వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   స్త్రీలు గృహము
WFTW Body: 

రూతుయొక్క వివాహము చాలా ఆసక్తికరమైన విషయము. ఇశ్రాయేలులో కరువు వచ్చినప్పుడు ఎలీమెలెకు మరియు అతని భార్య నయోమి మరియు వారి ఇద్దరి కుమారులతో కలిసి మోయాబు దేశానికి వెళ్ళారు. ఆ ఇద్దరు కుమారులు పెరిగి పెద్దవారై మరియు దేవుని ధర్మశాస్రాన్ని పాటించకుండా మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకున్నారు. తరువాత ఎలీమెలెకు మరియు ఇద్దరు కుమారులు మరణించారు. అప్పుడు నయోమి ఒక స్త్రీఅయ్యిండి తన ఇద్దరు కోడల్లయిన రూతు మరియు ఓర్పాలను వారి స్వదేశానికి వెళ్ళి వేరే వారిని పెండ్లి చేసుకోమని చెప్పింది (రూతు 1:8). ఈ మాటను విని రూతు మరియు ఓర్పా పెద్దగా ఏడ్చారు (రూతు 1:14). ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొని మరియు "అమ్మా, నేను నా స్వదేశానికి వెళ్ళి వేరొక భర్తను కనుగొంటాను, నా జీవితాన్ని గురించి నేను జాగ్రత్తపడతాను". "కాని రూతు నయోమిని అంటిపెట్టుకొని, నయోమి నుండి నిజమైన దేవుని తెలుసుకొని మరియు తాను భర్తను పొందుటకంటే దేవున్ని ఆరాధించి సేవించాలని కోరింది. కాని ఓర్పా భర్త కావాలని కోరుకున్నది. ఈ మార్గములో పోవుచుండగా ఓర్పా తప్పు మార్గమును ఎన్నుకున్నది. కాని రూతు సరియైన మార్గములో వెళ్ళి తన నిత్యత్వాన్ని మార్చుకున్నది. ఓర్పా గురించి మరల మనము వినము. ఆమె ఇప్పుడు ఎక్కడున్నప్పటికి, తాను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి బాధపడుచు ఉంటుంది.

ఇప్పుడు ధనవంతుడైన బోయజు అనే వ్యక్తి నయోమికి దగ్గరి బంధువైయున్నాడు (రూతు 2:1). ఒక వివాహమైన వ్యక్తి చనిపోయినయెడల విధవరాలైన తన భార్యను అతని దగ్గరి బంధువైన వ్యక్తి పెళ్ళిచేసుకొని మరియు పిల్లలను అతని పేరుమీద పెంచాలని ఇశ్రాయేలు ధర్మశాస్త్రము చెప్పుచున్నది (ద్వితీయో. 25:5-9). కాబట్టి నయోమి ఇలా అనుకొని ఉన్నది. "బోయజు దగ్గరి బంధువైయుండి మరియు బ్రహ్మచారి అయి ఉన్నాడు కనుక బహుశా అతడు రూతును పెండ్లి చేసుకొనవచ్చును". కాని రూతు మోయబీయురాలు కనుక ఆమెకు ఈ చట్టము తెలియదు మరియు నయోమి కూడా ఎప్పుడు దీనిని ఆమెకు చెప్పలేదు. ఎందుకనగా ఆమె అతని మీద ఆశలు పెంచుకొనవచ్చు. కాని రూతుకి మరలా వివాహము చేసుకోవాలనే ఆసక్తిలేదు. ఆమె భర్తకోసం ఇశ్రాయేలు రాలేదు. ఆమె నిజమైన దేవున్ని తెలుసుకొనుట కొరకు వచ్చింది. ఓర్పా భర్తను వెదుకుంటూ మోయబుదేశం వెళ్ళింది. కాని రూతు మొదటిగా దేవున్ని వెతికింది. కాబట్టి ఆమె దేవున్ని కనుగొనుటమే కాక, ఒక మంచి భర్తను భవిష్యత్తుకు కావలసిన స్వాస్థమును పొందుకున్నది. దేవుని ఘనపరచువారిని ఆయన ఘనపరచును. దేవుని రాజ్యమును మొదటిగా వెదికిన వారు ఈ లోకములో అవసరమైన వాటిని దేవుడు వారికి ఇచ్చుటను చూస్తారు. వాటికొరకు వారు వెదుకకపోయినను దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. అవి మన ఒడిలో వచ్చి పడతాయి.

