వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము
WFTW Body: 

పౌలు కొరింథీలోని సంఘమునకు ఈ విధముగా వ్రాసెను, "మీరు క్రీస్తుయొక్క శరీరమైయుండి వేరు వేరుగా అవయవములైయున్నారు" (1 కొరింథీ 12:27). విశ్వాసులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరమైయున్నామనే సత్యమును ఎఫెసీలో ఉన్న క్రైస్తవులకు పౌలు వ్రాశాడు. సంఘమునకు క్రీస్తు శిరసైయున్నాడు మరియు ఆయన సంఘము ఆయన యొక్క శరీరమైయున్నది (ఎఫెసీ 1:23). ప్రతి విశ్వాసి శరీరములో ఒక ఆవయవమైయున్నాడు. ఎఫెసీ 4:1-2 లో ఈ విధముగా చదివెదము, "కాబట్టి, మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచుండవలెను. దేవుడు మనలోని సంపూర్ణ వినయము, సాత్వీకమును మరియు దీనత్వమును చూచుచున్నాడు. ఎఫెసీ 4:2 లో ప్రేమతో ఒకరి పొరపాట్లను ఒకరు సహించుచుండవలెనని వ్రాయబడెను. సంఘములో ఎవరును పరిపూర్ణులును కారు, ప్రతి ఒక్కరు పొరపాట్లను చేసెదరు కాబట్టి సంఘములోని ఇతరుల పొరపాట్లను సహించవలెను. మనము ఒకరినొకరము ప్రేమించుచున్నాము గనుక, ఒకరినొకరి పొరపాట్లను క్షమించెదము. "నీవు ఏదైన పొరపాటు చేసినట్లయితే, నేను దానిని క్షమించి కప్పిపుచ్చెదను. నీవు దేనినైనను విడిచిపెట్టినట్లయితే, నేను దానిని చేసెదను". క్రీస్తు యొక్క శరీరము ఈవిధముగా పని చేయవలెను. ఎఫెసీ 4:1 లో ఆత్మ కలిగించు ఐక్యమును సమాధానమను బంధముచేత కాపాడవలెను. పౌలు యొక్క పత్రికలో ఐక్యత ప్రాముఖ్యమైయున్నది. సంఘములో దీనిని గురించే ప్రభువు భారము కలిగియున్నాడు, క్రీస్తు యొక్క శరీరములో ప్రతి ఒక్కరు, శిరసైయున్న క్రీస్తునకును మరియు సంఘములోని ఇతరులతోను సన్నిహిత సంబంధము కలిగియుండవలెను. తండ్రి కుమారులు ఐక్యత కలిగియున్నట్లే మనము కూడా ఐక్యతలో ఎదుగవలెను (యోహాను 17:21-23).

ఎఫెసీ 4:16 లో పౌలు చెప్పినట్లు, "ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి, తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయచుండగా ప్రతి కీలువలన గలిగిన బలముచేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది". ఇక్కడ కీళ్ళు సహవాసము గురించి చెప్పుచున్నవి. ఒక్క చేతిలో ఎన్ని కీళ్ళు ఉండునో చూడుము, భుజము దగ్గర ఒక్కటి, మొచేయి దగ్గర మరియు ప్రతి వ్రేళ్ల దగ్గర ఒక్కటి చొప్పున మొత్తం 17 కీళ్ళు ఉన్నవి. ఈ కీళ్ళు మన చేతులు సులభముగా పని చేయుటకు ఉపయోగపడును. నీ చేయి పై భాగము బలముగా ఉండి మరియు క్రింది భాగము బలహీనముగా ఉండి మరియు మొచేయి గట్టిగా ఉన్నట్లయితే చేతితో మనము ఏమియు చేయలేము. కాబట్టి కేవలము బలము ఉన్నంత మాత్రమున ఉపయోగములేదు కానీ కీళ్ళు కూడా పని చేయవలెను. దీనిని క్రీస్తు యొక్క శరీరమునకు అన్వయించెదము. ఇక్కడ బలమైన ఒక మంచి సహోదరుడు ఉన్నాడు. మరియు చేతి క్రింది భాగమున మరియొక మంచి సహోదరుడు ఉన్నాడు. వారు ఇద్దరు కలిసి సహవాసము చేయలేరు క్రీస్తు శరీరములో ఈ విషయము బాధాకరమైయున్నది. దీనిని మానవ శరీరములో కీళ్లనొప్పులు అని పిలవబడును మరియు ఇది చాలా బాధాకరముగా ఉండును. అనేక స్థానిక సంఘములు కీళ్లనొప్పులు కలిగి ఉన్నవి. మన యొక్క కీళ్లు సరిగా పని చేసినప్పుడు, శబ్దము రాదు. కాని మన శరీరములో కీళ్ల నొప్పులు ఉన్నట్లయితే, మనము కదిలించినప్పుడు శబ్దము వచ్చును. కొంతమంది విశ్వాసుల యొక్క "సహవాసము" ఆ విధముగానే ఉండును కానీ కీళ్ళు సరిగా పనిచేసిన యెడల, శబ్దమే రాదు. ఇతరులతో మన యొక్క సహవాసము ఆ విధముగా ఉండవలెను. ఒక్కవేళ ఆ విధముగా ఈ సహవాసము లేనట్లయితే, కీళ్లనొప్పులకు చికిత్స చేయవలెను. నీ స్వజీవమునకు చనిపోయినప్పుడు నీవు స్వస్థత పొందెదవు మరియు ఇతరులతో నీ సహవాసము మహిమకరముగా ఉండును. క్రీస్తు శరీరములో ఇదియే దేవుని చిత్తము.

