వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   ఆత్మతో నింపబడిన జీవితం
WFTW Body: 

ఎలీషా అభిషేకించబడుటకు ముఖ్యమైన మూడు కారణములు

1)దాహము (దప్పిక)

దేవుడు ఎలీషాను అభిషేకించుటకు మొదటి కారణము దానికొరకు అతనికున్న దప్పిక మరియు లోకములో ఉన్నటువంటి దాని కంటే దానిని ఎక్కువగా కోరియున్నాడు. 2 రాజులు 2:1-10లో ఈ విషయములో ఏలియా ఎలీషాను ఏ విధముగా పరీక్షించాడో చదువుతాము. తాను ముందుకు వెళ్ళిపోవుచూ ఎలీషాను గిల్గాలు యొద్ద ఉండమని చెప్పాడు కాని ఏలీయాను విడిచిపెట్టుటకు ఎలీషా నిరాకరించాడు. అప్పుడు ఏలీయా తూర్పున 15 మైళ్ళ దూరమున ఉన్న బేతేలు మరియు తిరిగి 12 మైళ్ళు వెనక్కు యెరికోకు తీసుకువెళ్ళి మరియు తూర్పున 5 మైళ్ళ దూరమున ఉన్న యొర్ధానుకు తీసుకువెళ్ళి ఎలీషా యొక్క పట్టుదలను మరియు ఆసక్తిని పరీక్షించాడు. చివరిగా ఏలీయా తన యొద్దనుండి వెళ్ళిపోయేముందుగా నీకు ఏమైనా కోరిక ఉంటే అడగమని చెప్పాడు. అప్పుడు ఎలీషా ఇట్లన్నాడు నాకు ఒక్కటి కావాలి. దాని కొరకే నేను ఇంతకాలము వెంబడించియున్నాను. అందువలన నీవు నన్ను విడిచిపెట్టాలని కోరినను నేను నిన్ను విడిచివెట్టలేదు. నీకు కలిగిన ఆత్మలో రెండుపాళ్ళు నా మీదికి వచ్చునట్లు చేయుము. ఎలీషా పూర్ణహృదయముతో అభిషేకాన్ని కోరాడు దానికంటే తక్కువదానితో అతడు తృప్తిపడదలచుకోలేదు మరియు అతడు అడిగినదానిని పొందుకొనియున్నాడు.

మనము పరిశుద్ధాత్మయొక్క పరిపూర్ణ అభిషేకముకంటే తక్కువదానితో తృప్తిపడతామేమో అని ఏలియా ఎలీషాను పరీక్షించినట్లు దేవుడు కొన్నిసార్లు మనలను నడిపిస్తాడని నేను నమ్ముచున్నాను. మనము దానికంటే తక్కువ దానితో తృప్తిపడినట్లయితే మనము అంతవరకే కలిగియుంటాము. అభిషేకము లేకుండానే నేను జీవించగలనని తలంచి మరియు తృప్తిపడే విశ్వాసులకు దేవుడు అభిషేకాన్ని ఇవ్వడు. "ఓ ప్రభువా ఈ ఆశీర్వాదమును నీవు నాకు అనుగ్రహించేవరకును నేను నిన్ను విడువను అని పెనూయేలు దగ్గర యాకోబు ప్రార్థించినట్లును మరియు ఎలీషా దానిని పొందేవరకు ఏలీయాను వెంబడించినట్లును అన్నిటికంటే ఎక్కువగా మనము పరిశుద్ధాత్మ శక్తికొరకు అనగా పునరుత్థానశక్తి కొరకు దప్పిగొన్నట్లయితే మనము దానిని పొందెదము. అప్పుడు మనము దేవునితోను మరియు ప్రజలతోను పునరుత్థానశక్తిని కలిగి నిజమైన ఇశ్రాయేలుగా ఉండెదము.

ఈ అభిషేకము మనకు ఎంత అవసరమో మనము ఎరుగునట్లు మన జీవితములో మనము ఓటమిని మరియు నిరాశను దేవుడు అప్పుడప్పుడు అనుమతిస్తాడు. మనము సువార్తీకరణ సిద్ధాంతము కలిగి మరియు మనలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నప్పటికినీ, దేవునియొక్క ఆత్మ, శక్తితో మనమీద ఉండడం యొక్క అవసరతను మనము తెలుసుకొనవలెనని దేవుడు కోరుతున్నాడు. అభిషేకమును కలిగియుండుట సులభముకాదు. ఎలీషా ఏలీయాను అడిగినప్పుడు "నీవడిగినది చాలా సులభమని అతను చెప్పలేదు. ఇక్కడ మోకరించుము మరియు నా చేతులు నీ తలమీద ఉంచినట్లయితే నీవు అభిషేకమును పొందెదవు అని చెప్పలేదు". "నీవు అడిగినది చాలా కష్టమైనది" అని ఏలియా ఎలీషాతో చెప్పాడు. నిజమే ఇది కష్టమైన విషయమే దీనికొరకు మనము వెల చెల్లించాలి. దీనికొరకు మనము లోకములో ఉన్నదంతటిని విడిచిపెట్టుటకు సిద్ధముగా ఉండాలి.

