WFTW Body: 

సంఘముగా మాయొక్క పరిచర్యకు వ్యతిరేకత ఉండుటకు ముఖ్యకారణం, మేము పరిశుద్ధతను గూర్చి, నీతిని గూర్చి బోధించుటయే. మేము ప్రకటించు సత్యములు "పాపము మన మీద ప్రభుత్వము చేయదు" (రోమా 6:14), "సిరిని ప్రేమించువారు దేవునిని ప్రేమింపలేరు" (లూకా 16:13), "ఇతరులను తృణీకరించి, వారిపై కోపపడువారు నరకాగ్నికి లోనవుదురు" (మత్తయి 5:22), "ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు నరకములో పడవేయబడు ప్రమాదములో ఉన్నాడు" (మత్తయి 5:28,29) మొదలైనవి. యేసు ప్రభువు యొక్క ఈ మాటలు విశ్వాసులలో ఎక్కువమందికి ఇంపుగా ఉండవు. కాబట్టి మమ్ములను వ్యతిరేకించిరి.

మేము వాక్యానుసారము కాని జీతముకొరకు పనిచేసే క్రైస్తవసేవకుల పద్ధతికిని(మొదట శతాబ్దములో ఇటువంటి దాని గూర్చి వినలేదు) మరియు మన దేశములో క్రైస్తవపని విషయములో ఒక లక్షణంగా కనబడే వాక్యానుసారముకాని ధనమును యాచించు పద్ధతికిని వ్యతిరేకముగా నిలబడితిమి. ఇది మాకు వాక్యమును బోధించుట జీవనముగా చేసుకొని దాని ద్వారా స్వంత సామ్రాజ్యములను నిర్మించుకొను వారి ఉగ్రతను సంపాదించిపెట్టెను. మేము సంఘములో వ్యక్తులను పైకెత్తు వ్యవస్థలను, మత శాఖల సంఘవ్యవస్థను, భారతదేశపు సంఘములలో పాశ్చాత్య ఆధిపత్యాన్ని మరియు ఇక్కడి సంఘాభివృద్ధికి ఆటంకముగా ఉండే పాశ్చాత్యనాయకత్వాన్ని కూడా వ్యతిరేకించాము. ఇది మత సాంప్రదాయవాదులకు ఎంతో కోపాన్ని తెప్పించెను.

దేవుని పరిశుద్ధస్థలమును ఏదో ఒక విధముగా అపవిత్రపరచుటయే సాతాను యొక్క గురి. అతడి పక్షముగా ఉండిన "శూరులు" (దానియేలు 11:31) సంఘములో దేవునియొక్క పనిని లోపలనుండి నాశనము చేయునట్లు అతడు వారిని సంఘములో ప్రవేశపెట్టును. ఈ శూరులు గత 20 శతాబ్దాలుగా ఎట్లు ఒక గుంపు తర్వాత మరొక గుంపును, ఒక ఉద్యమము తర్వాత మరొక ఉద్యమమును పాడుచేసిరో క్రైస్తవ సంఘ చరిత్ర మనకు తెలియజేస్తుంది.

సంఘముయొక్క వైఫల్యముకు గల ముఖ్య కారణము సంఘమునకు దేవుడు ఏర్పాటు చేసిన కావలివారు సంసిద్ధతతోను మరియు మెళకువగాను లేకపోవుటయే. ఈ కావలివారు నిద్రించునట్లు సాతాను ఏ విధముగా చేసెను? కొన్ని సందర్భాలలో సత్యము చెప్పుట వలన ప్రజలకు అభ్యంతరం కలుగజేస్తామేమో (ముఖ్యముగా ధనికులకు, పలుకుబడిగల వారికి అభ్యంతరం కలుగుజేస్తామేమో) అను భయమును వారిలో కలుగుజేయుట ద్వారా దానిని చేసెను. కొన్ని ఇతర సందర్భాలలో వారిని భార్యలను సంతోషపెట్టునట్లు చేయుటద్వారా మరియు ధనమును, మంచి భోజనమును ప్రేమించునట్లు చేయుటద్వారా దానిని చేసెను. మరికొన్ని సందర్భాలలో కావలివారు సంఘములో దేవునియొక్క ప్రమాణములను కొనసాగించాలని చూచినప్పుడు దాని గూర్చిన వారి బోధలకు ఎడతెగని వ్యతిరేకత వచ్చుటచూచి వారు అలసిపోయి వారి బోధలను ప్రజలను సంతోషపెట్టుస్థాయికి తగ్గించుకొనిరి.