పాత నిబంధనలోని దేవుని ప్రజలు అనగా యూదులు ఒక్క శరీరము అగుట అసాధ్యము. ప్రభువైనయేసు పరలోకమునకు ఆరోహణమై మరియు మనలో నివసించుటకు పరిశుద్ధాత్మను కుమ్మరించెను. ఇప్పుడు, ఇద్దరు ఒక్కటి అవ్వగలరు. పాత నిబంధనలోని ఇశ్రాయేలీయులు ఒక సమాజమైయున్నారు. ఆ దేశము ఎంతో విస్తరించినప్పటికిని, అది సమాజము మాత్రమే. క్రీస్తు శరీరములో పరిమాణము కాదుగాని ఐక్యత ప్రాముఖ్యమైయున్నది. ఇటువంటి సంఘమును కనుగొనుట చాలా కష్టము. ప్రతి స్థలములో సమాజమునే చూచుచున్నాము గానీ ఐక్యతను చూచుటలేదు. వారియొక్క నాయకులలోనే వివాదములు, అసూయలు మరియు పోటితత్వము ఉన్నవి. ప్రపంచమంతట అనేక స్థలములలో క్రీస్తు శరీరము వ్యక్తపరచబడాలని దేవుని యొక్క ఉద్దేశ్యము.

క్రీస్తు శరీరములో, వరములు లేకపోయినప్పటికిని ప్రతి ఒక్కరు విలువైనవారు. అతడు క్రీస్తు శరీరములో అవయవమైయున్నాడు గనుక విలువైనవాడు. నిజానికి దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి, శరీరమును అమర్చియున్నాడని వాక్యము చెప్పుచున్నది (1 కొరింథీ 12:24,25). సంఘములో దేవుని యొక్క మాదిరిని అనుసరించి ఒక్క వరము కూడా లేకపోయినను, దేవునియెడల భయభక్తులు కలిగియున్నయెడల అతనిని గౌరవించెదము. కాని బబులోనులో బోధించే వరము ఉన్న వ్యక్తిని, పాటలు పాడే వరము ఉన్న వ్యక్తిని రక్షణపొందిన వ్యోమగామిని కాని గౌరవించెదము. కాని సంఘములో (దేవుని గుడారములో) దేవుని యెడల భయభక్తులు గలవారిని గౌరవించెదము (కీర్తనలు 15:1,4). ఆ విధముగా బబులోనునుండి బయటకు వచ్చి మరియు యెరూషలేమును నిర్మించవలెనని ఈనాడు దేవుడు మనలను పిలుచుచున్నాడు (ప్రకటన 18:4).

