వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము శిష్యులు
WFTW Body: 

ప్రభువైన యేసు పరలోకానికి ఆరోహణమైన తరువాత సంఘానికి ఆయన వరములను ఇచ్చాడు. ప్రజలే ఆ వరములు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుపుటకును ఆయన కొందరిని అపోస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను, కొందరిని ఉపదేశకులనుగాను నియమించెను (ఎఫెసీ 4:13). విశ్వాసులు అందరు క్రీస్తు శరీరంగా నిర్మించబడు నిమిత్తము వీరికి వరములు ఇవ్వబడినవి అని గమనించుట చాలా ముఖ్యం. వీరు తమంతట తాము సంఘమును నిర్మించలేరు. విశ్వాసులు క్రీస్తు శరీరంగా నిర్మించబడుటకు వీరు సహకరిస్తారు. క్రీస్తు శరీరంగా నిర్మించబడుటలో ప్రతి విశ్వాసి పాలుపొందాలి. కాని ఇటువంటి పరిచర్య ఈనాడు చాలా తక్కువగా చూస్తున్నాము.

వరము పొందిన వారిలో అపొస్తలులు మొదటివారు. వీరు మొదటిగా ఉన్న 12 మంది కాదు ఎందుకనగా ప్రభువైన యేసు పరలోకానికి అరోహణమైన తరువాత వారికి ఆ వరములను అనుగ్రహించాడు. అపొస్తలుల కార్యములలో పౌలు మరియు బర్నబాలు ఇద్దరు అపొస్తలులుగా ఉండుటకు పిలువబడ్డారు అని చదువుతాము. మరియు ప్రకటన 2:2లో ఆసియలో 12 మంది అపొస్తలులలో ఒకరు అయిన యోహాను మాత్రమే ఉన్నప్పటికి అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించిరి అని చదువుతాము. అనగా ఆ సమయంలో నిజమైన అపొస్తలులు ఉన్నారని రుజువు అవుచున్నది. లేనట్లయితే వారు అపొస్తలులను పరీక్షించవలసిన అవసరం లేదు. ఈనాడు కూడా అపొస్తలులు ఉన్నారు. లేఖనములను వ్రాసినవారు మాత్రమే అపొస్తలులు కాదు. 12 మంది అపొస్తలులలో అంద్రెయ మరియు ఇతరులు లేఖనములను వ్రాయలేదు. అపొస్తలులు కాకపోయినప్పటికిని మార్కు మరియు లూకా లేఖనములను వ్రాసారు. ఒక ప్రత్యేకమైన పని నిమిత్తము దేవుని చేత పంపబడినవారే అపొస్తలులు. అపొస్తలులు అనగా పంపబడినవారు (ఒక ప్రత్యేకమైన సమయములో ఒక ప్రత్యేకమైన స్థలానికి దేవుని చేత పంపబడిన మనుష్యుడు). వారు అనేక స్థలములలో స్థానిక సంఘములను నాటి మరియు అక్కడ సంఘ పెద్దలను నియమించెదరు. ఆ పెద్దలకు అపొస్తలులు పెద్దలైయుండి వారిని నడిపిస్తూ, సంఘములోని సమస్యలను పరిష్కరిస్తూ మరియు వారిని సంపూర్ణులగుటకు నడిపిస్తారు. ఒక అపొస్తలుడు ఒక స్థానిక సంఘంలో ఉన్నప్పటికి, ఆ సంఘ సభ్యుల మీద అతనికి ఎటువంటి బాధ్యత ఉండదు. సంఘపెద్దల విషయంలో అతను బాధ్యత కలిగియుంటాడు.

