WFTW Body: 

(అన్ని లేఖన వచనాలను చూడండి)

క్రొత్త సంవత్సరపు ప్రార్థన: "మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములను లెక్కించుటకు మాకు నేర్పుము" (కీర్తనలు 90:12).

ఆత్మీయముగా ఎదిగి క్రీస్తు సారూప్యములోనికి రూపాంతరము పొందుట ఒక రోజులో జరుగదు. అది కొద్దికొద్దిగా మరియు ప్రతిదినము కొనసాగవలెను. మనము ఈ పాటపాడునట్లుగా: "కొద్దికొద్దిగా దినదినము; ప్రతిదానిలో కొద్దికొద్దిగా, నా యేసు నన్ను మార్చుచున్నాడు; నేను పోయిన సంవత్సరం వలె లేను; మరియు నేను పూర్తిగా రూపాంతరము పొందలేదు, కాని నేను రూపాంతరము పొందుతున్నాను; ఇది నెమ్మదిగా జరుగుతున్నప్పటికిని - ఒక రోజు నేను ఆయనవలె ఉండబోవుచున్నానని నాకు తెలియును". కాబట్టి ఈ సంవత్సరము ప్రతిరోజు ప్రభువుకు లోబడెదము. ఆ విధముగా ఆయన మనలో తన రూపాంతరపు పనిని చేయును.

పరిశుద్ధాత్మ ద్వారా, దేవునివాక్యము ద్వారా రూపాంతరము పొందుట:

పరిశుద్దాత్మను మన జీవితములలో ప్రభువుగా అంగీకరించెకొలది, మొట్టమొదటిగా ఆయన సమస్తమునుండి మనలను విడిపించును (2కొరింథీ 3:17). పాపముయొక్క శక్తినుండియు, ధనాపేక్షనుండియు, దేవునివాక్యమునకు విరోధముగా ఉన్న మానవ ఆచారములనుండియు మరియు మనుష్యుల అభిప్రాయములకు దాసులుగా ఉండుటనుండియు ఆయన మనలను విడిపించును. పరిశుద్ధాత్ముడు మనకు లేఖనములలో ఉన్న ప్రభువైనయేసు మహిమను చూపించును మరియు మనము ఆయన సారూప్యములోనికి రూపాంతరము పొందుటకు మనలను ప్రేరేపించును; అనగా ప్రభువైనయేసు ఆలోచించినట్లే మనముకూడా ఆలోచించుటకు ఆయన ప్రేరేపించును (2కొరింథీ 3:18, రోమా 12:2). ఈ సంవత్సరం పరిశుద్ధాత్ముడు మనలో ఈ పనిచేయవలెనని కోరుచున్నాడు. కాబట్టి ఆయనకు లోబడెదము.

స్తుతించుట ద్వారా, కృతజ్ఞతలు చెల్లించుట ద్వారా రూపాంతరము పొందుట:

"ఆత్మపూర్ణులైయుండుడి, ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుడి"(ఎఫెసి 5:18,19). పరిశుద్ధాత్ముడు, కొండెములు చెప్పుటనుండి నిదించుటనుండి మరియు ద్వేషించుటనుండి మరియు కోపమునుండి విడుదలనిచ్చె స్తుతించె ఆత్మతో మనలను నింపవలెనని కోరుతున్నాడు. ప్రకటనలోని పరలోకము గురించి చెప్పబడిన ఏడు సందర్భములలో, పరలోక నివాసులు ఎల్లప్పుడు దేవుని స్తుతించెదరని కనుగొనెదము. ఎటువంటి సణుగుడుగాని గొణుగుడుగాని లేక పరలోకములో ఎల్లప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడును. ఈ వాతావరణమును పరిశుద్ధాత్ముడు మన హృదయములలోనికి మన గృహములలోనికి ఈ సంవత్సరము తీసుకొని రావలెనని కోరుచున్నాడు. కాబట్టి ఆయనకు లోబడెదము.

