WFTW Body: 

యెషయా 50:4(NLT) లో యేసు గూర్చి "ప్రతి ఉదయమున తండ్రి నన్ను మేల్కొలిపి తన చిత్తానికి నా అవగాహనను సిద్ధపరుస్తున్నాడు" అని ప్రవచనానుసారమైన మాటను మనము చదువుతాము. అది యేసు యొక్క అలవాటు. యేసు ఉదయము మొదలుకొని రోజంతయు తన తండ్రి స్వరమును వింటూ ఖచ్చితముగా అదే విధముగా చేసేవాడు. ఆయన ఏమి చెయ్యాలని మనుష్యులతో చర్చించుట కాక తన తండ్రితో ప్రార్థన కూటములు కలిగియుండేవారు. మానసిక సంబంధమైన క్రైస్తవులు మనుష్యులతో చర్చించుట ద్వారా ప్రణాళికలు వేయుదురు. ఆత్మీయమైన క్రైస్తవులు దేవుని నుండి వినుటకు వేచి యుందురు.

ప్రార్థనకు ఆయన జీవితములో ఎంతో విలువ నిచ్చెను. ఆయన తరచు తప్పించుకొని ప్రార్థించుటకు అరణ్యములోనికి పోవుచుచండెను (లూకా 5:16). ఒకసారి ఆయన పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసికొనుట కొరకు తండ్రి చిత్తమును తెలిసి కొనుటకు రాత్రంతా ప్రార్థించెను (లూకా 6:12,13). ఒక మానసిక సంబంధియైన క్రైస్తవుడు ప్రార్థనలో దేవునిపై వేచియుండుట సమయమును వ్యర్థపుచ్చుట అనుకొని కేవలము తన మనస్సాక్షిని సంతృప్తి పర్చుకొనుటకు మాత్రమే ప్రార్థించును. అతడిపై అతడికి నమ్మకముండుట చేత ప్రార్థన అతడి జీవితములో తప్పని అవసరతగా యుండదు. అయితే ఆత్మీయమైన క్రైస్తవుడు ప్రతి దానికీ నిరంతరం దేవునిపై ఆధారపడి, నిజమైన అవసరతచేత ప్రార్థనవైపునకు వెళ్లును.

యేసు తన తండ్రి మూలమున జీవించెను (యోహాను 6:57). ఆయనకు దేవుని వాక్యము ఆహారము కంటే ఎంతో ప్రాముఖ్యమైనది (మత్తయి 4:4). ఆయన దానిని దినములో ఎన్నోమార్లు తండ్రి యొద్ద నుండి నేరుగా పొందవలసి ఉండెను. ఆయన దానిని పొందుకొని, దానికి విధేయత చూపెను. విధేయత కూడా ఆయనకు తన అనుదినాహారము కంటే ఎంతో ప్రాముఖ్యమైనదిగా యుండెను (యోహాను 4:34). యేసు తన తండ్రిపై ఆధారపడి జీవించెను. రోజంతటిలో ఆయన వైఖరి "చెప్పండి తండ్రీ, నేను వినుచుచున్నాను" అనునదిగా ఉండెను.

రూకలు మార్చు వారిని దేవాలయమునుండి వెళ్ళగొట్టిన సందర్భమును ఆలోచించండి. రూకలు మార్చు వారు దేవాలయములో ఉన్నప్పుడు యేసు అనేకమార్లు వారితో పాటు దేవాలయములో ఉండిననూ ఆయన వారిని వెళ్ళగొట్టలేదు. ఆయన తన తండ్రి చేత అలా చేయుమని నడిపింపబడినప్పుడే అట్లు చేసెను. ఒక మానసిక సంబంధియైన క్రైస్తవుడు రూకలు మార్చువారిని ప్రతిసారి వెళ్లగొడుతూ ఉండవచ్చును లేక ఎప్పుడూ అటువంటి పని చేయకుండానైనా ఉండును. అయితే దేవుని చేత నడిపింపబడు వానికి ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేయవలెనో తెలియును.

కొన్ని పనులు తన విషయంలో తండ్రి చిత్తమునకు బయట ఉండుటచేత యేసు అనేక మంచి పనులు చేయగలిగియుండినా, ఆయనెప్పుడూ వాటిని చేయలేదు. ఆయనెప్పుడూ అతిశ్రేష్టమైన పనులు చేయటంలో తీరిక లేకుండా ఉండేవారు. అవి ఆయనకు సరిపోయేవి. ఆయన ఈ లోకమునకు వచ్చినది మంచి పనులు చేయుటకు కాక, తన తండ్రి చిత్తము చేయుటకు వచ్చియుండెను.

"నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా?" అని పన్నెండు సంవత్సరాలప్పుడు యేసు, యోసేపు మరియలతో అన్నారు (లూకా 2:49). కేవలం ఆ పనులు మాత్రము నెరవేర్చుటకు ఆయన ఆసక్తి కలిగియున్నారు. ఆయన ఈ భూమిపై 33 1/2 సంవత్సరాల చివరకు వచ్చునప్పటికి, "తండ్రీ, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చితిని" (యోహాను 17:4) అని నిజమైన సంతృప్తితో చెప్పగలిగెను.

ఆయన ప్రపంచమంతా చుట్టి రాలేదు, ఆయన ఏ పుస్తకాన్ని వ్రాయలేదు, ఆయనను వెంబడించిన వారు కొద్దిమంది మాత్రమే, ఇంకా లోకములో అనేక భాగములలో తీరని అవసరములెన్నో ఉన్నవి. ఇలా ఎన్నో చెప్పుకొనవచ్చును. కాని తన తండ్రి తనకు ఏర్పాటు చేసిన పనిని ఆయన పూర్తి చేసారు. అది మాత్రమే చివరకు ముఖ్యమైనది.

యేసు, ప్రభువైన యెహోవాకు సేవకుడు. మరియు "సేవకునికి ముఖ్యమైనది తన యజమాని చెప్పినది చేయుటైయున్నది" (1కొరింథీ 4:2 లివింగ్‌ బైబిలు). ఆయన జీవితమంతా తన తండ్రి చెప్పినది వినుచుండుట చేత తన తండ్రి చిత్తమును అలసిపోకుండా, తీరికలేని తనముతో చిరాకు పడకుండా నెరవేర్చెను. ఆయన యొక్క మానవపరమైన ఆసక్తిలన్నిటిని మరణింప చేసెను. ఆయన మానసిక సంబంధమైన వ్యక్తి కాదు. ఆయన ఆత్మీయమైన వ్యక్తి.