WFTW Body: 

సీనాయి కొండపై నుండి మోషే రెండు రాతి పలకలు చేతిలో పట్టుకొని క్రిందికి వచ్చాడు. ఒకదానిపై దేవునితో మనిషికి ఉండవలసిన సంబంధము గూర్చిన నాలుగు ఆజ్ఞలు వ్రాయబడియుండెను. రెండవ దానిపై మనిషికి తన తోటి మనిషితో ఉండవలసిన సంబంధమును గూర్చిన ఆరు ఆజ్ఞలు వ్రాయబడెను.

ఈ రెండు పలకలు రెండు ఆజ్ఞలుగా చెప్పవచ్చని యేసు చెప్పెను. మొదటిది "నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను", రెండవది "నిన్నువలె నీ పొరుగు వాని ప్రేమింపవలెను" (మత్తయి 22:37-39).

యేసు ప్రభువు ఈ రెండింటిని ఆయన నేర్పించిన ప్రార్థనలో కూడా నొక్కిచెప్పెను. మొదటి మూడు విన్నపములు మొదటి ఆజ్ఞకు సంబంధించినవి. తరువాతి మూడు విన్నపములు, యేసు ప్రభువు తన శిష్యులకు "నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరును ప్రేమించుడి" (యోహాను 13:34) అని క్రొత్తనిబంధన క్రింద ఇచ్చిన రెండవ ఆజ్ఞకు సంబంధించినవి.

యేసుయొక్క నిజమైన శిష్యుడు తన మనసుకు తెలిసిన, తెలియని విషయములలో తన యొక్క ప్రతి కోర్కె దేవుని ఇష్టముకు అనుగుణ్యముగా ఉండి, తన జీవితములో ఏ కోర్కె, అభిలాష, అనుభూతి దేవుని చిత్తమునకు బయట ఉండకుండా సంపూర్తిగా దేవుణ్ణి కేంద్రంగా కలిగియుండుటకు కోరుకొనును. అదే సమయంలో యేసు తనను ప్రేమించినట్లే తన సహోదరులను కూడా అతను పరిపూర్ణముగా ప్రేమించుటకు చూచును.

అయితే తన వైఖరి ఈ రెండు దిశలలో ఉండవలసిన విధముగా లేదని అతడు ఎల్లప్పుడూ ఎరిగియుండును. కాని అతడు ఈ లక్ష్యం కోసం పనిచేస్తూ, అక్కడికి చేరుట కొరకు ఎటువంటి వెలను చెల్లించుటకైనా ఎల్లప్పుడు సిద్ధపడియుండును.

మన సహోదరులను ప్రేమించుట అనగా వారి గూర్చి శ్రద్ధ కలిగియుండుట. లోకములో ఉన్న వారందరి గూర్చి మనము ఆలోచింపలేము. దేవునికి మాత్రమే అది సాధ్యమగును. కాని మనకున్న సామర్థ్యం చొప్పున, మనతోటి విశ్వాసుల గూర్చి మనము శ్రద్ధ కలిగియుండవలెను. మరియు ఆ సామర్థ్యం ఎక్కువ అవుతుండాలి.

మనము ఒక్కసారే ఈ విధముగా మొదలు పెట్టలేము. మొదటి మొట్టుగా మన ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులను, యేసు మనలను ప్రేమించినట్లే మనం ప్రేమించాలి. అయితే అక్కడితో ఆగిపోకూడదు. మనం ముందుకు వెళ్ళి దేవుడు మనకు ఇచ్చిన ఆయన కుటుంబములోని సహోదర సహోదరీలను మనను యేసు ప్రేమించినట్లే ప్రేమించుట నేర్చుకోవాలి.

ముందుకు సాగిపోవుటకు మన యెదుట ఉంచబడిన గమ్యస్థానము పరిపూర్ణత. అయితే అక్కడకు చేరుటకు మనం స్థిరంగా నిశ్చయించుకోవాలి. పౌలు ఆ దిశగా ప్రయాణిస్తూ, "ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు, క్రీస్తుయేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను" అని చెప్పెను (ఫిలిప్పీ 3:13,14). దేవునియొక్క ఉన్నతమైన పిలుపు దేవుణ్ణి సంపూర్తిగా కేంద్రంగా కలిగియుండుట, దేవుని అన్నింటికంటే ఎక్కువగా ప్రేమించుట మరియు మనతోటి విశ్వాసులను యేసు మనలను ప్రేమించినట్లు ప్రేమించుట మరియు మన పొరుగు వారిని మనవలె ప్రేమించుటయై ఉన్నది.