మనము జయకరమైన క్రైస్తవపరిచర్యకంటెను, పేరుప్రతిష్టలకంటెను, సుఖసౌక్యములకంటెను మరియు సిరికంటెను అధికముగా అభిషేకాన్ని పొందుటకు కోరాలి. ఇది కష్టమే కాని దాహముగొనుట అనగా ఇదియే. మనము ఆ స్థితికి వచ్చినప్పుడు మనము ప్రభువైనయేసు వద్దకు వెళ్ళి త్రాగవచ్చును. అప్పుడు లేఖనము చెప్పినట్లు మనలోనుండి జీవజలనదులు అనేకదిశలలోనికి ప్రవహించి, ప్రవహించిన ప్రతిచోట మరణమునకు బదులు జీవాన్ని తెస్తుంది (యోహాను 7:37-39, యెహేజ్కేలు 47:8, 9). మనము అభిషేకమును పొందుకొని ఉన్నప్పుడు, ఎట్టి పరిస్థితులలోను దానిని పోగొట్టుకొనకుండుటకు జాగ్రత్తపడాలి. మనము జాగ్రత్తగా లేనట్లయితే మనము కలిగియున్న అభిషేకమును కొల్పోవచ్చును. ఇప్పుడు మనము కనికరము లేకుండా తీర్పు తీర్చుచూ లేక వ్యర్థముగా మాట్లాడుచు లేక అపవిత్రమైన తలంపులు కలిగి జీవిస్తూ, గర్వము లేక ధ్వేషమును మన హృదయములలో పోషించుచు జీవిస్తున్నట్లయితే అభిషేకం పోతుంది. 1 కొరంథీ 9:27లో తాను పౌలు ఇతరులకు ప్రకటించిన తరువాత తానే బ్రష్టుడనైపోదునేమో అని తన శరీరమును నలగగొట్టి, దానిని లోబరుచుకుంటున్నాను అని చెప్పుచున్నాడు. ఇక్కడ అతడు తన రక్షణపోతుందని కాదుకాని అభిషేకమును కోల్పోయే అవకాశముందని చెప్తున్నాడని నేను నమ్ముచున్నాను. అనేక అద్భుతములు చేసి మరియు దేవుని చేత బహుగొప్పగా వాడబడి మరియు అనేక స్థానిక సంఘములు నిర్మించినప్పటికినీ తాను జాగ్రత్తగా లేనట్లయితే అభిషేకం పోగొట్టుకొనే అపాయములో ఉన్నానని పౌలు చెప్పినదానిని బట్టి నేను ఆశ్చర్యపడుతుంటాను. అయితే మన సంగతి ఏమిటి? మనము ఎల్లప్పుడు ఈ విధముగా ప్రార్థించాలి, "ఓ యేసుప్రభువా, నా జీవితములో నేను ఏది పోగొట్టుకొనినప్పటికి నీ అభిషేకాన్ని పోగొట్టుకొననివ్వవద్దు".

2) పవిత్రమైన ఉద్దేశ్యము కలిగియుండుట

ఎలీషా అభిషేకింపబడుటకు పవిత్రమైన ఉద్దేశ్యమే రెండవ కారణము. దేవుడు మహిమపరచబడుటయే తన యొక్క గురి అని మాటలలో చెప్పబడనప్పటికిని అతడి జీవితాన్ని గురించి చదివినప్పుడు స్పష్టమౌతుంది. దేవుని ప్రజల మధ్య గొప్ప అవసరత ఉన్నది మరియు దేవుని నామముపై ఉన్న నింద ఏలియాను బాధపరచినట్లు తనను కూడా బాధపరచింది. దేవునియొక్క మహిమకరమైన నామముయొక్క నింద ఆ దేశములో తీసివేయుటకు దేవుని కొరకు చేయవలసిన పరిచర్య నిమిత్తము అతడు అభిషేకాన్ని కోరాడు. అపవిత్రమైన మరియు స్వార్థముతో కూడిన ఉద్దేశ్యాలను బట్టి అనేకమంది దేవుని బిడ్డలు అభిషేకాన్ని పొందుటలేదు. బాహ్యజీవితము సరిగా ఉండుటను బట్టి అనేకమంది క్రైస్తవులు సంతోషముగా ఉన్నారుకాని దేవుడు మన అంతరంగములో సత్యమును కోరుచున్నాడు. మన సొంతమహిమను వెదకుచున్నామా లేక దేవుని మహిమను వెదకుచున్నామా అని దేవుడు చూచుచున్నాడు. ఈనాడు మన దేశములో దేవుని నామము నిందించబడినప్పుడు మనము బాధపరచబడుచున్నామా లేదా అని ఆయన చూచుచున్నాడు. దానిని బట్టి మనము గాయపరచబడి మరియు మన హృదయములలో భారములేనట్లయితే దేవుడు మనలను ఎన్నడూ అభిషేకించడని నేను నమ్ముచున్నాను. యెహేజ్కేలు 9:1-6లో దేవుడు కొందరిని తన సొత్తయిన ప్రజలుగా చేసుకున్నాడని చదువుతున్నాము. దేవుని ప్రజలలో ఉన్న పాపమును చూచినప్పుడు ఏడ్చి మరియు దు:ఖించిన వారిని తనకొరకు ఏర్పరచుకున్నాడు. ఎవరైతే దేవుని నామము గురించి మరియు ఆయన నామ మహిమను వెదకుతారో అటువంటి శేషించిన వారిని ఆయన అభిషేకిస్తాడు.