మనము క్రీస్తు యొక్క శరీరము చూచినయెడల, మనలో అసూయ కొంచెము కూడా ఉండదు. మానవ శరీరములో, పాదము పాదమైయున్నందుకు బాధపడదు. అది పాదముగా ఉండుటను ఇష్టపడునుకాని చెయ్యిగా ఉండవలెనని కోరదు. అది పాదముగా ఉండుటను బట్టియే తృప్తిపడును. దేవుడు తనను పాదముగా చేయుట ద్వారా తప్పు చేయలేదని అది ఎరుగును. పాదముగా ఉండుటకే సంతోషపడును. చెయ్యి చేసే దానిని తాను చేయలేకపోయినప్పటికిని, దానిని బట్టి సంతోషించును కాబట్టి క్రీస్తు శరీరము చూచిన వారు కూడా ఆ విధముగానే ఉండెదరు. నీవు వేరే వారి మీద ఆసూయపడినయెడలను, వేరేవారిని దేవుడు బహుగా వాడుకొనునప్పుడు నీవు సంతోషించనయెడల, నీవు ఈ సత్యమును అర్థము చేసుకొనలేదని తెలుపుచున్నావు. శిరస్సుతో సన్నిహిత సహవాసము కలిగిన ఏవరైనను ఇతరులు ఘనపరచబడినప్పుడు సంతోషించెదరు (1 కొరింథీ 12:26).

1 సమూయేలు 18:1-8 లో యోనాతాను దావీదుతో నిబంధన చేసెనని చదివెదము. క్రీస్తు యొక్క శరీరములో ఇటువంటి నిబంధన కలిగిన సంబంధము కలిగియుండుట ఎంతో మనోహరముగా ఉండెను. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. క్రీస్తు శరీరములో కూడా ఎటువంటి అపార్ధములైనను లేక అసూయలైనను లేక అనుమానించుటగాని లేకుండా మనము ఒక్కటిగా ఉండుటకు పిలువబడియున్నాము. లేనట్లయితే సాతాను మనలను విభజించును. ఎల్లప్పుడు మనము స్వజీవమును ఉపేక్షించుకొననట్లయితే ఇటువంటి నిబంధనలో ప్రవేశించుట అసాధ్యము.

క్రీస్తు శరీరములో వివిధమైన వ్యక్తులు ఉండెదరు, మన యొక్క అనేక స్వభావములను మరియు అనేక వరములను కలిగిన మనలను సమతుల్యత కలిగిన క్రీస్తును లోకమునకు బయలుపరుచుటకు దేవుడు ఉపయోగించును. ఇతరులు చేయలేని పరిచర్యను మరియు నీవు ఒక్కడివి మాత్రమే చేయగలిగిన పరిచర్యను దేవుడు నీకిచ్చును. కానీ ఆ పరిచర్య ఒక్కటే సమతుల్యత కలిగి ఉండదు. శరీరములోని ఇతరులు చేసే పరిచర్యకు సహకరించినప్పుడే, అది సమతుల్యత కలిగియుండును. ఆ విధముగా మనము ఇతరుల మీద ఆధారపడుట ద్వారా దేవుడు మనలను దీనులుగా చేయును. ప్రభువుకు స్తోత్రము.

ప్రభువైనయేసు తండ్రికి కేవలము దశమభాగము ఇచ్చుటకు భూమిమీదకు రాలేదు. క్రొత్త నిబంధనను స్థాపించి మరియు క్రొత్త నిబంధన సంఘమును నిర్మించుటకు ఆయన వచ్చియున్నాడు. కాబట్టి ఆయన తండ్రికి 100% ఇచ్చియున్నాడు మరియు "నన్ను వెంబడించుడి" అని మనకు చెప్పుచున్నాడు. మనము ఎంత వెలయైనను చెల్లించి అనగా మన ధనముగాని, మన ఘనతగాని, మన సౌకర్యములుగాని, మన శారీరక శక్తిగాని, మనకున్న గుర్తింపుగాని, మనయొక్క ఉద్యోగముగాని లేక మరిదేనినైనను వెచ్చించి క్రీస్తు యొక్క శరీరమును నిర్మించుటకు మనము ఇష్టపడవలెను. ప్రభువుకొరకు దేనినైనను సుఖసౌకర్యములను కోరకూడదు. క్రీస్తు యొక్క శరీరము నిర్మాణముకొరకై మనము సమస్తము చేయవలెను. మనము ఆర్ధిక విషయములలో కూడా సంఘములో ఇతరులకు భారముగా ఉండకుండుటకు భూసంబంధమైన పనులను చేయుదుము.