తరువాత ప్రవక్తలు. వీరును సమస్యలను పరిష్కరించే విషయంలో వివేచన కలిగియుంటారు. వీరు మంచి డాక్టరువలె ఉండి రోగి యొక్క రోగాన్ని గుర్తించి, దానికి సరియైన మందు ఇచ్చి లేక ఆపరేషన్ చేయుట ద్వారా కేన్సర్‍ను తీసివేసి స్వస్థపరిచెదరు. ప్రతి సంఘములోని కేన్సర్‍అనే పాపాన్ని వారు బయలు పరుస్తారు. గనుక వారికి పెద్దగా గుర్తింపు ఉండదు. వారు చెప్పే పరిష్కారానికి చాలామంది సంతోషించరు. వారి అంతరంగంలో ఉన్న పాప స్థితిని వారికి ప్రవక్తలు చెప్పినప్పుడు అనేకమంది విశ్వాసులు సంతోషించరు. కాని ఒక స్థానిక సంఘములో ఇది ఒక ముఖ్యమైన పరిచర్య. ఒక సంఘము ఆత్మీయ జీవాన్ని సమృద్ధిగా పొందుటకు, ప్రతి మీటింగులో దానిలో ఉన్న పాపాన్ని చూపించే ప్రవక్త ఉండుట మంచిది. అప్పుడు ప్రజలలో ఉన్న రహస్య పాపములు బయలుపరచబడి మరియు దేవుడు ఆ కూటములో ఉన్నాడని చెప్పుచు మరియు దేవుని వైపు తిరిగెదరు (1కొరంథీ 14:24, 25). ఇక్కడ నేను ప్రజలకు ఎక్కడకు వెళ్ళాలో లేక ఎవరిని పెళ్ళి చేసుకోవాలో లేక తీర్పును గూర్చి భయపెట్టే అబద్ధ ప్రవక్తల గూర్చి చెప్పుట లేదు. అది నకిలీ ప్రవచనము. ఇలాంటి ప్రవచనము చెప్పుటను గురించి క్రొత్త నిబంధనలో అసలు చూడము. పరిశుద్ధాత్మను కలిగిన పాత నిబంధన ప్రవక్తలు చేసే పరిచర్య. కాని ఈనాడు ఆవిధంగా చేయకూడదు.

తరువాత సువార్తికులు. సువార్త కూటములు ద్వారాగాని లేక వ్యక్తిగతముగా సువార్త చెప్పుట ద్వారా గాని సువార్త వినని వారికి సువార్తను చెప్పి ప్రభువుయొద్దకు ఇతరులను నడిపించే విశ్వాసులు. శరీరములోని చెయ్యి ఒక రొట్టెముక్కను తీసుకొని (అవిశ్వాసికి సాదృశ్యం) మరియు నోటిలో వేయువాడివలె సువార్తికుడు ఉంటాడు. ఒక ప్రవక్త పళ్ళవలె ఉండి ఆ రొట్టెను నమిలి, చిన్నదిగా చేసి మరియు కడుపులో రసాయనం వలె ఉండి శరీరంలో కలిపే వాటివలే ప్రవక్త ఉంటాడు. రొట్టె ముక్కను తీసుకొని నోటిలో వేసే పరిచర్య, రసాయనాలు పోసి పిండిగా చేసే పరిచర్య కంటే ఎక్కువగా గౌరవించబడుతుంది. కాని ఆ రొట్టె ముక్క శరీరంలో కలిసిపోయి ఏకమగుటకు ఈ రెండు పరిచర్యలు అవసరము. కాబట్టి సువార్తికుడు, ప్రవక్తలు కలిసి పనిచేయాలి.

తరువాత కాపరులు. 'కాపరి' అను మాట క్రొత్తనిబంధనలో 29 సార్లు వచ్చింది. కాని ఇక్కడ మాత్రం పాదిరి (పాస్టర్) అని తర్జుమా చేశారు. క్రైస్తవ్యంలో ఈ పరిచర్యను గురించి ఎంతో కలవరము ఉన్నది. కాపరులు గొఱ్ఱెలను చూచుకొనేవారైయుండి మరియు అవి ఆకలి గొనినప్పుడు లేక గాయపరచబడినప్పుడు వాటి గూర్చి జాగ్రత్త వహిస్తారు. ఒక కాపరి గొఱ్ఱెపిల్లలు వృద్ధి పొంది పెద్దవి అగునట్లు వాటిని మోసి, మంచి ఆత్మీయ ఆహారంతో పోషించి, అది ఆత్మీయ పరిణితి చెందునట్లు వాటితో సహకరిస్తాడు. ప్రతి సంఘానికి ఒక కాపరియే కాదు కాని అనేక కాపరులు అవసరం. ప్రభువైన యేసు 12 మందికి కాపరిగా ఉన్నాడు. ఒక స్థానిక సంఘములో 120 మంది ఉన్నట్లయితే అక్కడ 12 మంది కాపరులు అవసరం. నేను పూర్తి కాలపు పరిచర్య చేసే వారి గూర్చి చెప్పుట లేదు. వారికంటే చిన్నవారిని కాపరివంటి హృదయంతో జాగ్రత్త వహించేవారి గురించి చెప్పుచున్నాను. వారు ఉద్యోగమును చేసుకుంటూనే, సంఘములో వారి కంటే చిన్నవారిని ప్రోత్సహించవచ్చును. 25 సంవత్సరములు ఉన్న వ్యక్తి 20 సంవత్సరములలోపు వయస్సు ఉన్న వారిని ప్రోత్సహించి వారికి కాపరిగా ఉండవచ్చును. వారు సంఘములోని పెద్దలకు గొప్ప సహాయకులుగా ఉండగలరు. సంఖ్యలో సంఘం విస్తరించేకొలది అక్కడ ఇటువంటి కాపరులు అవసరము. ఒక స్థానిక సంఘంలో వేలసంఖ్యలో సభ్యులు ఉండుట దేవుని చిత్తం కాదు. కాని క్రీస్తు శరీరమనే స్థానిక సంఘములు తండ్రివంటి హృదయం గల కాపరులు కలిగియుండి చిన్న సంఘములు అయియుంటాయి. పెద్ద పెద్ద సంఘములు కేవలం వినోదము కొరకును మరియు జ్ఞానము పొందుటకును, బోధించే కేంద్రములై యుండును. కాని వారు జీవములోను, కృపలోను ఎదుగరు. అటువంటి సంఘ నాయకులు మంచిగా నడిపించే వారైయుండి కేవలము బోధకులుగా ఉంటారు. కాని వారు కాపరులు కాదు.

