వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము శిష్యులు Religious or Spiritual
WFTW Body: 

నిరాశలో ఉన్న వారిని ప్రోత్సహించె ఆశీర్వాదకరమైన పరిచర్యను జెకర్యా కలిగియున్నాడు. వారి పితరులైన యూదులు బబులోనులోని బానిసత్వములోనుండి వచ్చినప్పుడు, వారు ఎంతో బీదవారుగాను భయస్తులుగాను మరియు ఎంతో నిరాశలోను ఉన్నారు. వారు ఎంతో కొట్టబడియున్నారు. 200 సంవత్సరాల క్రితం వారి పితరులకున్న సంసృతిగాని సిరిసంపదలుగాని లేవు. వారిని ప్రోత్సహించుటకు జెకర్యా పిలవబడ్డాడు.

జెకర్యా 2:5లో ప్రభువు వారితో ఇట్లన్నారు "నేను యెరూషలేము(సంఘము) చుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును". సంఘానికి భూలోక సంబంధమయిన ప్రాకారములేమియులేవు. నీవు ఒక సిద్ధాంతము ద్వారా ఒక సంఘములో ప్రవేశించలేవు. అతడు ఆ సంఘములో పాలిభాగస్తుడై యుండాలని కోరినచో, ఆ అగ్ని ప్రాకారము గుండా రావాలి. ఆ అగ్ని అతనిలో ఉన్న భూలోక సంబంధమయిన కోరికను మరియు తన కొరకే తాను జీవించాలనే కోరికను నశింపజేస్తుంది. అప్పుడే అతడు క్రీస్తు శరీరములో పాలి భాగస్తుడు కాగలడు.

ఒక అగ్ని ప్రాకారముతో ఉండిన పట్టణము గురించి ఆలోచించండి. దానిలో నీవు ఏ విధంగా ప్రవేశించగలవు? అగ్ని ప్రాకారము ద్వారా వెళ్ళుట ద్వారానే ప్రవేశించగలవు. నీవు ప్రాకారముగుండా వచ్చుచున్నప్పుడు నీలో ఉన్న దహించబడవలసిన వాటినన్నిటిని దేవుడు దహిస్తాడు. ఏదైతే కాలిపోదో అదే ప్రవేశిస్తుంది. "మన దేవుడు దహించు అగ్నియై యున్నాడు" (హెబ్రీ 12:29). "దహించు అగ్నితో ఎవడు నివసింపగలడు?" (యెషయా 33:14).

ఈ రోజులలో బోధకులు ఆ అగ్నిమీద నీళ్ళు చల్లి చల్లార్చుట వలన, ఈ లోకాశలు కలిగినవారు, లోకమును ప్రేమించేవారు, లోకతలంపులు కలిగినవారు సంఘములో ప్రవేశిస్తున్నారు. అటువంటి సంఘములో దేవుడు నిశ్చయముగా ఉండడు. ఎందుకనగా ఏ సంఘమునకైతే దేవుడు అగ్ని ప్రాకారముగా ఉంటాడో ఆ సంఘములోనే దేవుడు ఉంటాడు.

తరువాత దేవుడు ఇట్లనుచున్నాడు "నేను దాని మధ్యను నివాసినై దాని మహిమకు కారణముగా ఉందును". మీ సంఘములో దేవుని మహిమ ఉండాలని మీరు కోరినట్లయితే ఆయనను మీ సంఘానికి అగ్ని ప్రాకారముగా ఉండనిమ్ము. ఈ రెండు కలసి వెళతాయి. దేవుని స్థాయి చాలా అధికముగా ఉన్నదని మీరనుకొని మరియు అగ్నిమీద నీరు పోసినట్లయితే దేవుని మహిమకూడా మీ సంఘములో ఉండదు. అగ్ని ప్రాకారము వెళ్ళినట్లయితే మహిమ కూడా వెళ్ళిపోతుంది. సిద్ధాంతము మంచిదేకాని ఏ సిద్ధాంతముకూడా అగ్ని ప్రాకారముగా ఉండదు. దేవుడే స్వయముగా అగ్ని ప్రాకారముగా ఉండాలి. ఒక మంచి సిద్ధాంతముకాదు కాని దేవుని మహిమయే సంఘములో ఉండవలసిన మఖ్యమైన విషయము. ఆయన మహిమ ఉన్నట్లయితే దానిని మంచి సిద్ధాంతము వెంబడిస్తుంది. ఆ మహిమలేనప్పుడు సిద్ధాంతము మంచిదైనను ఉపయోగములేదు.

"బబులోనునుండి తప్పించుకొని యెరూషలేముకు రండి" (జెకర్యా 2:7). ఎంత మంచి వాక్యమిది. ఈనాడు కూడా దీనిని మనం దేవుని ప్రజలకు ప్రకటించాలి. ప్రతి విశ్వాసి బబులోనులోనుండి బయటకు వచ్చుటకు నిర్ణయించుకోవాలి. దేవుడు ఎవ్వరిని మెడ పట్టుకొని బయటకు లాగడు. దానికి నీవే బాధ్యత తీసుకోవాలి. నీవు ఒక నిర్ణయం తీసుకోవాలి. దేవునిని దేవుని వాక్యాన్ని గౌరవించని దేనిలోను నేను పాలిభాగస్తుడనైయుండుట నాకు ఇష్టములేదు. అగ్ని ప్రాకారము కలిగి మరియు వారి మధ్యలో దేవుని మహిమను కలిగిన హృదయపూర్వకముగా దేవునిని కోరుకొనే వారముగా ఉండాలని కోరుకొనుచున్నాను.

నీవు ఒక సంఘమును నిర్ణయించాలని కోరినట్లయితే అటువంటి సంఘమును నిర్మించండి. వేరొక విధమైన సంఘమును నిర్మించుట వ్యర్థము. కాని ఇటువంటి సంఘమును నిర్మించుటకు మీరు వెల చెల్లించాలి కాని మీరు కేవలము ఒక నమూనాను చూచి దాని అనుసరించుట ద్వారా దీనిని చేయలేరు. దేవునికిష్టమైన సంఘమును నిర్మించుటకు, నీ జీవితంలో దహించబడవలసినవి దహించబడాలి. నీలోని లోకసంబంధమైన కోరికంతయు దహించబడునట్లు చూచుకొనుము. దేవుడు ప్రేమించేదానిని ప్రేమించుటకును దేవుడు ద్వేషించేదానిని ద్వేషించుటకును ప్రయత్నించుము. అప్పుడు ఆయన సంఘమును కట్టుటకు యోగ్యమైన పురుషుడుగా కాని స్త్రీగా కాని నీవు మారగలవు.