WFTW Body: 

1. ప్రేమ ప్రశంసలను వ్యక్తం చేస్తుంది

వివాహ జీవితము గూర్చి ఒక పూర్తి పుస్తకమును దేవుడు బైబిలులో చేర్చెను అది పరమగీతము. పరమగీతములో భర్త తన భార్యకు ఏమి చెప్పుచున్నాడో చూడండి (ఇంగ్లీషు మెసేజ్ బైబిలు తర్జుమా). "నీవు సౌందర్యవంతురాలవు, ఓ నా ప్రియురాలా! తలనుండి కాలివరకు పోల్చలేని సౌందర్యవంతురాలవు మరియు ఏ అవలక్షణము లేనిదానవు. నీవు నా ఊహలలో కనబడునంత సౌందర్యవంతురాలవు. నీ స్వరము నెమ్మది కలుగజేయునది మరియు నీ ముఖము ఆనందింపజేయునది. నా ప్రియమైన స్నేహితురాలా, నీవు అంతరంగమందు మరియు బాహ్యముగాను నీ సౌందర్యము పరిపూర్ణమైనది. నీవు పరదైసువంటి దానవు. నీవు నా హృదయమును బంధించితివి. నీవు నా వైపు చూడగా నేను ప్రేమలో పడిపోతిని. నా వైపు నీవు చూచిన ఒక్క చూపుతో నేను ఏమి చెయ్యలేని విధముగా ప్రేమలో పడిపోతిని. నా హృదయము ఎగిరిపోయినది. ఓ! నిన్ను చూడగానే నాలో భావాలు మరియు రేకెత్తించే కోర్కెలు వచ్చుచున్నవి. మరొకరికి నేను పనికి రాకుండా పాడైపోతిని. ఈ భూమిపై నీ వంటి వారు ఎప్పుడూ లేరు, ఎప్పుడూ ఉండరు. పోల్చుటకు వీలుకాని స్త్రీవి నీవు". ఇప్పుడు భార్య చెప్పుచున్నదో వినండి. ఇది ఆమె యొక్క స్పందన. "ఓ ప్రియుడా, నీవు అందగాడివి! నీ వంటివారు పదివేలలో ఒకరుందురు. నీవంటి వారెవ్వరూ లేరు! నీవు బంగారము నీవు పర్వతతుల్యుడవు. నీ మాటలు ఆదరించునవి మరియు అవి ధైర్యము నిచ్చునవి. నీ మాటలు ముద్దువలె నుండును మరియు నీ ముద్దులన్నియు మాటలే. నీ గురించిన ప్రతీది నన్ను సంతోషపరచును. నీవు నన్ను పూర్తిగా పులకరింపచేయుదువు!. నేను నీ కొరకు ఆశగొనియున్నాను మరియు నిన్ను ఎంతగానో కోరుకొనుచున్నాను. నీవులేక పోవుట నాకు బాధాకరము. నేను నిన్ను చూడగానే, నా చేతులు నీ చుట్టువేసి నిన్ను గట్టిగా పట్టుకొందును. నిన్ను నేను వెళ్ళనీయను. నేను నీ దానను మరియు నీవు నావాడవు మరియు నీవు నా ఒకే ప్రియుడవు మరియు నీవు నా ఒకే పురుషుడవు".

2. ప్రేమ క్షమించుటకు త్వరపడుతుంది

ప్రేమ నిందించుటకు నిదానించును, కాని క్షమించుటకు త్వరపడును. ప్రతి వివాహములో భార్యభర్తల మధ్య సమస్యలుండును. కాని ఆ సమస్యలను అట్లే ఉంచినట్లయితే, అవి తప్పక చికాకులు తెచ్చును. గనుక క్షమించుటకు త్వరపడండి మరియు క్షమాపణ అడుగుటకు త్వరపడండి. దానిని చేయుటకు సాయంత్రము వరకు వేచియుండకండి. నీ కాలిలో ఒక ముల్లు ఉదయమున గుచ్చుకొనినట్లయితే, దానిని వెంటనే తీసివేయుదువు. సాయంత్రము వరకు నీవు వేచి చూడవు. నీవు నీ భాగస్వామిని బాధపెట్టినట్లయితే, నీవు ఆమెను లేక అతడిని ఒక ముల్లుతో పోడిచినట్లే. వెంటనే దానిని తీసివేయి. వెంటనే క్షమాపణ అడుగు మరియు క్షమించుటకు వేగిరపడు.

3. ప్రేమ తన భాగస్వామితో కలిసి పనిచేయుటకు వేగిరపడును అంతేకాని ఒంటరిగా కాదు :

సాతాను హవ్వను తోటలో శోధించుటకు వచ్చినప్పుడు, "నేను నిర్ణయము తీసుకొనుటకు ముందు నా భర్తను మొదట సంప్రదించనివ్వు" అని ఆమె చెప్పినట్లయితే మానవుని చరిత్ర ఎంత వ్యత్యాసముగా ఉండియుండేది. అప్పుడు ఎంత వ్యత్యాసమైన కథగా ఉండియుండేది. లోకములో సమస్యలన్ని ఒక స్త్రీ నిర్ణయము తీసికొనుటకు ముందు ఆమెకు సంప్రదించవలసిన ఒక తోడును దేవుడు ఇచ్చినా, ఆమె స్వంతముగా నిర్ణయము తీసుకొనుట వలన వచ్చియున్నవని జ్ఞాపకముంచుకొనుడి. నిజమైన ప్రేమ పనులను కలిసిచేయును. ఒక్కరి కంటే ఇద్దరు ఉండుట ఎప్పుటికీ శ్రేష్ఠమైనది.