చివరిగా, ఉపదేశకులు ఉన్నారు. వీరు దేవుని వాక్యమును సామాన్యముగా వివరించి మరియు ప్రజలకు అర్థమయ్యేటట్లు చేస్తారు. క్రైస్తత్వంలో ఈనాడు మంచి ఉపదేశకులు ఎక్కువమంది లేరు. ప్రతి సంఘానికి ఒక ఉపదేశకుడు అవసరము లేదు. 20 లేక 30 సంఘాలకు ప్రయాణించి, బోధించే ఒక ఉపదేశకుడు చాలు. ఈ రోజులలో సి.డి (క్యాసెట్), డి.వి.డీల ద్వారా, ఇంటర్ నెట్ ద్వారా ఒక ఉపదేశకుడు వందల సంఘాలకి చెప్పగలడు. సువార్తికుడు కూడా ఒక ప్రదేశములో కొందరిని క్రీస్తులోనికి తెచ్చి మరియొక ప్రదేశానికి వెళతాడు గనుక ప్రతి సంఘములో సువార్తికుడు అవసరము లేదు. కాని ప్రవక్తలు మరియు కాపరులు ప్రతి సంఘానికి అవసరమైయున్నారు.

ఈ పరిచర్యల యొక్క ఉద్దేశ్యమంతయు క్రీస్తు యొక్క శరీరమును నిర్మించుటయే. ఒక సువార్తికుడు కొందరిని క్రీస్తులోనికి నడిపించి మరియు ఎదో ఒక సంఘమునకు వెళ్ళమని చెప్పుటగాని, వారు విడిచివచ్చిన పాత మృతమైన సంఘమునకు వెళ్ళమని గాని చెప్పకూడదు. ఎఫెసీ 4వ అధ్యాయములో అటువంటి సువార్తను గురించి చెప్పబడలేదు. కాని ఈనాటి సువార్తికులు వారి పరిచర్యకు వారి పేర్లు పెట్టుకొని పరిచర్య చేయుట బాధాకరమైన విషయము. వారు కూటములు జరిగిస్తారు. మరియు ప్రజలు రక్షణ పొందుతారు. అప్పుడు వారు క్రొత్తవైన సంఘాలకు మరల తిరిగి వెళ్ళమని చెపుతారు. ఆ మృతమైన సంఘములలో వారిని సర్వ సత్యములోనికి నడిపించుటకు అక్కడ కాపరులుగాని ఉపదేశకులుగాని ఉండరు.

ఇక్కడ ఎఫెసీ 4వ అధ్యాయములో అపొస్తలులతోను, ప్రవక్తలతోను, కాపరులతోను మరియు ఉపదేశకులతోను కలిసి సువార్తికులు పని చేస్తారు. రక్షణ పొందిన వారిని సువార్తికులు మంచి కాపరులకు అప్పగించాలి. క్రీస్తు శరీరములో ఇటువంటి సహకారము అవసరము. సంఘము యొక్క ఆరంభములో ఈ విధముగా జరిగేది. ఫిలిప్పు ఒక సువార్తికుడేగాని అపొస్తలుడుగాని లేక కాపరిగాని కాదు (అపొ.కా 8వ అధ్యాయము). సమరయలోని ఇతరులు అక్కడ రక్షణ పొందిన వారిని దేవుని సత్యములోనికి నడిపించుటకు బాధ్యత వహించారు. వారికి వారే ఉండునట్లు ఫిలిప్పు వారిని అనుమతించలేదు.