దేవుని కృపద్వారా రూపాంతరము పొందుట:

"భక్తిహీనతను, ఈ లోకసంబంధమైన దురాశలను విసర్జించి ఈ దుష్టలోకములో మనము నీతితో దైవికమార్గములో నడచునట్లు దేవుని కృప మనలను బలపరచును"(తీతు 2:11-13 వివరణ). ఈ సంవత్సరం మనం ఇతరులతో కృపాసహితముగా మాట్లాడునట్లు, మన ఆలోచనా విధానం మార్చవలెనని దేవుడు కోరుచున్నాడు (కొలస్సి 4:6). ఈ సంవత్సరం భార్యాభర్తలు కూడా ఒకరియెడల ఒకరు మంచిగా ప్రవర్తించునట్లు తన కృపను అనుగ్రహించవలెనని దేవుడు కోరుతున్నాడు (1పేతురు 3:7). ఈ సంవత్సరమంతయు పరీక్షలను మనము ఎదుర్కొనునట్లు చాలినంత కృపను దేవుడు మనకు అనుగ్రహించవలెనని కోరుతున్నాడు (2కొరింథీ 12:9). కాబట్టి ఈ సంవత్సరంలో ప్రతి పరిస్థితిలో మనము దీనులమై ఉండవలెను. ఎందుకనగా దేవుడు దీనులకు మాత్రమే కృప అనుగ్రహించును (1పేతురు 5:5)

విధేయత ద్వారా రూపాంతరము పొందుట:

పభువైనయేసు గురించి ఈ విధముగా చెప్పబడింది "తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను" (హెబ్రీ 5:8). తన తండ్రి దేనికైనను 'కాదు(వద్దు)' అని చెప్పినయెడల దానికి యేసుప్రభువు కూడా 'కాదు' అని చెప్పెను. అనగా తన స్వచిత్తమును ఉపేక్షించుకొనుట ద్వారా ప్రభువు శ్రమపడెను. అనేక సంవత్సరములు ఆ విధముగా ఉపేక్షించుకొనుట ద్వారా ప్రభువైనయేసు సంపూర్ణుడాయెను (హెబ్రీ 5:8). ఇక్కడ సంపూర్ణుడు అనగా పరిపూర్ణుడని అర్థం. విధేయత అను స్కూలునుండి ప్రభువు డిగ్రీలో ఉతీర్ణుడయ్యెను. ఈ విధముగా మనము కూడా ఈ డిగ్రీలో ఉత్తీర్ణులు కావలెనని పరిశుద్ధాత్ముడు కోరుతున్నాడు. కాబట్టి ఆయన మనలను అనేక పరీక్షలనుండి తీసుకువెళ్ళును. మనము ఏదైనా ఒక పరీక్షలో తప్పిపోతే, మనకు మరొక అవకాశమిచ్చును. ప్రభువు పొందిన డిగ్రీని మనము కూడా పొందుకొని మనలను జయించువారిగా చేయవలెనని ఆయన కోరుతున్నాడు (ప్రకటన 3:21). మనము పొందుకొనవలసిన అత్యంత ప్రాముఖ్యమైన డిగ్రీ ఇది. కాబట్టి ఈ సంవత్సరము మనము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మన స్వంతచిత్తానికి 'కాదు' అని చెప్పి దేవునిచిత్తానికి 'అవును' అని చెప్పెదము.

దేవునియొక్క ప్రోత్సాహం ద్వారా రూపాంతరము పొందుట:

"దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు" (2కొరింథీ 1:4). అనేక సమస్యలతోను మరియు పరీక్షలగుండా వెలుతున్న ప్రజలు మన చుట్టు ఉన్నారు. వారు జయించునట్లుగా మనము సహాయపడవలెనని కోరిన యెడల, మనము మొదటిగా ఆ సమస్యలగుండా వెళ్ళి జయించవలెను. మనము జయించుటకు దేవుడు మనకిచ్చిన ప్రోత్సాహమును, శక్తిని వారితో పంచుకోగలము. ఈ సంవత్సరము మనము కలుసుకొనె ప్రతివ్యక్తికి, కుటుంబానికి మనలను ఆశీర్వాదముగా చేయాలని దేవుడు కోరుతున్నాడు (గలతి 3:8,9,13 చూడండి). ఈ సంవత్సరము అంతయు ప్రతిదినము ఎవరోఒకరిని మనము ప్రోత్సహించవలెనని దేవుడు కోరుతున్నాడు (హెబ్రీ 3:13 చూడండి). ఆ విధముగా జరుగును గాక.

మీరు చాలా ఆశీర్వదించబడిన సంవత్సరము కలిగియుందురు గాక.