WFTW Body: 

ప్రభువైనయేసు యొక్క జీవితము ఈ ప్రపంచములో జీవించిన వాళ్ళందరి కంటే అత్యంత మధురమైనది, అత్యంత క్రమమైనది, అత్యంత సమాధానకరమైనది మరియు అత్యంత సంతోషకరమైనది. ఎందుకనగా ఆయన దేవుని వాక్యమునకు సంపూర్ణ విధేయత చూపించాడు. గ్రహములు మరియు నక్షత్రములువలె ఎక్కడైతే దేవునికి సంపూర్ణ విధేయత ఉంటుందో అక్కడ సంపూర్ణత మరియు సంతృప్తి మరియు మధురముగా వుండును. "యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట" (సామెతలు 14:27). మరియు "నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగియుండుము"(సామెతలు 23:17) అను ఆజ్ఞకు ప్రభువైనయేసు విధేయత చూపించాడు. ప్రభువైనయేసు భూమిమీద జీవించినప్పుడు, ప్రజలు ఆయనలో పరలోక జీవితమును చూశారు. ఆయనయొక్క కనికరము, ఇతరులయెడల ఆయనకున్న శ్రద్ధ, ఆయనయొక్క పవిత్రత, ఆయనయొక్క నిస్వార్ధమైన ప్రేమ మరియు ఆయనయొక్క దీనత్వము దేవునియొక్క జీవాన్ని బయలుపరచియున్నవి. దేవునియొక్క జీవమును మరియు పరలోకము యొక్క వాతావరణము ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి తెచ్చియున్నాడు. ఈ పరలోకజీవమును భూమిమీద ప్రజలకు తెలియజేయుటకు, దేవుడు భూమి మీద మనలను ఉంచియున్నాడు. రాబోయే సంవత్సరములో పరలోకము యొక్క సంతోషము, సమాధానము, ప్రేమ, పవిత్రత మరియు మంచితనము మన కుటుంబములోను మరియు మన స్థానిక సంఘములోను మనము రుచిచూడవలెనని దేవుడు కోరుచున్నాడు. భూమి మీద ప్రభువైనయేసు పరలోక జీవితమును జీవించారు. నీవు ఆయన వైపు మాత్రమే చూచుచు మరియు ఆయనను వెంబడించినయెడల, అప్పుడు ఈ భూమి మీద (నీ జీవితము) ప్రతిదినము ఒక పరలోకపు దినమువలె ఉండును.

ప్రభువైనయేసుకు తండ్రితో సహవాసము చేయుటయే అత్యంత విలువైనది. ఆయన ఈ విశ్వములో దానికంటే దేనికి ఎక్కువ విలువనివ్వలేదు. నశించిన వారికొరకు నిత్యనరకాన్ని అనుభవించుటకు సిలువమీద మూడుగంటలు తండ్రితో ఈ సహవాసాన్ని కోల్పోయాడు (మత్తయి 27:45). అప్పుడు తండ్రి ఆయనను విడిచిపెట్టియున్నాడు. మరియు నిత్యత్వము నుండి ఆయన తండ్రితో కలిగిన సహవాసమును మూడు గంటలు పాటు కోల్పోయెను. ఆ సహవాసమును కోల్పోకుండుటకు ఆయన గెత్సెమనే తోటలో ఆయన యొక్క చెమట రక్తబిందువులవలె కార్చెను. "తండ్రితో సహవాసమును పోగొట్టుకొనుట" అను గిన్నెను తొలగించమని ఆయన ప్రార్ధించెను. తండ్రితో ఆ విధముగా సహవాసమును కోరుటయే ప్రభువైనయేసును వెంబడించుట. పాపము ద్వారా తండ్రితో సహవాసాన్ని పోగొట్టుకొనెదము గనుక దానిని మరియెక్కువ పాపముగా చూచెదము. తోటివారి యెడల ప్రేమలేని వైఖరిని కూడా తీవ్రముగా తీసుకొనెదము. ఎందుకనగా అది తండ్రితో సహవాసము లేకుండా చేయును.

అన్నిటికంటె ముఖ్యముగా ప్రభువుతో సన్నిహిత సహవాసము కలిగియుండుట ద్వారానే బైబిల్‍ను అర్ధము చేసికొనగలము. దేవుని వాక్యమును పరిశుద్ధాత్ముడు మనకు వివరించును. కాబట్టి ఆదిమ శిష్యులవలె ప్రభువైనయేసుతో నడుచుచు మరియు ఆయన స్వరమును వినుటకు కనిపెట్టియుండుము. అప్పుడు వారి కన్నులు తెరవబడినట్లే మీ కన్నులును మరియు వారి హృదయములు మండినట్లే మీ హృదయములును మండును. గత అరవై ఒక్క సంవత్సరములు ప్రభువుతో నడిచిన నేను దీనినే కనుగొనియున్నాను.

