు యాకోబు తాను మోసగాడినని అంగీకరించాడు. నీవు కూడా ఒక మోసగాడివైయుండవచ్చును? నీవు ఆత్మీయుడవని ఇతరులకు కనపరచుకొంటున్నావా? అట్లయితే నీవు దేవుని యొదుట యదార్ధముగా ఒక వేషధారివని చెపుతావా? చాలా సంవత్సరాల క్రితం గ్రుడ్డివాడైన తన తండ్రి ఇస్సాకు అతని పేరు అడిగినప్పుడు, తన పేరు ఏశావు అని చెప్పాడు. కాని ఇప్పుడు యదార్ధముగా ఉన్నాడు. అప్పుడు వెంటనే ప్రభువు అతనిలో "ఇకమీదట నీవు మోసగాడిగా(యాకోబు) ఉండవు"(ఆదికాండము 32:28). అది ప్రొత్సహించే మాట కాదా? నీవు దానిని వినియున్నావా? "నీవు ఇకమీదట మోసగాడిగా ఉండవు". హల్లెలూయా. అప్పుడు దేవుడు యాకోబుతో "ఇప్పటి నుండి నీ పేరు ఇశ్రాయేలు(దేవుని కుమారుడు)", ఎందుకనగా నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచావు. మోసగాడిగా ఉండి దేవుని కుమారునిగా ఎంత గొప్ప మార్పు చెందాడు. యాకోబు విరగగొట్టబడినప్పుడు మాత్రమే ఇది జరిగింది. మన పిలుపు కూడా అదే. మనము రాజ కుమారులవలె క్రీస్తుతో కూడా సింహాసనము మీద కూర్చుండి, సాతాను మీద ఆత్మీయ అధికారము కలిగియుండి సాతాను యొక్క బంధకముల నుండి స్త్రీ పురుషులను విడిపిస్తాము. మనము క్రీస్తు యొక్క శరీరములో అవయవములైయుండి, దేవునితోను మరియు మనుష్యులతోను శక్తిగలిగి మరియు పోరాడుతాము. మనుష్యులందరికి ఆశీర్వాదముగా ఉండుటకు మనము పిలువబడియున్నాము. మనము విరగగొట్టబడినప్పుడు మాత్రమే అది సాధ్యమౌతుంది. మనయొక్క వేషధారణ మరియు మోసమును గూర్చి దేవునియెదుట యదార్ధముగా ఉన్నప్పుడు మాత్రమే విరగగొట్టబడగలము.