వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట శిష్యులు
WFTW Body: 

ఇతరులను తీర్పు తీర్చుటకంటే ఆశీర్వదించుటకు సిద్ధముగా ఉండుము: యెషయా 61:1-2 లో ఇతరులను విమోచించే సువార్తను ప్రకటించుటకు పరిశుద్ధాత్ముడు ప్రభువైన యేసును అభిషేకించినట్లు ప్రవచనం చెప్పబడింది. నజరేతులోని సమాజ మందిరములో ప్రభువైన యేసు తన మొదటి ప్రసంగములో ఈ వాక్యభాగాన్ని చదివారు. ఇక్కడ ప్రభువు "ప్రభువు హితవత్సరమును" ప్రకటించాడు కాని దేవుని ప్రతిదండన దినమును ప్రకటించలేదు. ఎందుకనగా ఆ ప్రతిదండన దినము ఇంకా రాలేదు (2వ వచనమును లూకా 4:19తో పోల్చి చూడండి). దేవుని కనికరమును ఆయన యొక్క తీర్పుతో పోల్చి చూడండి. సంవత్సరమంతయు కనికరము చూపిస్తాడు కాని ఒక్క రోజు మాత్రమే తీర్పు తీర్చును. అనగా దేవుని కనికరముతో కూడిన కృపను గుర్చిన నిష్పత్తి ఇక్కడ చూడగలము 365:1. ఆయన తీర్పు తీర్చుటకంటే మనకు కనికరము చూపించుటకు ప్రయత్నిస్తున్నాడు. ఇతరుల విషయంలో మన వైఖరి కూడా అలాగే ఉండాలి. ఇతరులను తీర్పు తీర్చుట కంటే 365 రెట్లు ఇతరులను ఆశీర్వదించుటకును, కనికరించుటకును మనము సిద్ధముగా ఉండాలి. దేవుడు మన జీవితమంతటిలోని భారమంతటిని తీసివేసి దానికి బదులుగా స్తుతించే ఆత్మతో మనలను నింపును (3వ). క్రీస్తుయొక్క నీతిని మనకు పై బట్టగా ధరింపజేసి మరియు మనలను క్రీస్తు వధువుగా చేయుచున్నాడని 10వ వచనములో చెప్పుచున్నాడు. ఇది ఎంత ఆశీర్వదించబడిన జీవితం.

నీ శక్తికి బదులుగా దేవుని శక్తిని పొందుట: యెషయా 40:29-31 లో మనము ఆరాధించి మరియు సేవించుచున్న సర్వశక్తిగల దేవుడు మనము బలహీనముగా ఉన్నప్పుడు నూతన బలమునిచ్చును. మన శక్తిహీనులమైనప్పుడు, ఆయన మనకు శక్తినిచ్చును. మనమాయనను సేవించుటకు కావలసిన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఆయన ఇస్తాడు. ప్రభువును సేవించుటలో యవ్వనస్తులు సొమ్మసిల్లి తొట్రిల్లవచ్చును కాని దేవుని కొరకు కనిపెట్టువారు, ఏ వయసులో ఉన్నప్పటికిని నూతన శక్తిని పొందెదరు. ఇది ఎంత అద్భుతమైన వాగ్ధానం. వృద్ధులవలె యవ్వనస్తులు తొట్రిల్లవచ్చును కాని "యెహోవాకొరకు యెదురు చూచువారు నూతన బలము పొందుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడచిపోవుదురు". మీ అవసరములన్నిటి కొరకు సామాన్యమైన విశ్వాసముతో ప్రభువు దగ్గర కనిపెట్టి ప్రార్థించాలని ప్రోత్సహిస్తున్నాను. ఈ వచనము చెప్పుచున్నట్లుగా నూతన బలమును పొందెదరు. మరొక తర్జుమాలో ఇలా చెప్పబడింది "ప్రభువు యొద్ద కనిపెట్టువారు వారి బలానికి బదులుగా నూతన బలము పొందుదురు". అనగా మన శక్తిని మనము ప్రభువుకిచ్చినట్లయితే ఆయన తన శక్తిని మనకిచ్చును హల్లెలూయా!. మనకున్నదంతా ప్రభువుకిచ్చి ప్రభువుకున్నదానిని మనము పొందవచ్చు. ప్రభువైన యేసు తండ్రితో ఇట్లన్నారు "తండ్రి, నావన్నియు నీవి, నీవియు నావి" యోహాను 17:10-11. ప్రభువుయొక్క పరిచర్యలో ఆయనయొక్క శక్తి నీకు అవసరమని నీవు చూస్తావు. ప్రభువును సేవించువారందరు ఆయనయొక్క అద్భుతమైన శక్తిని మరియు పునరుత్థాన శక్తిని వారి ఆత్మలలోనే గాక వారి శరీరములలో కూడా పొందేటట్లు వారు ప్రభువునందు విశ్వాసముంచాలి. అప్పుడు మనము వృద్ధులమైనప్పటికి పభువుకొరకు ఫలిస్తాము (కీర్తనలు 92:15).

పభువుయొక్క మహిమను నీలో పత్యక్షపరచబడనిమ్ము: యెషయా 40:3,4లను మనము నాలుగు విషయములలో అన్వయించుకొనవచ్చును, మొదటిగా "ప్రతిలోయను ఎత్తు చేయవలెను (4వ)". నిరాశ నిసృహలకు క్రొత్త నిబంధనలో అవకాశం లేదు. "నేను వట్టివాడను పనికిమాలిన వాడను అని మనము ఎన్నడైనను అనకూడదు". మన దేవుడు ప్రోత్సహించే దేవుడు. ఆయన మనలను క్రీస్తుతో కూడా లేపి మరియు హెచ్చించాడు. మనము లోయలలో జీవించనవసరములేదు. మనము రాజకుమారులము మరియు మన తలలను ఎత్తుకొనజేయును. రెండవదిగా "పర్వతములను అణచవలెను (4వ). మన గర్వమంతయు అణచివేయబడాలి". మూడవదిగా "కరుకైనవి సమముగా చేయబడాలి", మనలో ఎంతో కఠినత్వము, కరుకుతనము ఉన్నవి. ఇవి సరళముగా చేయబడి, మనము కృప మరియు కనికరముగల వారముగా మారాలి. నాలుగవదిగా, " వంకరమార్గములు చక్కగా చేయబడాలి (లూకా 3:5లో చెప్పబడింది). ధనము విషయంలో దుర్ణీతివంటి వంకర మార్గములు మన జీవితములో కలవు. అవన్నియు సరిచేయబడాలి. మారుమనస్సు పొందినప్పుడు ఈ విధంగా జరుగుతుంది - లోయలు ఎత్తు చేయబడును, పర్వతములు అణచబడును, కరుకైనవి సమముగాను, వంకరవి చక్కగాను చేయబడును. అప్పుడు ప్రభువుయొక్క మహిమ మన శరీరములో ప్రత్యక్షపరచబడుతుంది. మన శరీరములో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను ఇతరులు చూస్తారు.