మనము పుట్టకమునుపే దేవుడు మన జీవితమంతటిని ప్రణాళిక వేసెను. దావీదు ఈ విధముగా చెప్పుచున్నాడు. "నేను పుట్టక ముందే నీవు నన్ను చూచితివి మరియు నేను పుట్టకముందే నా ఒక్కొక్క దినమును ప్రణాళిక వేసితివి. నా దినములన్నియు నీ గ్రంథములో లిఖించితివి. నిరంతరము నీవు నా గురించి ఆలోచించున్నావని తెలుసుకొనుట నాకెంతో ప్రశస్తమైనది. ఒక దినములో నా గురించి ఎన్నిసార్లు ఆలోచించెదవో లెక్కించలేను మరియు నేను వేకువనే లేచినప్పుడు కూడా నీవు నా గురించే ఆలోచించుచున్నావు (కీర్తన 139:16-18 లివింగ్ బైబిల్).

నీ జీవితములోని ప్రతిదినమును దేవుడు ఎంతో ప్రణాళిక కలిగియున్నాడని ఇది బోధించుచున్నది. నీవు పుట్టకముందు అనేక లక్షల సంవత్సరాల క్రితమే నీ యొక్క తల్లిదండ్రుల గురించియు, నీవు పుట్టబోయే దేశమును గురించియు మరియు నిన్ను క్రీస్తు యొద్దకు నడిపించుటకు ఆయన నీ జీవితములో అనుమతించబోయే పరిస్థితులను గురించియు ఆయన లిఖించియున్నాడు. నీవు ఆత్మీయముగా ఎదుగుటకు ఆయన అనుమతించబోయే పరీక్షలను గురించి వ్రాసియున్నాడు. మరియు ఓటములను కూడా ఏవిధముగా తన మహిమర్ధమై మార్చునో ఆయన లిఖించెను. ఒక స్థానిక సంఘములోనికి పరలోక వాతావరణమును తీసికొనివచ్చి మరియు ఇతరుల మధ్య సహవాసమును నిర్మించే వారే ఆ సంఘములోని అత్యంత విలువైన సహోదరుడు మరియు సహోదరి మరియు వారు సంఘపెద్దలైయుండనవసరము లేదు. అటువంటి విలువైన సహోదరులుగాను మరియు సహోదరీలుగాను మారుటకు మనకందరికి అవకాశము ఉన్నది. సంఘములోని ఒక సహోదరుడుగాని సహోదరిగాని, ఒక కూటములలోనికి గాని ఒక ఇంటిలోగాని ఎప్పుడు వచ్చినను పరలోక సంబంధమైన వాతావరణము తెచ్చుటను గురించి ఆలోచన చేయుము. ఆ విలువైన సహోదరుడుగాని లేక సహోదరీగాని వారు కేవలము ఐదు నిమిషాలు మనతో గడిపినను, అది ఎంతో తాజాగా వుండును. ఆ ఐదు నిమిషాలు పరలోకమే మీ ఇంటికి వచ్చినట్లు ఉండును.

దేవుడు అబ్రాహాముతో ఇట్లనెను, "నేను నిన్ను ఆశీర్వదించెదను మరియు భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును"(ఆదికాండము 12:2,3). పరిశుద్ధాత్మ ద్వారా ఈ ఆశీర్వదమును మనము కూడా పొందుకోవచ్చును (గలతీ 3:14). నీ గిన్నె నిండి పొర్లి ప్రవహించి అనేకులకు ఆశీర్వాదముగా ఉండవలెనని ఈ సంవత్సరములో దేవుడు నిన్ను ఆశీర్వదించవలెనని కోరుచున్నాడు. ఈ సంవత్సరములో నీవు కలిసికొనబోయే ప్రతి యొక్క వ్యక్తికి నీవు ఆశీర్వదముగా ఉండవలెనని, తగిన శక్తితోను ఆశీర్వాదముతోను దేవుడు నిన్ను అభిషేకించవలెనని కోరుచున్నాడు. కాబట్టి నీవు పొందిన ఆశీర్వాదములను ఇతరుల మీద పోయుము. కాని నీవు స్వార్ధముతో దేవుని ఆశీర్వాదములు నీతోనే ఉంచుకొనినయెడల, ఒక రాత్రి ఉంచబడిన మన్నావలె కంపుకొట్టినట్లుండును. ఇతరులకు నీళ్ళు పోయువారికి దేవుడే నీళ్ళు పోయును (సామెతలు 11:25). నీ జీవితములో ఆ విధముగా జరుగునుగాక!

ఈ సంవత్సరము చాలా ఆశీర్వదించబడిన సంవత్సరముగా ఉండునుగాక.