నయోమి మరియు రూతు బీదవారు. కాని రూతు సిగ్గుపడకుండా అనుదిన అవసరాల కొరకు పనిచేసే అమ్మాయి. కాబట్టి ఆమె తన అత్తతో ఒకరోజు ఈ విధముగా చెప్పింది, "కాబట్టి నేను వెళ్ళి ధనవంతుల పొలంలో మిగిలినపోయిన పరిగెను తీసుకొని వస్తాను". ఇశ్రాయేలీయులలో, వారి పంటను రెండవసారి కూర్చుకొనక కొంత పరిగెను(విత్తనములను) బీదలకొరకు విడిచిపెట్టాలని దేవుడు ఒక చట్టమును పెట్టాడు(లేవికాండము 19:9). అటువంటి పరిగెను వేరుకొనుటకు రూతు వెళ్ళింది. ఆమె బీదరాలైన అమ్మాయి కనుక తనకొరకు తన అత్తకొరకు తాను చేయగలిగినది చేయాలని కోరింది.

సార్వభౌమాధికారము గల దేవుడు అద్భుతముగా ఆమెను బోయజు పొలమునకు నడిపించాడు. దేవుడు తన సార్వభౌమాధికారముతో, జగత్పునాది వేయబడకముందే భార్యభర్తలగుటకు ప్రణాళిక కలిగియున్నాడు, ఆమె పరిగె వేరుచుండగా బోయజు ఆమెను చూచి మరియు తన పనివారితో ఆమెను పిలిపించాడు. ఆమె నయోమితో వచ్చిన మోయబీయురాలైన స్త్రీ అని వారు సమాధానమిచ్చారు. బోయజు ఒక దయగల దైవికమైన వ్యక్తి. ఆమె పురుషులచేత వేదించబడకుండునట్లు, ఆమె పరిగెను వేరుకొనుట అపాయకరమని చెప్పాడు. ఆమెకు ఎటువంటి హాని చేయవద్దని తన సేవకులతో అతడు చెప్పాడు. మోయబీయురాలైన తన మీద ఇంత కనికరం చూపించినందుకు ఆమె ఎంతో తాకబడింది. ఆమె తన అత్తయెడల చూపిన కనికరము గూర్చియు మరియు మోయబీయులు విగ్రహములను విడిచి దేవుని వెంబడించాలని కోరుకున్నదని వినియున్నాడని బోయజు చెప్పాడు. కాబట్టి రూతు కొంత ధాన్యం తీసుకొని పోవునట్లు కొంత ధాన్యమును ఆమెకు ఇవ్వమని తన సేవకులకు చెప్పాడు.

అటువంటి అమ్మాయిని బోయజుకు భార్యగా చేయుటకు మరియు దావీదుకు పూర్వీకురాలుగా అగునట్లును మరియు ప్రభువు యొక్క వంశావళిలో ఉండునట్లు దేవుడు ఆమెను ఎందుకు ఎన్నుకున్నాడు? మొదటగా రూతు దీనురాలైయుండి తననుతాను హెచ్చించుకోలేదు. ఆమె కనికరము గలదై కష్టపడి పని చేస్తూ విశ్వాసముతో ప్రభువును వెంబడించుటకు తన ఇంటిని, తన బంధువులను విడిచిపెట్టింది. మరియు తన అత్తను దయతోను, ప్రేమతోను చూచుకొనినది. ఈ రోజు కూడా యవ్వనంలో ఉండే అమ్మాయిలలో దేవుడు ఇటువంటి గుణలక్షణములను చూస్తున్నాడు.

