WFTW Body: 

భక్తిపరులైన ఎజ్రా నెహెమ్యాలు దేశమంతటిపైన కలిగిన ప్రభావము ద్వారా దేవుడు యూదుల మధ్య తీసుకువచ్చిన బ్రహ్మాండమైన ఉజ్జీవము గురించి నెహెమ్యా గ్రంథము మనకు చూపిస్తుంది.

దేవుడు ఎజ్రా ద్వారా చేసిన దాని గురించి మనము నెహెమ్యా 8వ అధ్యాయములో చదువుతాము. అతడు దేవుని వాక్యమును తీసుకొని గ్రహింపశక్తిగల వయసున్న స్త్రీ పురుషులను పిల్లలను కూడగట్టెను. వారికి ఆరు గంటల పాటు బైబిలు ఉపదేశము చేసెను. ఆ ప్రజలందరును ధర్మశాస్త్రగ్రంథమును శ్రద్ధతో వినిరి (నెహెమ్యా 8:3). వారు దేవుని స్తుతించుటతో తమ కూటమును మొదలుపెట్టిరి (నెహెమ్యా 8:4). ఆ తర్వాత ఎజ్రా కష్టపడి ప్రజలందరకు తాను చదివినదంతా వివరించాడు (నెహెమ్యా 8:8). ఎజ్రా దేవుని వాక్యమును అధ్యాయనము చేయుచు అనేక నెలలు మరియు సంవత్సరాలు గడిపెను గనుక అతడు దానిని వారికి చాలా స్పష్టంగా వివరించగలిగెను. దేవుడతనిని ఈ సమయము కొరకు రహస్యముగా సిద్ధపరిచెను.

ఉజ్జీవము మొదలయ్యెను మరియు ప్రజలు తమ పాపములను బట్టి దు:ఖించడం మొదలుపెట్టిరి (నెహెమ్యా 8:9). దేవుడు వారికిచ్చిన మంచివాటన్నిటిని ఇతరులతో పంచుకొనుటకు వారు ప్రేరేపింపబడిరి. వారలా చేయుట వలన, "యెహోవాయందు ఆనందము వలన వారు బలమొందుదురు" (నెహెమ్యా 8:10). ప్రజలు వెళ్ళి అలా చేశారు. మరుసటి రోజు ఎజ్రా నాయకుల కొరకు బైబిలు అధ్యాయనమును జరిపించాడు (నెహెమ్యా 8:13). ప్రతి సంవత్సరము ఏడవ నెలలో గుడారాల పండుగను జరుపుకొనమని దేవుని వాక్యము వారికాజ్ఞాపించెనని వారు చూడగా వారు దానికి వెంటనే లోబడిరి. ఈ ఆజ్ఞ యెహోషువా దినములనుండి గైకొనబడలేదు. గనుక 900సంవత్సరాల తరువాత మొదటిసారిగా వారు ఈ పండుగను జరుపుకొనిరి (నెహెమ్యా 8:14-17). దేవుని హృదయానుసారుడైన దావీదుకూడా ఇశ్రాయేలీయులను ఈ ఆజ్ఞను గైకొనునట్లు చేయలేదు. తరువాత ఏడు దినములు ఎజ్రా ప్రజలకొరకు బైబిలు ఉపదేశమును కొనసాగించెను (నెహెమ్యా 8:18).

నెహెమ్యా ద్వారా దేవుడు ఏమి చేసెనో మనము నెహెమ్యా 9వ అధ్యాయములో చదువుతాము. ఈ అధ్యాయము ఇశ్రాయేలీయులు ఉపవాసం చేయటంతో, తమ పాపములు ఒప్పుకొనుటతో మరియు అన్యులనుండి తమ్మునుతాము వేరుపరచుకొనుటతో మొదలవుతుంది (నెహెమ్యా 9:1,2). ఆ తరువాత వారు మూడు గంటలు బైబిలు ఉపదేశమును విని మూడు గంటల పాటు ప్రభువును స్తుతిస్తూ తమ పాపములను ఒప్పుకొనిరి. మరలా ఉజ్జీవము వచ్చెను (నెహెమ్యా 9:3). ఆ తరువాత లేవీయులు నిలువబడి యెలుగెత్తి తమ దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టిరి (నెహెమ్యా 9:4). నెహెమ్యా 9:6-31 వచనాలలో బైబిలంతటిలో ఉన్న అతిపెద్ద ప్రార్థన నమోదు చేయబడియున్నది. ఆ తరువాత లేవీయులు అబ్రాహాము కాలమునుండి తమ చరిత్రను, అరణ్యములో 40 సంవత్సరములు సంచారము చేసినప్పుడు తమ వైఫల్యములను న్యాయాధిపతుల మరియు రాజుల కాలములలో తమ వైఫల్యములను వివరించి దేవుడు పంపించిన ప్రతి తీర్పు న్యాయమైనదని సరియైనదని ఒప్పుకొనిరి. వారు మారుమనస్సు పొంది దేవుని యెదుట ఒక నిబంధనపై సంతకము చేశారు. నెహెమ్యా మొట్టమొదటిగా సంతకము చేశాడు (నెహెమ్యా 10:1).

ఇదంతయు ఎజ్రా నెహెమ్యాల వంటి భక్తిపరులైన వారి ప్రభావము వలన జరిగింది. వారు కలిసి చేసిన పరిచర్య ఇద్దరు పెద్దలచేత నడిపించబడే క్రొత్త నిబంధన సంఘముయొక్క పరిచర్యవలె ఉండెను. మనము ఈ దినమున అనుసరించుటకు వారు మంచి మాదిరిగా ఉన్నారు.