శిష్యత్వానికి సంబంధించిన మూడవ షరతు లూకా 14:33లో ఉంది: "మీలో తనకు కలిగినదంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు" (మరొక ఖచ్చితమైన మాట).
ఆచరణాత్మకంగా దీని అర్థం ఏమిటి? మనం దీనిని అర్థం చేసుకోవాలి. మనం అన్నింటినీ విడిచిపెట్టి, సన్యాసులుగా లేదా సాధువులుగా మారి అరణ్యాలలోకి వెళ్లి అక్కడ నివసించాలని దీని అర్థమా? కాదు. "కలిగి ఉండటం" అనేది మనం దేనితో స్వాధీనపరచబడ్డామో వాటిని సూచిస్తుంది. నేను కలిగి ఉన్న వాటన్నిటి చేత నేను పట్టబడ్డాను. నా ఇల్లు నా స్వాధీనమయితే, అది నాది కాబట్టి నేను దానిని అంటిపెట్టుకుని ఉంటాను. నేను దానిని కలిగి ఉన్నాను మరియు అది నన్ను కలిగి ఉంది. అది మీ ఖరీదైన కారు కావచ్చు లేదా చాలా విలువైన స్టాక్‌లు మరియు షేర్లు కావచ్చు; మీరు వాటిని కలిగి ఉంటారు, ఆపై అవి మిమ్మల్ని స్వాధీనం చేసుకుంటాయి, ఎందుకంటే మీ మనస్సు వాటిపై ఎక్కువగా ఉంటుంది. మీ మనస్సు మీ ఇంటిలో ఉన్న పనికిమాలిన వస్తువులపై కాదు, కానీ ఈ విలువైన ఆస్తులపైనే ఉంటుంది.
కాబట్టి, మనం ఆయన శిష్యులుగా ఉండాలంటే "మనం కలిగి ఉన్నవన్నీ (ఆస్తులన్నీ) వదులుకోవాలి" అని చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటి? నా దగ్గర ఉన్నదంతా అమ్ముకోవాలా? మార్కు 10లో యేసు దగ్గరకు ఒక యౌవనస్థుడు వచ్చాడు, అతనికి ఉన్నదంతా అమ్మమని యేసు చెప్పాడు, కానీ యేసు ఆ ఆజ్ఞను అందరికీ ఇవ్వలేదు. ఉదాహరణకు, లూకా 19లో, జక్కయ్య యేసుతో తన ఆస్తిలో సగం పేదలకు ఇస్తానని మరియు అతను మోసం చేసిన వారికి తిరిగి చెల్లిస్తానని చెప్పాడు, అది మంచిదని యేసు చెప్పాడు. ఆయన, "ఈ ఇంటికి రక్షణ వచ్చింది" అన్నాడు. యౌవనుడైన ధనిక అధిపతివలె ప్రతిదీ వదులుకోవాలని ఆయన జక్కయ్యను కోరలేదు. మరియ, మార్త మరియు లాజరు ఇంట్లో, వారు దేనినైనా వదులుకోవాలని కూడా యేసు కోరలేదు. కాబట్టి, అన్నిటిని అమ్మేయమని ఆయన అందరికీ చెప్పలేదు.
డబ్బుపై ప్రేమ క్యాన్సర్ లాంటిది: కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ చాలా విస్తృతంగా వ్యాపించటం వలన, మీరు నయమయ్యే ఏకైక మార్గం మొత్తం అవయవాన్ని తొలగించడమేనని డాక్టర్ చెప్తాడు. అది కేన్సర్ ఉన్న ఏదైనా అంతర్గత అవయవం కావచ్చు. డాక్టర్, "వేరే మార్గం లేదు. మొత్తం అవయవాన్ని తీసివేయాలి, లేకపోతే మీరు చనిపోతారు" అని చెప్తాడు. కానీ ఇతర సందర్భాల్లో, క్యాన్సర్ అంతగా వ్యాపించలేదు కాబట్టి కొద్దిగా తొలగిస్తే సరిపోతుంది. డబ్బుపై ప్రేమ క్యాన్సర్ లాంటిది. ఆ యౌవనుడైన ధనిక అధికారి విషయానికొస్తే, "నీ దగ్గర ఉన్నదంతా అమ్మి పేదలకు ఇవ్వాలి" అని ప్రభువు అతనికి చెప్పవలసి వచ్చేంతగా అది వ్యాపించింది. కానీ జక్కయ్య వంటి ఇతరుల విషయంలో అది తక్కువగా ఉంది. మరియ మార్త విషయంలో, అది చాలా తక్కువగా ఉంది. కాబట్టి, ఆయన అందరికీ ఒకే ఆజ్ఞను ఇవ్వలేదు. డబ్బుపై ప్రేమ మిమ్మల్ని ఎంతగా పట్టుకుంది, మీ జీవితంలో క్యాన్సర్ ఎంత విస్తృతంగా వ్యాపించింది అనే దానిపై, మీ ఆస్తులను విడిచిపెట్టమని మరియు విక్రయించమని ప్రభువు చెప్పటం ఉంటుంది.
