WFTW Body: 

ప్రతి యౌవనస్తుడు ఎప్పుడో ఒకసారి అపవిత్రమైన ఆలోచనల చేత శోధించబడతాడు. స్త్రీలకంటే పురుషులలో ఈ లైంగిక కోరికలు ఎక్కువగా ఉంటాయి కనుక స్త్రీలకంటే పురుషులు ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. మనుష్యుల హృదయములో నుండి వచ్చే వాటిలో చెడ్డ తలంపులు మొదటివని యేసుప్రభువు మార్కు 7:21లో ప్రస్తావించారు. మార్పు చెందని వారు ఇదేవిధముగా దుష్టులుగా ఉంటారు కాబట్టి యేసుప్రభువు వివరించినది అందరి విషయములో సత్యమే. ఈ అపవిత్రమైన తలంపులు ఒక వ్యభిచారి మనస్సును ఏవిధముగా వేధిస్తాయో, నైతికముగా నిజాయితీ గల వ్యక్తిని కూడా అదేవిధముగా వేధిస్తాయి. అవకాశము లేకపోవటం మరియు సమాజం పట్ల భయము ఈ నైతిక వ్యక్తిని శరీరములో వ్యభిచారం చేయకుండునట్లు అడ్డుపడుతుంది.

శోధనకు మరియు పాపమునకు ఉన్న వ్యత్యాసమును మనం తెలుసుకోవాలి. "యేసుప్రభువు కూడా అన్ని విషయములలో మనవలె శోధించబడ్డాడు" (హెబ్రీ 4:15). కాని ఆయన ఒక్కసారి కూడా శోధనకు లోబడలేదు (తన మనస్సులో కూడా). కాబట్టి ఆయన ఒక్కసారి కూడా పాపం చేయలేదు. ఈ భూమి మీద మన చివరి రోజు వరకు మనం కూడా శోధించబడుతూనే ఉంటాము. కాని మనం పాపం చేయవలసిన అవసరం లేదు. మన మనస్సులో దురాశను గర్భం ధరించినప్పుడే మనం పాపం చేస్తాము (యాకోబు 1:15). మన మనస్సులో కలిగే దురాశకు సంబంధించిన తలంపులను మనం అనుమతించినప్పుడు ఈవిధముగా జరుగుతుంది. మనం మొదటిసారే దానిని నిరాకరించినప్పుడు మనం పాపం చేయము. ఒక పాతకాలపు ప్యురిటన్ బోధకుడు ఈవిధముగా చెప్పాడు - "నా తలమీద పక్షులు ఎగరకుండా నేను అడ్డుకోలేను గాని, నా తలమీద గూడు కట్టుకోకుండా అడ్డుకోగలను". ఒక చెడ్డ తలంపు మన మనస్సులోకి వచ్చినప్పుడు, దానిని గురించి ఒక్క క్షణమైనా మనం ఆలోచించినట్లయితే అది మన మనస్సులలో గూడు కట్టుకొనునట్లు మనం అనుమతిస్తాము. తద్వారా పాపం చేస్తాము.

ఒకసారి మోహపు ఆలోచనలలో పడిపోయినట్లయితే అది ఆ వ్యక్తిని ఇంకా ఎక్కువగా బానిసగా చేసుకుంటుంది. సమయము గడిచేకొలది విడుదల కష్టమవుతూ ఉంటుంది. మనమెంత త్వరగా విడుదల కోసం చూస్తామో అంత సులభముగా విడుదల పొందవచ్చు. చెడు తలంపుల మీద విజయం (ఇతర పాపముల మీద విజయం వలె) మన ఓటమిని యధార్థముగా ఒప్పుకొనుట ద్వారా, విడుదల కొరకు ఆకలిదప్పులు కలిగియుండుట ద్వారా, క్రీస్తుతో మన మరణమును అంగీకరించుట ద్వారా, ప్రభువుకు మన శరీరములను, మనస్సులను సంపూర్ణముగా అప్పగించుకొనుట ద్వారా వస్తుంది (రోమా 6:1-14).

మనం నిరంతరం జయమును అనుభవించాలంటే, మనం "ఆత్మలో నడుస్తూ" మనలను మనం క్రమశిక్షణలో ఉంచుకుంటూ ఆయనతో సహకరించాలి (గలతీ 5:16-18). మన కళ్ళను మరియు చెవులను క్రమశిక్షణలో పెట్టుకునే విషయంలో (లైగింక సంబంధమైన వాటిని చదవడం, చూడడం, వినటం చేయకుండుట) మనం తప్పిపోయినట్లయితే మన తలంపులను కూడా మనం క్రమశిక్షణలో పెట్టుకోలేము (మత్తయి 5:28-30 వచనముల నిజమైన అన్వయింపు అదే). మోహపు తలంపుల నుండి విడుదల పొందుటకు శరీరము యొక్క క్రమశిక్షణ అవసరమై ఉన్నది. గొప్ప పరిశుద్ధులు కూడా వారి మనస్సులలో లైంగిక సంబంధమైన శోధనలతో ఎల్లప్పుడూ యుద్ధం చేయవలసి వచ్చేదని ఒప్పుకున్నారు. జయం పొందుటకు వారి శరీరములను ఎంతో తీవ్రంగా క్రమశిక్షణలో పెట్టుకోవలసి వచ్చింది.