రూతు ఇంటికి వచ్చినప్పుడు ఈ పరిగె ఎక్కడ దొరికిందని ఆమె అత్త అడిగింది మరియు రూతు చెప్పింది. నయోమి దీనిని వినిన తరువాత ఆమె కొరకు బాధ్యత వహించుటకు ప్రయత్నిస్తాననియు మరియు బోయజు తనకు దగ్గరి బంధువనియు ఆమెతో చెప్పింది. ఒక దగ్గరి బంధువు ఒక విధవరాలిని పెండ్లి చేసుకొని విడిపింపవచ్చని దేవుని ధర్మశాస్త్రములో ఉందని ఆమె రూతుకు వివరించింది. కాబట్టి బోయజు ఆమెను కలసినప్పుడు అతడు తన దగ్గరి బంధువు కనుక ఆమెను పెండ్లి చేసుకొని విడిపించమని అతని కోరింది. తన కంటే బాగున్న యవ్వనస్థులను రూతు కోరనందుకు బోయజు సంతోషించాడు. బోయజు వయస్సులో పెద్దవాడు. మరియు యవ్వన స్త్రీలు వయస్సున్న పురుషులను బట్టి ఆకర్షించబడరు. కాని అతని కంటె దగ్గరి బంధువున్నాడని అతడు చెప్పాడు. అతడు నీతిమంతుడు కనుక ఆమెను పెండ్లి చేసుకొని విడిపించే విషయం అతనిని కనుగొని చెపుతానన్నాడు(రూతు 3:12).

కాబట్టి మరుసటి రోజు బోయజు అతని ఇంటికి వెళ్ళి నయోమి యొక్క ఆస్తిని విడిపిస్తాడెమో అని అడిగాడు(రూతు 4:3-10). అతడు వెంటనే ఇలా చెప్పాడు, "అవును నేను విడిపిస్తాను". తాను రూతును పెండ్లి చేసుకొని ఆమె భర్త పేరు మీద వారిని పెంచవలెనని చెప్పాడు. కాని అతడు ఆ విషయాన్ని వినినప్పుడు, తన కుమారులతో పాటు ఆమె కుమారులు కూడా తన యొక్క స్వాస్థ్యాన్ని కోరుతారని మరియు ఆ సమస్య రావద్దని ఈ విషయాన్ని తృణీకరించాడు. కాబట్టి ఆ స్వాస్థ్యాన్ని విడిపించుటకు అతడు నిరాకరించాడు. కాబట్టి బోయజే మొదటిగా భూభాగమును విడిపించి రూతును పెండ్లి చేసుకున్నాడు. అది వెంటనే చేయుటకు అతడు ఇష్టపడ్డాడు. ఒక మోయబీయురాలైన స్త్రీని పెండ్లి చేసుకొనుటకు బోయజు ధైర్యముతో ముందుకొచ్చాడు. ఒక అన్యకుటుంబము నుండి వచ్చిన రూతు యొక్క లక్షణములను బట్టి అతడు ఆమెను గౌరవించాడు. క్రైస్తవేతర కుటుంబము నుండి వచ్చిన అమ్మాయిలను పెండ్లి చేసుకొనుటకు కొందరు వెనుకంజు వేస్తారు. కాని క్రైస్తవకుటుంబము నుండి వచ్చిన అమ్మాయిల కంటే ఇటువంటివారే ఆత్మీయముగా బలముగా ఉండుటను చాలా ఎక్కువగా చూస్తాము. బోయజు రూతును పెండ్లి చేసుకున్నాడు మరియు దావీదు తండ్రియైన యెష్షయకి తండ్రి అయిన ఓబేదును కన్నాడు. ఆమె అన్యురాలైనప్పటికి దేవునిని ఘనపరచింది గనుక దేవుడామెను ఘనపరచాడు. ఇది 1 సమూయేలు 2:30 లో ఉన్న సత్యాన్ని రూతులో మనం నేర్చుకుంటాము.

"నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరచెదను". దేవునికి పక్షపాతం లేదు. ఇతరుల చేత తృణీకరించబడినప్పటికిని తన భాగస్వామిని కనుగొనుటకు దేవుడు జాగ్రత్త వహిస్తాడని ఈ కథ చెపుతున్నది. ఇటువంటి భూసంబంధమైన చిన్న విషయాలను కూడా ప్రభువును నమ్మవచ్చు. దేవుడు మన గురించి జాగ్రత్త వహించి మన భూసంబంధమైన అవసరమేదైనను తీర్చుటకు కోరుతున్నాడు.