అబ్రహాము మరియు ఇస్సాకు కథను ఆలోచించడం ద్వారా మనకు ఉన్నదాన్ని విడిచిపెట్టే వైఖరిని సరిగా అర్థం చేసుకోవచ్చు. అబ్రాహాము ఇస్సాకును తన సొంతంగా కలిగి ఉన్నాడు. అతను ఇస్సాకును ప్రేమించాడు మరియు స్వాధీనంగా కలిగి ఉన్నాడు. ఇస్సాకు తన హృదయానికి ప్రియమైనవాడు, మరియు తన భార్య కంటే ఎక్కువగా అతనిని చూసుకున్నాడు. అబ్రాహాము హృదయంలో ఇస్సాకు ఒక చిన్న విగ్రహమని, నిజానికి ఇస్సాకు అబ్రాహాముకు దేవుడుగా ఉన్నాడని దేవుడు చూశాడు. అతను ఇస్సాకును చాలా ప్రేమించాడు. దేవుడు ఇస్సాకును కలిగి ఉండటమనే విగ్రహారాధన నుండి అతనిని వేరు చేయాలనుకున్నాడు. కాబట్టి దేవుడు, ఇస్సాకును మోరియా పర్వతానికి తీసుకెళ్లి చంపమని అబ్రాహాముతో చెప్పాడు. అబ్రాహాము విధేయత చూపాడు. దాని గురించి ఆలోచించడానికి దేవుడు అతనికి మూడు రోజులు ఇచ్చాడు, అతను మోరియా పర్వతానికి చేరుకోవడానికి మూడు రోజులు నడిచాడు, ఆపై అతను ఇలా అన్నాడు, "అవును ప్రభువా, నేను నిన్ను ఆరాధిస్తున్నాను. నేను ఇస్సాకును నీకు అర్పిస్తాను." అతను ఇస్సాకును చంపడానికి కత్తి తీసినప్పుడు, దేవుడు అతన్ని ఆపమని అడిగాడు, ఇస్సాకును ఇంటికి తీసుకెళ్లమని చెప్పాడు. ఆ రోజు నుండి, అబ్రాహాము ఇస్సాకును స్వాధీనంగా కలిగిలేడు, కానీ అతనిని కేవలం కలిగి ఉన్నాడు. ఇస్సాకు ఇప్పటికీ అతని ఇంట్లోనే ఉన్నాడు - అతను ఇంకా అతని కుమారుడే - కానీ అబ్రహము అతనిని మరలా స్వాధీనంగా చేసుకోలేదు. మన ఆస్తులను విడిచిపెట్టడం అంటే ఏమిటో వివరించుటకు ఇది చాలా అందమైన చిత్రం.
మీ జీవితంలో మీకు అత్యంత విలువైన వస్తువుల (భూసంధమైన, భౌతిక) గురించి ఆలోచించండి. మీకు విలువైనవి, మీకు చాలా చాలా ముఖ్యమైనవి ఏమిటి? బహుశా మీరు వాటి జాబితాను తయారు చేయాలి. అవే మీ ఆస్తులు, మీరు నిజంగా శిష్యులుగా ఉండాలనుకుంటే మీరు చాలా నిజాయితీగా ఉండాలి. నిజమైన మీ ఆస్తులు ఏమిటో మీరు నిజాయితీగా ఉండాలి, ఆపై మీరు వాటి పట్ల స్వాధీన వైఖరిని కలిగి ఉండకూడదని నిర్ణయించుకోవాలి.
మీరు దేనిని గట్టిగా పట్టుకుంటున్నారో అదే మీ స్వాధీనం(ఆస్తి). ఉదాహరణకు, నేను పెన్నును నా చేతిలో గట్టిగా పట్టుకుంటే, నేను దానిని స్వాధీనపరచుకున్నాను. అది మీ ఇల్లు కావచ్చు, మీ బ్యాంకు ఖాతా కావచ్చు, మీ స్టాక్‌లు మరియు షేర్లు కావచ్చు, మీ కారు కావచ్చు, మీ ఆస్తి లేదా రియల్ ఎస్టేట్ వంటి విలువైనది ఏదైనా కావచ్చు. దానిని కేవలం కలిగి ఉండటం అంటే మీరు మీ అరచేతిని తెరచుట. ఇది ఇప్పటికీ అక్కడే ఉంది - మీరు దానిని మరెవరికీ అప్పగించలేదు - కానీ ఇప్పుడు మీరు ఇలా అంటారు, "ప్రభువా, ఇది నాది కాదని నేను గుర్తించాను. ఇది మీది. మీరు దీన్ని నాకు ఇచ్చారు మరియు నేను దీని నిర్వాహకుడిని. నేను దీనిని నమ్మకంగా ఉపయోగించాలను కుంటున్నాను, కానీ నేను దీనిని గట్టిగా పట్టుకొని ఉండను. అది నన్ను పట్టుకొని ఉండలేదు. దీనిని నేను కేవలం కలిగి ఉన్నాను, దీనిని కలిగి ఉండుటకు అనుమతించినందుకు నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను."
స్వాధీనపరచుకోవటం (గట్టిగా పట్టుకొని ఉండటం) మరియు కేవలం కలిగి ఉండటం మధ్య వ్యత్యాసం ఇదే. నేను నా స్వాధీనంలో ఉన్న వాటంన్నిటినీ విడిచిపెట్టాలి అని యేసు చెప్పాడు. ప్రభువు నాకు తిరిగి ఇచ్చే అనేక వస్తువులను నేను కలిగి ఉండవచ్చు మరియు నేను వాటిని ఉపయోగించుకుంటాను, కానీ నేను వాటిని గట్టిగా పట్టుకొని ఉండను.
ఇది శిష్యత్వానికి సంబంధించిన మూడవ షరతు: నేను భూసంబంధమైన అన్నిటికంటే ఎక్కువగా యేసును ప్రేమించాలి.