యోబు వివాహితుడై పదిమంది పిల్లలను కలిగి ఉన్నా కూడా తాను మోహపు తలంపుల నుండి విడుదల పొందాలంటే తన కన్నులను క్రమశిక్షణలో ఉంచుకోవాలని గుర్తించాడు. "కన్యకను మోహపు చూపుతో చూడకుండా నాకన్నులతో నేను నిబంధన చేసుకొంటిని" (యోబు 31:1). పురుషులకు గొప్ప శోధనలు కన్నుల ద్వారా కలుగుతాయి. ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండకుండా ఒక అపవిత్రమైన తలంపును గాని లేక ఒక బొమ్మను గాని మన కంటి ద్వారా మన మనస్సులోనికి అనుమతించినట్లయితే, అక్కడ నుండి దానిని తొలగించడం దాదాపు అసాధ్యము.

ప్రతిరోజు దేవుని వాక్యముతో నింపుకోవాలి - దేవుని వాక్యమును మనస్సులో నింపుకోవడం, చెడుతలంపుల నుండి మనల్ని తప్పక భద్రపరుస్తుంది. "నీ యెదుట నేను పాపం చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొనియున్నాను" (కీర్తనలు 119:11). "మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతయైనను, మెప్పైనను ఉండిన యెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యవైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి" (ఫిలిప్పీ 4:8) అని కూడా బైబిల్ చెప్తుంది.

మనచుట్టూ ఎంతో తక్కువ ప్రమాణాలతో ఉన్న నైతిక విలువలు కలిగిన ఈ ప్రపంచంలో అపవిత్రమైన తలంపుల నుండి పూర్తిగా విడుదల పొందడం ఎంతో కష్టమని కొందరంటుటారు. కాని ఇటువంటి పరిస్థితులు కేవలం 20వ శతాబ్ధంలోనే ప్రత్యేకమైనవి కావు. మొదటి శతాబ్ధంలో కొరింథు పట్టణం కూడా జారత్వమునకు, కాముకత్వమునకు కేంద్రంగా ఉన్నది. అయినా కూడా ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టవలెనని (2కొరింథీ 10:5) దేవుని ఆత్మ క్రైస్తవులను కోరాడు. ఈనాడు కూడా మనం అదేవిధంగా చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. జీవమునకు పోవు మార్గం ఇరుకైనది మరియు కష్టమైనదైనా కూడా ఆ మార్గంలో మనం నడచుటకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు.

మన జీవితాలను క్రమశిక్షణలో పెట్టుకొనుట అంటే అమ్మాయిల మీద (అమ్మాయిలు అబ్బాయిల మీద) వ్యతిరేకమైన వైఖరిని పెట్టుకొనమని కాదు. కానే కాదు. అవతలి వారు ఆకర్షణీయంగా కనబడుతున్నట్లయితే, అందులో పాపమేమి లేదు. ఇది ఎంతో సహజం. దేవుని సౌందర్యమైన సృష్టిలో బాగంగా ఒక అందమైన ముఖమును ప్రశంశించుటలో తప్పేమి లేదు. కాని పడిపోయిన జీవులముగా, మనం జాగ్రత్తగా ఉండనట్లయితే ఆ అందమును గమనిస్తూ తరువాత మోహిస్తాము. అవతలి వారిలో ఉన్న ఆకర్షణలో అపవిత్రత ఏమి లేకున్నా కూడా మనం అపవిత్రమైన తలంపులు కలిగియుండునట్లు చేయగలదు.

పరిశుద్ధాత్ముడు మనలను పరీక్షించి మన కన్నులను మరియు మన తలంపులను వేరే మార్గములోనికి త్రిప్పమని చెప్పినప్పుడు ఎప్పుడైతే మనం వెంటనే పరిశుద్ధాత్మ స్వరమునకు విధేయత చూపిస్తామో, అందులోనే మన భద్రత ఉంది. "ప్రభువా నేను జయించలేని శోధనను (ఈ విషయంలో) ఎదుర్కొనకుండునట్లు సహాయం చేయండి" అని మనం తరచుగా ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థనను యధార్థంగా చేసిన అనేకమంది యౌవనస్తులు జయమును పొందారు.