3) ఈ లోకమును ప్రేమించకుండుట

లోకమును ప్రేమించకుండుటయే ఎలీషా అభిషేకింపబడుటకు మూడవ కారణము. నయమానుతో అతడు వ్యవహరించిన విధానము దీనిని ఋజువుచేయుచున్నది. అతడు అద్భుతము చేసినప్పుడు నయమాను అతనికి ధనము ఇచ్చినప్పుడు అతడు తిరస్కరించాడు. ప్రభువుయొక్క పరిచర్యలో తన స్వంతమును కోరలేదు మరియు అతడు సిరిని మరియు లోకమును ప్రేమించలేదు. మరొక ప్రక్కన గెహజీ దీనికి వ్యతిరేఖంగా ఉన్నాడు. ఎలీషా ఏలియా క్రింద ఉన్నట్లే ఇతడు ఎలీషా క్రింద ఉన్నాడు. ఎలీషా ఏలియానుండి రెండు పాళ్ళ ఆత్మనుపొంది మరియు ఏలియా పరిచర్యను కొనసాగించగా నిశ్చయముగా గెహజీ కూడా ఎలీషా ఆత్మను పొందుకొని మరియు ఎలీషా యొక్క పరిచర్యను కొనసాగించి ఉండెడివాడు. కాని అతడు అభిషేకాన్ని పొందలేదు కాని కుష్టిరోగాన్ని పొందియున్నాడు. ఎందుకనగా దేవుడు తన హృదయాన్ని చూసాడు. అతడు బాహ్యముగా ఆత్మీయుడుగా కనపడినప్పటికినీ, అతడు సొంత లాభాన్ని కోరే హృదయాన్ని కలిగియున్నాడు. మొదటిగా అతడు ప్రభువు పరిచర్యను నిష్కపటముగా ఆరంభించియుండవచ్చును కాని త్వరలోనే తన సొంత లాభము గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అతడు సిరిని మరియు అభిషేకాన్ని రెండిటిని ఆలోచించడం మొదలుపెట్టాడు అతడు సిరిని మరియు అభిషేకాన్ని రెండింటిని పొందుకొనవచ్చు అనుకున్నాడు. కాని అతను పొరపాటుపడ్డాడు. ఇదే పొరపాటును అనేకమంది క్రైస్తవ పరిచారకులు చేశారు. దేవుడు మనకిచ్చిన స్థానాన్ని బట్టిగాని లేక సంఘములో ఇచ్చిన పరిచర్యను బట్టిగాని లేక క్రైస్తవ సంస్థలలో గాని సొంతలాభమును కోరుకొనుటనుండి దేవుడు మనలను విడిపించును గాక.

అభిషేకమును పొందుకొని మరియు ఈ పునరుత్థానశక్తిని ఎల్లప్పుడు కలిగియుండుటకు వెల చెల్లించుకు ఇష్టపడే శేషించిన స్త్రీ పురుషుల కొరకు ఈనాడు మన దేశములో ఆయన ఆత్మతో అభిషేకించుటకు చూచుచున్నాడు.

మన దేశములో అభిషేకము మాత్రమే శత్రువు యొక్క కాడిని విరగగొట్టగలదు (యెషయా 10:27). ప్రభువైనయేసు యొక్క నామము మనకు అప్పగింపబడియున్నది. కాని మనము అభిషేకాన్ని కలిగియున్నామా?. మన జీవితములోను మరియు మన పరిచర్యలోను పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుటకును తద్వారా దేవుడు మహిమ పరచబడి, ఆయన చిత్తము నెరవేరి మరియు ఆయన రాజ్యము వచ్చునట్లు మనము దాహము కలిగియుందుము గాక.