హెబ్రీ 12:3లో "అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి" అని మనకు చెప్పబడెను. యేసును వ్యతిరేకించిన ఈ పాపులు ఎవరు? వారు ఇశ్రాయేలు దేశములో నుండిన వ్యభిచారులు, దొంగలు, హంతకులు కారు. రోమనులు గ్రీకులు కాదు. యేసు ప్రభువును ఎల్లప్పుడూ వ్యతిరేకించిన పాపులు ఎవరనగా బైబిలును బ్రహ్మాండంగా బోధించినవారు మరియు ఇశ్రాయేలులో ఉండిన మత నాయకులు. వారు యేసును గూర్చి అసూయపడి చివరకు ఆయనను చంపిరి.

మనము యేసును వెంబడించినట్లయితే ఇప్పుడు కూడా అదే గుంపుకు చెందిన ప్రజల యొద్దనుండి మనము వ్యతిరేకతను ఎదుర్కొందుము. మనకు వచ్చు అతి గొప్ప వ్యతిరేకత దేవుని ప్రమాణములను తగ్గించి సంఘమును అపవిత్రపరచిన వారియొద్ద నుండియే వచ్చును. అటువంటి వారు మనలను వ్యతిరేకించే సాతానుయొక్క ముఖ్య అనుచరులై ఉన్నారు. అటువంటి యెడతెగని వ్యతిరేకతను ఎదుర్కొనుటలో మనము అలసిపోయి చాలా సుళువుగా నిరుత్సాహపడిపోయే అవకాశమున్నది.

సాతాను "మహోన్నతుని భక్తులను హింస ద్వారా నలుగగొట్టును" (దానియేలు 7:25). దానిని జయించుటకుండిన ఒకే ఒక మార్గము శత్రువుల చేత చంపబడువరకు ఎడతెగని వ్యతిరేకతను ఎదుర్కొనిన యేసు యొక్క మాదిరిని చూచుటయై ఉన్నది. మనము కూడా "మరణము వరకు నమ్మకముగా ఉండుటకు" ఇష్టపడవలెను (ప్రకటన 2:1-5). తన జీవితాంతము వరకు వ్యతిరేకతను ఎదుర్కొనుటకు ఇష్టపడని ఏ బోధకుడైనా చివరకు వినువారి చెవులకు ఇంపు కలిగించు బోధకుడుగా మారి, "ప్రజలను వశపరచుకొనే" (దానియేలు 11:32) వానిగా మిగిలిపోయి, బిలాము వలె చివరకు రాజీపడిపోయిన వానిగా ఉండును.

ఎటువంటి వెల చెల్లించవలసిన వచ్చినా మన మధ్య దేవుని ప్రమాణములను కాపాడుటయే సంఘముగా మనకున్న పిలుపు. అన్ని వేళలయందు క్రీస్తువిరోధియొక్క సైన్యము గూర్చి మనము సిద్ధపాటు కలిగియుండవలసి ఉన్నది. పౌలు ఎఫెసులో ఉన్న మూడు సంవత్సరములలో దేవుని కృపచేత సంఘమును పవిత్రతలో కాపాడెను. కాని అతడు వెళ్ళిపోయే సమయములో, నిశ్చయముగా భ్రష్టత్వములోనికి వచ్చునని అక్కడి పెద్దలతో చెప్పెను (అపొ.కా. 20:29-31). మరియు ఎఫెసీయులకు వ్రాయబడిన రెండవ పత్రికలో (ప్రకటన 2:1-5) మనము చదువునట్లుగా నిజముగానే అలా జరిగెను.