WFTW Body: 

"ఏలయనగా మనము పోరాడునది రక్త మాంసములతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము" (ఎఫెసీ 6:12).

3500 సంవత్సరముల క్రితము, మోషే సీనాయి పర్వతము నుండి దిగివచ్చి, ఇశ్రాయేలీయులకు ఈ లోకములో ఒక రాజ్యము గూర్చి దేవుని నుండి వాగ్దానమును తీసుకువచ్చెను. కాని 2000 సంవత్సరముల క్రితము యేసుక్రీస్తు పరలోకము నుండి దిగివచ్చి, మనకు పరలోక రాజ్యము గూర్చిన వాగ్దానమును తీసుకువచ్చెను. ఇది పాత నిబంధనకు మరియు క్రొత్త నిబంధనకు మధ్య నున్న ముఖ్యమైన వ్యత్యాసము. దీనిని మనము అర్థము చేసికొనక పోయినట్లయితే, మనము సాతానుకు వ్యతిరేకముగా సమర్థవంతముగా యుద్ధము చేయలేము.

మన రాజ్యము ఈ లోకమునకు సంబంధించినది కాదు. గనుక మనము మానవులతో దేని గూర్చియైనను ఎప్పుడు పోరాడకూడదు. ఇది సమర్థవంతమైన ఆత్మీయ పోరాటములో మొట్టమొదటి అవసరత. విశ్వాసులను వారి పిలుపు నుండి ప్రక్కత్రోవ పట్టించుటకు సాతాను వాడు ముఖ్యమైన పద్దతులలో ఒకటి వారిని ఇతరులతో అనగా వారి బంధువులతో లేక వారి పొరుగు వారితో లేక వారి సహోదర సహోదరిలతో పోరాడునట్లు చేయుటయైయున్నది. మరియు ఆ పోరాటము తప్పక ఈ లోక సంబంధమైన విషయము గూర్చియైయుండును. ఆ విధముగా అతడు విశ్వాసులను వారుండిన పరలోకపు స్థానము నుండి ఈ భూమి పైకి మరియు వాటి విషయములలోనికి లాగివేయును. ఆవిధముగా వారు అతడితో పోరాటములో అసమర్ధులగునట్లు చేయును.

నీవు సాతానుతో సమర్థవంతముగా పోరాడి సంఘమును కట్టవలెనంటె, నీవు ఎప్పుడైనను మానవులతో గొడవపడనని నిశ్చయించుకొనుము. మనము ఇతరులతో మన ఆలోచనలలో కూడా ఊహల యుద్ధములు చేయకూడదు. మనకు ఏ ఒక్కరిపై కూడా ఒక్క ఫిర్యాదు కూడా యుండకూడదు. మరియు మనకు అంతరంగములో కూడా ఇతరులు ఫలానా విధముగా చేస్తే బాగుండును అను కోర్కె ఉండకూడదు. ఉదాహరణకు: ఇతరులు మనలను గౌరవముగా చూడవలెనని లేక మన గూర్చి వారు పట్టించు కొనవలెనని, లేక మన యెడల ప్రేమ చూపవలెనని లేక వారు మన నెప్పుడు మోసగించకూడదని కోర్కెలు ఉండకూడదు. మనము మన వివాహ భాగస్వామినుండి కూడా అటువంటివి ఎదురు చూడకూడదు. అటువంటి గొడవలు మరియు ఫిర్యాదులు మరియు కోర్కెలన్నియు ఒక వ్యక్తి యొక్క రాజ్యము ఈ లోకమునకు సంబంధించినదని మరియు అతడు సాతానుకు తన హృదయములో చోటు ఇచ్చెనని సూచించున్నవి. మరియు అటువంటి వారు చాలా నికృష్టమైన జీవితమును జీవించుదురు.

మనము దేవునికే లెక్క అప్పజెప్పవలసియున్నది (హెబ్రీ 4:13). మన పరిస్థితులన్నీ (ఇతరులు మనలను చూచు విషయము కూడా) మన మేలు కొరకు ఆయన కుమారుని సారూప్యములోనికి మారుట కొరకు మన ప్రేమగల తండ్రిచేత నియమింపబడెను. గనుక ఎవరిపైన కూడా దేని గూర్చియైనను ఫిర్యాదు చేయుటకు మనకు అవకాశము లేదు. కాని అన్ని వేళలా ఆయనను స్తుతించుటకే అవకాశమున్నది.